బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణలో మరొక అడుగు ముందుకు వేసిన ఎయిర్‌టెల్

|

భారతదేశంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా దేశం మొత్తం మీద విస్తరింపచేయడానికి తన యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. ఈ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో భాగంగా ఎయిర్‌టెల్ సంస్థ 1000 నగరాలలో తన యొక్క సేవలను అందించడానికి చాలా దగ్గరగా ఉంది. Q1 FY23 సమయం నాటికి ఎయిర్‌టెల్ సంస్థ సుమారు 1.7 మిలియన్ హోమ్ పాస్‌లను జోడించింది.

 

ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

ప్రస్తుత సమయంలో ఫిక్స్‌డ్-లైన్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల అవసరం అధికంగా ఉంది. ఎయిర్‌టెల్ యొక్క ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద ISPలలో (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్) ఒకటిగా ఉంది. రిలయన్స్ జియో యొక్క జియోఫైబర్ మాత్రమే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కంటే ముందున్న బ్రాండ్. ఎయిర్‌టెల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ డొమైన్‌ యొక్క కొత్త సబ్‌స్క్రైబర్‌ల జోడింపు మరింత అధికంగా ఉంది. దీనికి సంబందించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్

ఎయిర్‌టెల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్

ఎయిర్‌టెల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వేగవంతమైన రోల్‌అవుట్‌లు మరియు పటిష్టమైన మార్కెటింగ్‌తో రన్ అవుతూ చాలా బలమైన కస్టమర్ బేస్ ని కలిగి ఉండడమే కాకుండా కొత్త కొత్త జోడింపులను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంది. ఈ త్రైమాసికంలో మేము స్థానిక కేబుల్ ఆపరేటర్ మోడల్ ద్వారా వేగవంతమైన రోల్‌అవుట్‌లలో సుమారు 1.7 మిలియన్ హోమ్ పాస్‌లను జోడించాము అని భారతి ఎయిర్‌టెల్ సంస్థ యొక్క CEO గోపాల్ విట్టల్ చెప్పారు. భారతదేశంలో ఎయిర్‌టెల్ సంస్థ ఇప్పుడు దాని యొక్క బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్ ని సుమారు 983 నగరాల్లో కలిగి ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ 3,10,000 మంది కస్టమర్‌లను జోడించిడమే కాకుండా 5.7% ఆదాయ వృద్ధిని కూడా సాధించినట్లు నివేదించింది.

విట్టల్
 

"ఎయిర్‌టెల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్ ను భారతదేశంలో మేము ఇప్పుడు 983 నగరాల్లో కలిగి ఉన్నాము. మేము బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో పోల్ పొజిషన్‌ను నిర్మించడానికి ఈ విభాగంలో పటిష్టమైన పెట్టుబడులు పెడుతున్నాము. Q4FY22లో వన్-ఆఫ్ బెనిఫిట్ యొక్క కొంత ఆఫ్‌సెట్ ఉన్నప్పటికీ మేము 310K కస్టమర్‌లను జోడించాము మరియు 5.7% సీక్వెన్షియల్ రాబడి వృద్ధిని నివేదించాము." అని విట్టల్ చెప్పారు.

బలమైన బ్రాండ్‌

దేశంలోని అన్ని ప్రాంతాలకు ఫైబర్‌ను విస్తరించడం ISPలకు కష్టమైన సమస్య. భారీ మూలధనం మరియు బలమైన బ్రాండ్‌తో కూడిన ఎయిర్‌టెల్ వంటి కంపెనీకి కూడా దేశంలోని ప్రతిచోటా దాని సేవలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం అవసరం ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ ఎక్కడ వేయవచ్చో పరిమితులు ఉన్నాయి. అందువల్ల ఆ ప్రాంతాల్లో టెల్కో వినియోగదారులకు మొబైల్ ఇంటర్నెట్ మరియు కనెక్టివిటీ సేవలను అందించగలదు. టెల్కోలు ఇప్పుడు బ్యాక్‌హాల్ మద్దతు కోసం E-బ్యాండ్ స్పెక్ట్రమ్‌కు ప్రాప్యతను కలిగి ఉన్నాయి.

టీవీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టీవీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ స్టోర్‌లో టీవీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఒకే బిల్లు కింద ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మరియు టీవీ ఛానెల్ సబ్‌స్క్రిప్షన్‌లను రెండింటిని పొందవచ్చు. ఇవి ఒకే సహేతుకమైన ఖర్చుతో వస్తాయి. మేము మాట్లాడుతున్న ఈ ప్లాన్‌లు పాతవి కావు మరియు ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లు కూడా కాదు. ఇవి కేవలం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మాత్రమే. ఈ ప్లాన్ లకు ఎయిర్‌టెల్ టీవీ ఛానెల్‌లను కూడా జోడించింది. అయితే ఈ ప్లాన్‌లను ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లుగా మార్చలేమని దీని అర్థం కాదు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ నుండి లభించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లు టీవీ సేవలను బండిల్ చేస్తూ ఉంటూ నెలకు రూ.699, రూ.1099 మరియు రూ.1599 ధరల వద్ద లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber Broadband Services Very Close to Reaching 1000 Cities in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X