Tata Sky Binge+ vs Airtel Xstream: OTT & సాటిలైట్ టీవీ రెండింటి యాక్సెస్ కోసం బెస్ట్ STB బాక్స్ ఇదే.
టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ (STB) యొక్క ధరలు ఇటీవలే తగ్గింపును పొందాయి. దీని STB యొక్క సాధారణ ధర రూ.3999 నుండి ప్రస్తుతం రూ.2999 కు పడిపోయింది. ఆండ్రాయిడ్-ఆధారిత ఈ STB ఓవర్-ది-టాప్ (OTT) యాప్ కంటెంట్ మరియు సాటిలైట్ టీవీ రెండింటినీ యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

టాటా స్కై బింగే + vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్
ఇండియా యొక్క ప్రస్తుత మార్కెట్ లో టాటా స్కై బింగే + కి ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ నుండి తీవ్రమైన పోటీ ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎస్‌టిబి కూడా ఆండ్రాయిడ్ ఆధారిత STB అయితే ఇప్పుడు టాటా స్కై బింగే + కన్నా రూ.2499 కన్నా తక్కువ ధరను కలిగి ఉంది. కాబట్టి మీరు రెండింటి మధ్య దేనిని ఎంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే కనుక ఇవి అందించే ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ STB బాక్స్ పూర్తి వివరాలు
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అనేది వినియోగదారులను OTTలతో పాటుగా సాటిలైట్ టీవీ కంటెంట్‌ను కూడా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ STBని కొనుగోలు చేసే వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఒక నెల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం చందాకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను పొందుతారు. ‘హాట్‌స్టార్ విఐపి, Zee5 ప్రీమియం, 1 సంవత్సరం ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం చందాను కేవలం రూ.1,699 ధర వద్ద పొందవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులకు దీని మీద 10% ఫ్లాట్ డిస్కౌంట్‌తో కూపన్ కోడ్ ‘ADTV10' ను అదనంగా అందిస్తోంది. దీనిని వారు ఎస్‌టిబి కొనుగోలుకు అన్వయించవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ STB కొనుగోలు మీద డిస్కౌంట్ ఆఫర్లు
కూపన్ కోడ్‌ను అన్వయించిన తరువాత ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ STB యొక్క ధర రూ.2,499 నుండి రూ.2,249 కు తగ్గుతుంది. అంటే వినియోగదారులకు రూ.250 తగ్గింపు లభిస్తుంది. కొనుగోలు సమయంలో వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.100 విలువైన ఎస్‌టిబిపై 1 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎస్‌టిబిని రూ.1,500 కు సమర్థవంతంగా పొందవచ్చు. ఇది భవిష్యత్తులో తిరిగి చెల్లించబడుతుంది.

టాటా స్కై బింగే + STB తగ్గింపు ధరల వివరాలు
టాటా స్కై బింగే + ఎస్‌టిబి యోక్స్ వివరాల విషయానికి వస్తే కొన్ని వారాల క్రితం వీటి యొక్క ధరలు రూ.1,000 తగ్గించింది. ఇప్పుడు దీని ధర కేవలం రూ.2,999 మాత్రమే. దీని కొనుగోలు మీద వినియోగదారులు 6 నెలల బింగే సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందుతారు. బింగే సభ్యత్వంలో డిస్నీ + హాట్‌స్టార్, Zee5 ప్రీమియం, SunNXT, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, హంగమా ప్లే, ఈరోస్ నౌ, మరియు షెమరూమీ వంటి OTT సబ్స్క్రిప్షన్ ఉన్నాయి. వీటితో పాటుగా వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మూడు నెలల సభ్యత్వాన్ని ఉచితంగా కూడా పొందుతారు. ఇందులో గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే బింగే సర్వీస్ యొక్క ధరను ఇప్పుడు నెలకు రూ.249 నుండి రూ .299 కు పెంచారు.

టాటా స్కై బింగే + vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్: బెస్ట్ ఏది?
టాటా స్కై బింగే + మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ STB ల యొక్క ప్రస్తుత ధరల తగ్గింపు తరువాత రెండింటిలో ఉత్తమమైన దానిని ఎంచుకోవడం నిజంగా కష్టంగా ఉంది. రెండు STB ల యొక్క ఆఫర్లు దాదాపు సమానంగా ఉంటాయి. టాటా స్కై బింగే + ఎస్‌టిబి ధర రూ.500 ఎక్కువ అయినప్పటికీ ఆఫర్లలో ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కంటే కొంచెం ముందుంది. ఎందుకంటే ఇది వినియోగదారులకు బింగే సర్వీసును ఉచితంగా అదనంగా అందిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ వినియోగదారులకు ఉచితంగా లభించే ఏకైక OTT చందా ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మాత్రమే.


Click it and Unblock the Notifications








