Airtel Xstream OTT ఉచితాలలో బెస్ట్ సెల్లర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే!!!

|

ఇండియాలో భారతి ఎయిర్‌టెల్ సంస్థ టెలికాం రంగంలోనే కాకుండా ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా తన యొక్క సేవలను అందిస్తున్నది. ఈ సర్వీస్ ప్రొవైడర్ అందిస్తున్న రూ.999 ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 'బెస్ట్ సెల్లర్' అని తన యొక్క వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో జియోఫైబర్ కు పోటీగా ఆకర్షణీయమైన సమర్పణలు చాలానే ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ రూ .499, రూ.799, రూ.999, రూ.1,499, రూ.3,999 ఐదు వేర్వేరు ధరల వద్ద ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్‌లన్ని 200Mbps స్పీడ్ మరియు OTT సబ్స్క్రిప్షన్ యాక్సిస్ వంటి ప్రయోజనాలతో వస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.999 ఎంటర్టైన్మెంట్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.999 ఎంటర్టైన్మెంట్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.999 ధర వద్ద అందించే ఎంటర్టైన్మెంట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ వినియోగదారులకు 200Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ స్పీడ్ తో అపరిమిత డేటా ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత డేటాతో వస్తున్నప్పటికి ఇందులో నెలకు 3.3TB లేదా 3300GB డేటా పరిమితి ఉంటుంది. ISP ల్యాండ్‌లైన్ సర్వీస్ ద్వారా ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా అదనంగా ఉంటుంది.

 

Also Read: Reliance Jio vs Airtel vs Vi: Postpaid Plans ప్రయోజనాలలో ఎయిర్‌టెల్,Viలను వెనక్కి నెట్టిన జియోAlso Read: Reliance Jio vs Airtel vs Vi: Postpaid Plans ప్రయోజనాలలో ఎయిర్‌టెల్,Viలను వెనక్కి నెట్టిన జియో

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఉచిత OTT ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఉచిత OTT ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ తన యొక్క వినియోగదారులకు డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా ఈ ప్లాన్‌ను ఎంచుకున్న వారికి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. రూ.999 ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు ఒక నెల ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ HD ప్యాక్ సబ్స్క్రిప్షన్, రూ.999 విలువైన Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్, రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్, మరియు డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ లకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టాండర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టాండర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో రూ.999 కన్నా తక్కువ ధరతో లభించే ప్లాన్‌లతో ఎటువంటి OTT సబ్స్క్రిప్షన్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ఉచితంగా అందించడం లేదు. రూ.499 మరియు రూ.799 ధరల వద్ద లభించే ప్లాన్‌లు 40Mbps మరియు 100Mbps వేగంతో అపరిమిత డేటా మరియు ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలతో వస్తాయి. ఇవి జియోఫైబర్ లో రూ.399 మరియు రూ.699 ధరల వద్ద లభించే స్టాండర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలకు సమానంగా ఉంటాయి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ అధిక ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ అధిక ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను మరియు OTT సబ్స్క్రిప్షన్ లను ఉచితంగా పొందే కారణంతో వినియోగదారులు ఎక్కువ మంది రూ.999 ధర గల ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది అదనంగా ఒక నెలపాటు హెచ్‌డి ఛానల్ ప్యాక్‌ను ఉచితంగా అందిస్తున్న కారణంగా ఎయిర్‌టెల్ పోర్ట్‌ఫోలియోలో ఇది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ఎయిర్‌టెల్‌ సంస్థ తన వినియోగదారులకు రూ.1,499, రూ.3,999 ధరల వద్ద ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నాయి. ఇవి భారీగా డేటాను వినియోగించే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber Best Seller Broadband Plans: Full Details are Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X