ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు OTT ప్రయోజనాలతో అందుబాటులోకి వచ్చాయి!! వివరాలు ఇవిగో

|

భారతి ఎయిర్‌టెల్ యొక్క డైరెక్ట్-టు-హోమ్ (DTH) విభాగంలోని ఎయిర్‌టెల్ డిజిటల్ TV దాని ఆండ్రాయిడ్ సెట్-టాప్ బాక్స్ (STB) - Xstream బాక్స్‌తో వినియోగదారులకు అనేక అప్‌గ్రేడ్ ప్లాన్‌లను అందిస్తోంది. వినియోగదారులు ఎంచుకోవడానికి మొత్తంగా మూడు అప్‌గ్రేడ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ అన్ని ప్లాన్‌లు ఏడాది పొడవునా OTT ప్రయోజనాలతో వస్తాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ వినియోగదారులను డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓవర్-ది-టాప్ (OTT)ల కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. అంతర్నిర్మిత Chromecast కూడా ఉండడంతో మీరు మీ టీవీలో మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను సౌకర్యవంతంగా ప్రసారం చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు మూడు అప్‌గ్రేడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో మొదటి ప్లాన్ రూ.3049 ధర వద్ద ఉండగా మిగిలిన ప్లాన్‌లు రూ.2999 మరియు రూ.2949 ధరల వద్ద లభిస్తాయి. రూ.3049 ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు ZEE5 ప్రీమియం మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కంపెనీ నుండి Xstream బాక్స్‌ను పొందుతారు. ఇంకా రూ. 2999 ప్లాన్‌తో Xstream బాక్స్‌ని పొందుతారు. అలాగే ఒక సంవత్సరం పాటు Amazon Prime వీడియో యొక్క OTT ప్రయోజనంను ఉచితంగా పొందుతారు. చివరగా రూ.2949 ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా Xstream బాక్స్‌ను పొందుతారు. కనెక్షన్ యొక్క ఇన్‌స్టాలేషన్ కోసం మీరు రూ.250 అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.

Xstream
 

ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్, గుజరాత్, పంచకుల, చండీగఢ్ మరియు మొహాలీలతో సహా ఎంపిక చేసిన నగరాలకు Xstream Box అప్‌గ్రేడ్ యొక్క ఈ ఆఫర్‌లు లేదా ప్లాన్‌లను కంపెనీ పరిమితం చేసింది. అయితే Xstream బాక్స్ రూ.2,499 ధర వద్ద దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉంది. దాని పోటీదారు Tata Sky Binge+ కూడా అదే ధరకు అందుబాటులో ఉంది. అయితే Xstream Boxతో, మీరు Tata Sky Binge+ STBతో చేయలేని కంటెంట్‌ని Netflix నుండి ప్రసారం చేయవచ్చు.

భారతీ ఎయిర్‌టెల్ యొక్క ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ పూర్తి వివరాలు

భారతీ ఎయిర్‌టెల్ తన డిటిహెచ్ ఆర్మ్ కింద ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను అందిస్తుంది. ఇది టాటా స్కై అందించే ఆండ్రాయిడ్ ఎస్‌టిబి యొక్క అదే ధర వద్ద లభిస్తున్నప్పటికీ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఉత్తమమైనది అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అది అందించే ఫీచర్లు చాలా మెరుగ్గా ఉన్నాయి. అందువల్ల అది ఎయిర్‌టెల్ పర్యావరణ వ్యవస్థలో బాగా ఉత్తమంగా ఉంది. మీరు భారతీ ఎయిర్‌టెల్ యొక్క పోస్ట్‌పెయిడ్ మొబైల్ సర్వీసులను కలిగి ఉండడమే కాకుండా మరిన్ని ఇతర సేవలను వినియోగించే వ్యక్తి అయితే కనుక మీరు ఎయిర్‌టెల్ బ్లాక్‌తో అదే బిల్లులో మీ DTH సర్వీసును చాలా సౌకర్యవంతంగా జోడించవచ్చు. ఎయిర్‌టెల్ నుండి అన్నింటికీ ఒకే బిల్లు కింద చెల్లించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఫీచర్ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్ STB ఆండ్రాయిడ్ టివి 9 ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. ఇది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ని రిమోట్‌గా మార్చుకోవడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా కేబుల్స్ లేదా మరేదైనా అవసరం లేకుండా నేరుగా TV లోకి మొబైల్ స్క్రీన్‌లను ప్రసారం చేయడానికి ఒక అంతర్నిర్మిత Chromecast వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Xstream Box New Upgrade Plans Comes With With OTT Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X