Just In
- 4 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 5 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 8 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 10 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ఎన్నీ, ఆ ఖర్చెంతంటే?
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Sports
పోలీస్ ఆఫీసర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Airtel Xstream ఫైబర్ & టీవీ ఛానెల్‌ల కలయికతో బెస్ట్ ప్లాన్‌లు....
ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో అత్యంత ప్రముఖమైన టెలికాం ప్లేయర్‌లలో భారతీ ఎయిర్‌టెల్ సంస్థ కూడా ఒకటి. ఇది రిలయన్స్ జియో లాగా మరింత అధిక లాభదాయకం కానప్పటికీ మంచి యూజర్ బేస్ ని కూడా కలిగి ఉంది. ఎయిర్‌టెల్ యొక్క ఎకోసిస్టమ్ సర్వీస్‌లు కస్టమర్‌లను మొబైల్ నెట్‌వర్క్ సేవలకు మాత్రమే పరిమితం చేయకుండా బ్రాడ్‌బ్యాండ్ మరియు టీవీ ఛానెల్ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలోని అత్యుత్తమ ISP (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు) లలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఒకటి. ఇది తన యొక్క వినియోగదారులకు 40 Mbps నుండి 1 Gbps వరకు బహుళ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే మీరు టీవీ ఛానెల్‌లతో పాటు లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కోరుకుంటే కనుక ఎయిర్‌టెల్ మీ కోసం అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తుంది. వాటి యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టీవీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
భారతి ఎయిర్‌టెల్ స్టోర్‌లో టీవీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఒకే బిల్లు కింద ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మరియు టీవీ ఛానెల్ సబ్‌స్క్రిప్షన్‌లను రెండింటిని పొందవచ్చు. ఇవి ఒకే సహేతుకమైన ఖర్చుతో వస్తాయి. మేము మాట్లాడుతున్న ఈ ప్లాన్‌లు పాతవి కావు మరియు ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లు కూడా కాదు. ఇవి కేవలం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మాత్రమే. ఈ ప్లాన్ లకు ఎయిర్‌టెల్ టీవీ ఛానెల్‌లను కూడా జోడించింది. అయితే ఈ ప్లాన్‌లను ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లుగా మార్చలేమని దీని అర్థం కాదు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ నుండి లభించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లు టీవీ సేవలను బండిల్ చేస్తూ ఉంటూ నెలకు రూ.699, రూ.1099 మరియు రూ.1599 ధరల వద్ద లభిస్తాయి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో మొదటిది రూ.699 ధరతో లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 40 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ని పొందుతారు. అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలైవ్, ErosNow, లయన్స్‌గేట్ ప్లే, మనోరమమాక్స్, Hoichoi, Ultra, షెమరూ, EPICON, హంగామాక్స్, DivoTV, Klikk, Nammaflix, Dollywood మరియు Shorts TV వంటి 14 OTTలకు ప్రీమియం సింగిల్ లాగిన్ యాక్సెస్‌తో ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. ఈ 14 OTT ప్లాట్‌ఫారమ్‌లు రూ.1099 మరియు రూ.1599 ధరల వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో కూడా అందించబడుతున్నాయని గమనించండి. అదనంగా ఎయిర్‌టెల్ 4K ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో పాటుగా 350 ఛానెల్‌ల టీవీ సర్వీసుకు కూడా ఉచిత యాక్సిస్ లభిస్తుంది. కానీ STB (సెట్-టాప్ బాక్స్) కోసం మీరు రూ. 