Airtel Xstream బ్రేక్‌డౌన్ ప్యాక్‌లు ఎంతమేర ఉపయోగకరంగా ఉన్నాయి!!

|

భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ DTH మరియు బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా మంచి యూజర్ బేస్ ని కలిగి ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ పేరుతో అందించే బాక్స్ తో వినియోగదారులు ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా సులభంగా యాక్సిస్ చేయగలరు. ఎయిర్‌టెల్ కంపెనీ ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించడంలో పెట్టుబడిని పెట్టదు కానీ బహుళ కంపెనీలు తమ OTT కంటెంట్‌ను తమ ప్లాట్‌ఫారమ్‌లో అందించడాన్ని మరింత సులభతరం చేస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వినియోగదారులు ఒకే లాగ్-ఇన్ ద్వారా అనేక OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్ ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క ప్రీపెయిడ్/పోస్ట్‌పెయిడ్/బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను తన యొక్క వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్‌ ప్యాక్ గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Airtel Xstream సబ్‌స్క్రిప్షన్‌ ప్యాక్‌ల వివరాలు

Airtel Xstream సబ్‌స్క్రిప్షన్‌ ప్యాక్‌ల వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ని పొందిన వినియోగదారులు ఒక నెల సబ్‌స్క్రిప్షన్ ను రూ.149 ధర వద్ద పొందవచ్చు. అలాగే ఒక సంవత్సరం లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ ను రూ.1499 ధర వద్ద చెల్లించి పొందవచ్చు. ఈ ప్లాన్‌లలో దేనితోనైనా వినియోగదారులు ఏకకాలంలో రెండు స్క్రీన్‌లలో కంటెంట్‌ను చూడగలరు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో వినియోగదారులు ఎయిర్‌టెల్ DTH బాక్స్ (ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్), లార్జ్ స్క్రీన్ (ఫైర్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ మొదలైనవి), డెస్క్‌టాప్ ద్వారా వెబ్‌సైట్‌కి వెళ్లడం, అలాగే iOS మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా అందుబాటులో ఉండడంతో వినియోగదారులు కంపెనీ అందించే అన్ని రకాల కంటెంట్‌లను అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగించడానికి అనుమతిస్తుంది.

సబ్‌స్క్రిప్షన్
 

ఈ సబ్‌స్క్రిప్షన్ కేవలం ఎయిర్‌టెల్ కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌ యాప్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు. లేదా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌ బాక్స్‌ని కొనుగోలు చేయదలచిన వారు ఎయిర్టెల్ థాంక్స్ అప్లికేషన్ ద్వారా కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లోని OTT ప్లాట్‌ఫారమ్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లోని OTT ప్లాట్‌ఫారమ్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వినియోగదారులకు ఎరోస్‌నౌ, సోనీలైవ్, హోయిచోయ్, షెమరూమీ, అల్ట్రా, లయన్స్‌గేట్‌ప్లే, ఎపికాన్, మనోరమమాక్స్, డివో మరియు డాలీవుడ్ నామఫ్లిక్స్ క్లిక్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల యొక్క కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే మీరు తెలుసుకోవలసిన కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సోనీలైవ్ నుండి కంటెంట్ క్రోమ్ కాస్ట్, Mi TV Stick మరియు Amazon Fire TV Stickలో అందుబాటులో ఉండదు. అలాగే సోనీలైవ్ ఒక సమయంలో కేవలం ఒకే ఒక స్క్రీన్ ప్లేని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా లయన్స్‌గేట్‌ప్లే యొక్క కంటెంట్ Amazon Fire TVలో అందుబాటులో ఉండదు.

ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్

భారతీయ టెలికాం సంస్థ మెటావర్స్‌లో OTT ల కంటెంట్‌ను అందిస్తూ ముందుకు దూసుకెళ్లడం ఇదే తొలిసారి. పార్టీనైట్ తో కలిసి ఎక్స్‌స్ట్రీమ్ ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ ను మెటావర్స్‌లో హోస్ట్ చేయబడింది. మెటావర్స్‌లో పరస్పర చర్య చేయడానికి వినియోగదారులు అనుమతించబడతారు. పార్టీనైట్ యొక్క సృష్టికర్త అయిన గామిట్రానిక్స్ యొక్క ఆలోచనలో భాగంగానే ఎయిర్‌టెల్ తో కలిసి పని చేసింది. ఎయిర్‌టెల్ మార్కెటింగ్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ వెబ్ 3.0 అప్లికేషన్‌లు మరియు స్టోరీ టెల్లింగ్ లతో కలిపి వినియోగదారులకు మెరుగైన గొప్ప అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ మెటావర్స్‌తో ఎయిర్‌టెల్ సంస్థ మరింత ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. OTT ప్లాట్‌ఫారమ్‌లను ప్రయత్నించేలా ప్రజలను తనవైపు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఇప్పటికే సుమారు 2 మిలియన్ల మంది పేమెంట్ చందాదారులను కలిగి ఉండడం అనేది గమనించదగ్గ విషయం. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ డిజిటల్ CEO ఆదర్శ్ నాయర్ మీడియా సమావేశంలో తెలిపారు. రాబోయే రోజులలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కోసం 20 మిలియన్లకు పైగా పేమెంట్ చందాదారులను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కారణంగా కంపెనీకి ప్రత్యేక ప్రధాన ఆదాయ వనరులను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే'

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే'

సేఫ్ పే ఫీచర్ అనేది కొత్త విషయం ఏమి కాదు. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది పేమెంట్ ధృవీకరణ ప్రక్రియ యొక్క అదనపు ప్రొటెక్షన్. ఇది వినియోగదారులు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ ద్వారా జరిపే లావాదేవీలు మరింత సురక్షితమైనవిగా చేయడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్సిస్ ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది మీ అకౌంట్ నుండి లావాదేవీలు జరిగిన ప్రతిసారి లావాదేవీని ఆమోదించమని అడగబడుతు నిర్ధారనను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' OTA (ఓవర్ ది ఎయిర్) టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులకు వారి అకౌంట్ నుండి జరిగే లావాదేవీ గురించి హెచ్చరికను పంపుతుంది.

ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్

ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఇందుకోసం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అదనంగా ఏమైనా వసూలు చేస్తుంది అని అనుకుంటే కనుక పొరపాటు. దీనికోసం బ్యాంక్ ఏమి వసూలు చేయదని గమనించండి. కాబట్టి కస్టమర్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఆ లావాదేవీని యాక్సిస్ చేయడానికి వినియోగదారులు వారి mPIN లేదా OTPని నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా సరైన mPIN లేదా OTPని నమోదు చేయడం వలన పేమెంట్ పూర్తిచేయబడుతుంది. కానీ ఎయిర్‌టెల్ సేఫ్ పే రాకతో mPIN లేదా OTPని నమోదు చేసిన తర్వాత కూడా వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి మాన్యువల్‌గా లావాదేవీని ఆమోదించమని అడగబడతారు. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్ అనేది వినియోగదారుల అకౌంట్ నుండి డబ్బు పంపబడుతుందని వారిని హెచ్చరిస్తుంది. సాధారణంగా కొన్నిసార్లు ఎవరైనా తమ అకౌంట్ నుండి డబ్బును పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వినియోగదారులు అర్థం చేసుకోలేరు. కానీ ఈ అదనపు హెచ్చరిక అందుబాటులోకి రావడంతో వినియోగదారులు తాము చేస్తున్న లావాదేవీని ఆమోదించినట్లయితే మాత్రమే వారి డబ్బు తీసివేయబడుతుందని గమనించవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Xstream Breakdown Packs Comes With Several OTT Content Platforms

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X