Home
News

Airtel Xstream బాక్స్‌పై మరొకసారి ధరలు తగ్గాయి!! కొనుగోలుకు సరైన సమయం...

ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు బ్రాడ్ బ్యాండ్ విభాగంలో కూడా సేవలను అందిస్తున్నది. ఈ విభాగంలో మెరుగైన సేవలతో ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ సంస్థ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ యొక్క ధరను రూ.499 తగ్గించి రూ.2,000కి తగ్గింపు ధర వద్ద అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అనేది కొత్త DTH టెలివిజన్ బాక్స్. ఇది ఏదైనా టెలివిజన్‌ని స్మార్ట్ టీవీగా మెరుగుపరుస్తుంది. ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆప్షన్‌తో పాటు కొత్త ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్‌లను పొందుతున్న వినియోగదారులకు కొత్త ధర వర్తిస్తుందని గమనించాలి. కంపెనీ ఇప్పుడు డైరెక్ట్-టు-హోమ్ (DTH) సెట్-టాప్ బాక్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని వంటి OTT యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను కూడా అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Airtel Xstream బాక్స్ కొత్త ధరలు

Airtel Xstream బాక్స్ కొత్త ధరలు

ఎయిర్‌టెల్ సంస్థ సెప్టెంబర్ 2019లో ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను రూ. 3,999 ధర వద్ద ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్‌తో పాటుగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ఈ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ యొక్క ధరను రూ.2,000కి తగ్గించినట్లు ప్రదర్శిస్తోంది. కంపెనీ గతంలో ఈ బాక్స్‌ను రూ.2,499 ధరకు అందిస్తోంది. టెల్కో ధరను తగ్గించడమే కాకుండా కొత్త కస్టమర్ల కోసం డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, SonyLIV, Eros Now, Hungama వంటి మరిన్ని OTT సబ్‌స్క్రిప్షన్‌లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లేదా ఏదైనా అధీకృత డీలర్ నుండి కొత్త కనెక్షన్‌లను పొందుతున్న వినియోగదారులకు మాత్రమే సవరించిన ధర వర్తిస్తుంది. అయితే సవరించిన ఈ కొత్త ధర పరిమిత కాల ఆఫర్‌గా ఉండే అవకాశం ఉంది.

ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9.0 Pie-ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ OSలో రన్ అవుతుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 5000+ యాప్‌లు మరియు గేమ్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంది. ఇది గూగుల్ అసిస్టెంట్ మరియు స్మార్ట్‌ఫోన్‌తో రిమోట్ మరియు గేమ్‌ప్యాడ్‌తో వాయిస్ సెర్చ్ ను ప్రారంభించే అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ తో కూడా వస్తుంది. DTH సెట్ టాప్ బాక్స్‌తో అనుసంధానించబడిన క్రోమ్ కాస్ట్ సాధారణ DTH సేవలతో పాటు OTT కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌కు ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడానికి WiFi కనెక్షన్ లేదా మొబైల్ హాట్‌స్పాట్ అవసరం. Xstream బాక్స్ యొక్క వీడియో స్ట్రీమింగ్ నాణ్యత కూడా ఇంటర్నెట్ వేగంపై ఆధారపడి ఉంటుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్ ధరలు మరియు ఫీచర్లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్ ధరలు మరియు ఫీచర్లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్ రెండు వేర్వేరు ధరలలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. వినియోగదారులు నెలవారీ ఎంపికకు ఎంచుకుంటే కనుక దీనిని రూ.149 ధర వద్ద పొందవచ్చు. అలాగే వార్షిక ఎంపిక విధానాన్ని ఎంచుకుంటే కనుక దీనిని రూ.1499 ధర వద్ద పొందవచ్చు. వినియోగదారులు వార్షిక ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక వారికి నెలవారీ ధర రూ. 125కి తగ్గుతుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో వినియోగదారులు Eros Now, SonyLIV, Hoichoi, ShemarooMe, Lionsgate Play, Ultra, EpicON, Manorama Max, Divo, Dollywood Play, KLIKK మరియు NammaFlix వంటి OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో చాలా వరకు బాగా ప్రాచుర్యం పొందనప్పటికీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర కూడా చాలా ఎక్కువగా లేదు. మీరు బండిల్ చేయబడిన సబ్‌స్క్రిప్షన్‌కు వెళ్లకూడదనుకుంటే మీరు ఎల్లప్పుడూ ఈ ప్లాట్‌ఫారమ్‌లకు స్వతంత్ర సభ్యత్వం కోసం కూడా వెళ్లవచ్చు. Airtel Xstream వినియోగదారులకు దాని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫారమ్‌ల జాబితాను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాట్‌ఫారమ్‌లకు స్వతంత్ర సభ్యత్వాన్ని కొనుగోలు చేయడానికి వారిని అనుమతిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు మూడు అప్‌గ్రేడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో మొదటి ప్లాన్ రూ.3049 ధర వద్ద ఉండగా మిగిలిన ప్లాన్‌లు రూ.2999 మరియు రూ.2949 ధరల వద్ద లభిస్తాయి. రూ.3049 ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు ZEE5 ప్రీమియం మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కంపెనీ నుండి Xstream బాక్స్‌ను పొందుతారు. ఇంకా రూ. 2999 ప్లాన్‌తో Xstream బాక్స్‌ని పొందుతారు. అలాగే ఒక సంవత్సరం పాటు Amazon Prime వీడియో యొక్క OTT ప్రయోజనంను ఉచితంగా పొందుతారు. చివరగా రూ.2949 ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా Xstream బాక్స్‌ను పొందుతారు. కనెక్షన్ యొక్క ఇన్‌స్టాలేషన్ కోసం మీరు రూ.250 అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.

Best Mobiles in India

English summary
Airtel Xstream Box Prices Dropped Once Again! Offers Amazon Prime, Disney+ Hotstar Free OTT Subscriptions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X