2,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులు 3.3TB లేదా 3300GB ఉచిత డేటాను పొందుతారు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఎయిర్‌టెల్ నుండి రూ.1099 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వినియోగదారులకు 200 Mbps స్పీడ్‌తో 3.3TB లేదా 3300GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లతో ఎటువంటి ఖర్చు లేకుండా 14 OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ బండిల్ చేయబడి ఉంటుంది. ఇందులో డిస్నీ+ హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ కస్టమర్‌లు 350 ఛానెల్‌లతో ఉచిత టీవీ సభ్యత్వాన్ని కూడా పొందుతారు. నిబంధనలు మరియు షరతులు ఒకే విధంగా ఉంటాయి. అంటే కస్టమర్ STB కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 2000 చెల్లించాలి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.1599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
టీవీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అందించే చివరి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ.1599 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్లకు 300 Mbps వేగంతో 3.3TB లేదా 3300GB డేటాను పొందుతారు. అదనపు ప్రయోజనాల విషయాలలో ముందు ప్లాన్ లాగానే అలాగే ఉంటాయి. వినియోగదారులు Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు Disney+ Hotstar యొక్క అదనపు OTT ప్రయోజనాలను పొందుతారు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నుండి టీవీ మరియు నెట్‌ఫ్లిక్స్ రెండింటితో వచ్చే ఏకైక ప్లాన్ ఇది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క అన్ని ప్లాన్‌లలో సమానంగా ఉండే కొన్ని విషయాల విషయానికి వస్తే ఇవి అన్నీ కూడా 350 టీవీ ఛానెల్‌లు, OTT ప్రయోజనాలు మరియు 3.3TB నెలవారీ డేటా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇంకా ఎయిర్‌టెల్ పైన పేర్కొన్న ప్లాన్‌లలో కస్టమర్‌లకు అంకితమైన రిలేషన్‌షిప్ మేనేజర్‌తో ఎయిర్‌టెల్ బ్లాక్ ప్రయారిటీ కేర్‌ను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లోని OTT ప్లాట్‌ఫారమ్‌లు
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వినియోగదారులకు ఎరోస్‌నౌ, సోనీలైవ్, హోయిచోయ్, షెమరూమీ, అల్ట్రా, లయన్స్‌గేట్‌ప్లే, ఎపికాన్, మనోరమమాక్స్, డివో మరియు డాలీవుడ్ నామఫ్లిక్స్ క్లిక్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల యొక్క కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే మీరు తెలుసుకోవలసిన కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సోనీలైవ్ నుండి కంటెంట్ క్రోమ్ కాస్ట్, Mi TV Stick మరియు Amazon Fire TV Stickలో అందుబాటులో ఉండదు. అలాగే సోనీలైవ్ ఒక సమయంలో కేవలం ఒకే ఒక స్క్రీన్ ప్లేని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా లయన్స్‌గేట్‌ప్లే యొక్క కంటెంట్ Amazon Fire TVలో అందుబాటులో ఉండదు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ప్రస్తుతం మార్కెట్ లో రూ.2,000 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కాబట్టి మీరు మీ యొక్క టీవీలో నేరుగా వేలాది అప్లికేషన్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే టీవీ యొక్క స్క్రీన్‌పై కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ కూడా ఉంది. దీని యొక్క సాయంతో వినియోగదారులు కంటెంట్‌ను సెర్చ్ చేయడం కోసం రిమోట్ లోని గూగుల్ అసిస్టెంట్‌ని యాక్టీవేట్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కి సబ్‌స్క్రిప్షన్ పొందడం వలన మీరు ఒకే లాగిన్‌లో అనేక ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. భారతీ ఎయిర్‌టెల్ నుండి స్మార్ట్ STB వినియోగదారులను గరిష్టంగా 4K రిజల్యూషన్‌లో కంటెంట్‌ను వీక్షించడానికి అనుమతిస్తుంది. కాబట్టి మీరు 4K రిజల్యూషన్ టీవీని కలిగి ఉంటే కనుక మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ నుండి అత్యుత్తమ అనుభవాన్ని పొందవచ్చు. మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌ని కొనుగోలు చేయడం ద్వారా కూడా ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను పొందవచ్చు. అయితే ఇందులో ఛార్జీలు కూడా ఉంటాయి. ఈ STB ఆండ్రాయిడ్ టీవీ9లో రన్ అవుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470