IPL 2022 చివరి మ్యాచ్లను చూడటానికి అనువైన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లు
భారతీ ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ పేరుతో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ఆర్మ్ విభాగంలో ప్రతి నెలా కొత్త కస్టమర్‌లను జోడించడంతో విజయడంకా మోగిస్తూ రెండవ అతిపెద్ద ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ తన యొక్క వినియోగదారులకు అందిస్తున్న అద్భుతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) యొక్క చివరి మ్యాచ్లను ఉచితంగా చూడడానికి అనువైన ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

IPL 2022 కి అనువైన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లు
ప్లేఆఫ్‌లకు అర్హత సాధించే అవకాశాలను పటిష్టం చేసుకునేందుకు అన్ని జట్లు చూస్తున్నందున IPL యొక్క అన్ని మ్యాచ్ లు ఇప్పుడు అత్యంత రసరమ్యంగా ఉండడమే కాకుండా ఉత్తేజకరంగా కూడా ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎవరూ కూడా ఈ యాక్షన్‌ని లైవ్‌లో చూడకుండా మిస్ అవ్వాలని అనుకోరు. అందువల్ల ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అందించే కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇందుకోసం సరైనవిగా ఉన్నాయి. ఈ ప్లాన్‌లు వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందజేస్తాయి. కావున డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీరు IPL యొక్క ఉత్తేజకరమైన అన్ని రకాల మ్యాచ్లను చాలా సౌకర్యవంతంగా చూడవచ్చు.

డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క మొదటి ప్లాన్ రూ.699 ధర వద్ద లభిస్తుంది. ఇది బహుళ ఓవర్-ది-టాప్ (OTT) సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు 40 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ ను అందిస్తుంది. అదనంగా వినియోగదారులు ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడా పుష్కలంగా పొందుతారు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ఇతర ప్లాన్‌లు వరుసగా రూ.799, రూ. 1099, రూ. 1498, రూ. 1599 మరియు రూ.3999 ధరల వద్ద లభిస్తాయి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.799 ధర వద్ద అందించే ప్లాన్‌తో వినియోగదారులు 100 Mbps వేగంతో డేటాను పొందుతారు. అలాగే రూ.1099 ధర వద్ద లభించే ప్లాన్ 200Mbps స్పీడ్‌ని అందిస్తే, రూ.1498 మరియు రూ.1599 ధరల వద్ద లభించే ప్లాన్‌లు వినియోగదారులకు 300Mbps స్పీడ్‌ని అందిస్తాయి. చివరగా రూ.3999 ప్లాన్ వినియోగదారులకు 1 Gbps వేగాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో కొన్ని టీవీ ప్రయోజనాలను కూడా కలుపుకొని లభిస్తాయి. రూ.699 మరియు రూ.1599 ధరల వద్ద లభించే ప్లాన్‌లను కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇవి వినియోగదారులకు టీవీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. రూ.1099 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు టీవీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌లన్నింటిలో ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఎయిర్టెల్ థాంక్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా క్లెయిమ్ చేయవచ్చు.

Airtel Xstream బాక్స్ కొత్త ధరలు
ఎయిర్‌టెల్ సంస్థ సెప్టెంబర్ 2019లో ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను రూ. 3,999 ధర వద్ద ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్‌తో పాటుగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ఈ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ యొక్క ధరను రూ.2,000కి తగ్గించినట్లు ప్రదర్శిస్తోంది. కంపెనీ గతంలో ఈ బాక్స్‌ను రూ.2,499 ధరకు అందిస్తోంది. టెల్కో ధరను తగ్గించడమే కాకుండా కొత్త కస్టమర్ల కోసం డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, SonyLIV, Eros Now, Hungama వంటి మరిన్ని OTT సబ్‌స్క్రిప్షన్‌లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లేదా ఏదైనా అధీకృత డీలర్ నుండి కొత్త కనెక్షన్‌లను పొందుతున్న వినియోగదారులకు మాత్రమే సవరించిన ధర వర్తిస్తుంది. అయితే సవరించిన ఈ కొత్త ధర పరిమిత కాల ఆఫర్‌గా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








