Home
News

Airtel xstream వాడుతున్నారా!!! ఈ లాంగ్-టర్మ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండి

భారతి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ను ప్రవేశపెట్టిన తరువాత తన మొత్తం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను సవరించింది. ప్రస్తుతం ఇది పనిచేస్తున్న దాదాపు ప్రతి నగరంలోను కేవలం 799 రూపాయల ధర వద్ద 100mbps హై-స్పీడ్ ప్లాన్‌ను అందించడం ప్రారంభించింది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ ఇప్పుడు కేవలం రూ.799, రూ.999, రూ.1,499 మరియు రూ.3999 నాలుగు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను మాత్రమే కలిగి ఉంది. ఇవి అన్ని కూడా 1Gbps వేగంతో డేటాను అందిస్తాయి. జియోఫైబర్ ప్లాన్‌ల మాదిరిగానే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో గల ప్రధాన లోపం అవి ఎఫ్‌యుపి పరిమితితో రావడం.

 

 

 

 లాంగ్-టర్మ్

హైదరాబాద్ వంటి కొన్ని నగరాల్లో ఎయిర్టెల్ అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అపరిమిత డేటాను అందిస్తోంది. కానీ చాలా నగరాల్లో దీనికి FUP పరిమితి ఉంది. తాజా అభివృద్ధి ప్రకారం ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లు ఇప్పుడు ఆరు నెలల లేదా ఒక సంవత్సరం లాంగ్-టర్మ్ సభ్యత్వాలపై అపరిమిత డేటాను అందిస్తున్నాయి. ఇంతకుముందు ISP లాంగ్-టర్మ్ సభ్యత్వాలతో అలాంటి ప్రయోజనాన్ని అందించలేదు. మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ చందా ప్రయోజనాన్ని తొలగించిన తర్వాత ISP నుండి ఇది మంచి చర్య. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ లాంగ్-టర్మ్ ప్లాన్‌లు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ లాంగ్-టర్మ్ ప్లాన్‌లు

చెన్నైలోని ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ మరియు ఎయిర్‌టెల్ సెల్ఫ్ కేర్ పోర్టల్ ద్వారా ఒక సంవత్సరం వరకు చందా కోసం అందుబాటులో ఉన్నాయని మేము గుర్తించాము. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లు కేవలం హైదరాబాద్ మరియు విశాఖపట్నం రెండు నగరాల్లో మాత్రమే అపరిమిత డేటాను అందిస్తున్నాయి. ఇతర నగరాల్లోని వారు నెలవారీ FUP పరిమితితో డేటాను వినియోగిస్తున్నారు. రూ.799 ప్లాన్ ఒక నెలకు కేవలం 150 జిబి డేటాను అందిస్తుంది. అయితే రూ.999 ప్లాన్ 300GB FUP పరిమితితో వస్తుంది.

 

 

ఆరు నెలల ప్యాక్

ఆరు నెలల ప్యాక్

999రూపాయల ధర గల ఆరు నెలల ప్యాక్ రూ.5,544 (18% జీఎస్టీ మినహా) ధరతో ఇది ప్రతి నెలా అపరిమిత డేటాను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ‘అపరిమిత డేటా' అని చెప్పినా కూడా ఇందులో ప్రతి నెలా 3.3TB FUP పరిమితి ఉంటుంది. రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మాత్రమే కాకుండా చెన్నై మరియు ఇతర నగరాల్లో ఇంకా కొన్ని దీర్ఘకాలిక ప్లాన్‌లు కూడా అపరిమిత డేటాతో అందించబడతాయి. ఈ ప్రయోజనం ఆరు నెలలు మరియు ఒక సంవత్సరం చందాలకు మాత్రమే వర్తిస్తుందని గమనించండి మరియు మూడు నెలల సభ్యత్వానికి కాదు.

 

 

నెట్‌వర్క్‌

నెట్‌వర్క్‌

చందాదారులను తన నెట్‌వర్క్‌లో ఎక్కువ కాలం ఉండడానికి వారిని ఆకర్షించడానికి భారతి ఎయిర్‌టెల్ నుండి ఇది మంచి చర్య. రిలయన్స్ జియోఫైబర్ డబుల్ డేటా బెనిఫిట్, OTT యాప్ లకు వార్షిక చందా లేదా రెండు నెలల వరకు అదనపు సర్వీస్ వంటి ప్రయోజనాలతో దీర్ఘకాలిక ప్లాన్‌లపై కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను కలిగి ఉంది.

 

 

రూ.299లకే అన్‌లిమిటెడ్ డేటా యాడ్-ఆన్‌

రూ.299లకే అన్‌లిమిటెడ్ డేటా యాడ్-ఆన్‌

లాంగ్-టర్మ్ ప్లాన్‌లకు అపరిమిత డేటా ప్రయోజనాన్ని చేర్చడం వల్ల రూ.299 యొక్క అపరిమిత డేటా యాడ్-ఆన్‌ను రీఛార్జ్ చేసే వినియోగదారులకు ఇబ్బంది తొలగిపోతుంది. ఎయిర్‌టెల్ చివరిసారిగా ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లను సవరించినప్పుడు రూ.299 యాడ్-ఆన్ యూజర్లకు 3.3TB నెలవారీ డేటాను వినియోగించుకునే వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు మీరు కేవలం 150GB డేటా ప్రయోజనాన్ని అందించే 799 రూపాయల ప్రణాళికలో ఉంటే కనుక మరింత డేటా ప్రయోజనం 3.3TB కోసం ఎయిర్‌టెల్ నిబంధనలలో అపరిమిత డేటాను పొందడానికి మీరు రూ.299ల యాడ్-ఆన్‌ను ఎంచుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Xstream Broadband Long Term Plans: Full Details are Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X