Home
News

AirtelFiber vs JioFiber vs BSNL :తక్కువ ధరలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఇస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు

బిఎస్ఎన్ఎల్ యొక్క భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ తన వినియోగదారుల కోసం ఇప్పుడు తక్కువ ధరలోనే కొత్త ప్లాన్‌లను ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్ రంగంలో దీని యొక్క పోటీదారులు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ కూడా తన వినియోగదారులకు చౌకైన ధరల వద్ద గల ప్లాన్‌లు అపరిమిత డేటాను అందించడం ప్రారంభిస్తున్నాయి. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ మార్కెట్‌లో వివిధ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు తమ ప్లాన్‌లను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. జియో ఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అందించే చౌకైన ప్లాన్‌ల మాదిరిగానే బిఎస్‌ఎన్‌ఎల్ కూడా రూ.500 ధర లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది. ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తన వినియోగదారులకు తక్కువ ధరలో ఉత్తమమైన ప్లాన్‌ను అందిస్తున్నదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.449 భారత్ ఫైబర్ బేసిక్ ప్లాన్

BSNL రూ.449 భారత్ ఫైబర్ బేసిక్ ప్లాన్

బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల రూ.449 ప్రారంభ ధర వద్ద కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ‘భారత్ ఫైబర్ బేసిక్' పేరుతో విడుదల చేసింది. ఇది వినియోగదారులకు ఒక నెల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ మొత్తం చెల్లుబాటు కాలంలో 3.3TB డేటాను 30Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో అందిస్తుంది. FUP డేటా వినియోగం తరువాత డేటా యొక్క వేగం 2 Mbpsకు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌ను దీర్ఘకాలికంగా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లకు ప్రస్తుతానికి అవకాశం లేదు. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా అదనంగా లభిస్తుంది. కస్టమర్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటుగా OTT ప్రయోజనాల కోసం చూస్తున్నట్లయితే ఇందులో మీకు నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఈ ప్లాన్‌ను ఎటువంటి OTT ప్రయోజనాన్ని అందించడం లేదు.

జియోఫైబర్ రూ .399 బ్రోన్స్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

జియోఫైబర్ రూ .399 బ్రోన్స్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

జియోఫైబర్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో భాగంగా కొన్ని వారాల క్రితం రూ.399 ధర వద్ద ‘బ్రోన్స్' పేరుతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ వినియోగదారులకు ఒక నెల చెల్లుబాటు కాలానికి 30 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో కస్టమర్ కు నెలకు 3.3TB డేటా మరియు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. FUP డేటా వినియోగం పూర్తి అయిన తరువాత డేటా యొక్క వేగం 1 Mbps కి తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు ఎటువంటి OTT ప్రయోజనాలు లభించవు. కస్టమర్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలుగా అదనంగా రూ.1000 చెల్లించవలసి ఉంటుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 బ్రాడ్‌బ్యాండ్ అన్‌లిమిటెడ్ ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 బ్రాడ్‌బ్యాండ్ అన్‌లిమిటెడ్ ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో రూ.499 ధర వద్ద ‘అన్‌లిమిటెడ్' పేరుతో అందిస్తున్న ఈ ప్లాన్ తన వినియోగదారులకు 40Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. అంటే ఇది నెలకు 3.3TB డేటాను 40Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో అందిస్తుంది. FUP డేటా వినియోగం తరువాత డేటా వేగం 1Mbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులకు అపరిమిత కాలింగ్ మరియు OTT ప్రయోజనాలు కూడా లభిస్తాయి. OTT ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, షా అకాడమీ, వూట్ బేసిక్, ఈరోస్ నౌ, హంగామా ప్లే, షెమరూ మి, హోయిచోయ్ మరియు అల్ట్రా వంటివి ఉన్నాయి. వినియోగదారులు నెలవారీ ప్లాన్ కోసం వెళితే కనుక ఇన్‌స్టాలేషన్ ఛార్జీలుగా రూ.1000 చెల్లించవలసి ఉంటుంది. అదే ఏదైనా 3, 6, మరియు 12 నెలల దీర్ఘకాలిక ప్లాన్‌లను ఎంచుకుంటే కనుక వారికి ఇన్‌స్టాలేషన్ ఛార్జీల నుండి మినహాయింపు లభిస్తుంది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ vs జియోఫైబర్ vs భారత్ ఫైబర్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ vs జియోఫైబర్ vs భారత్ ఫైబర్

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తక్కువ ధరలో అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఏది అధిక ప్రయోజనాలను అందిస్తుంది అన్న విషయానికి వస్తే OTT ప్రయోజనాలలో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కస్టమర్లు వారి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో ఎక్కువ ప్రయోజనాలను పొందుతారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే BSNL మరియు JioFiber యొక్క చౌకైన ప్లాన్‌లు ఎటువంటి OTT ప్రయోజనాలను అందివ్వవు. డేటా విషయానికి వస్తే ఎయిర్టెల్, జియోఫైబర్ మరియు BSNL మూడు కూడా వాస్తవానికి 3.3TB అంటే 3,333GB FUP పరిమిత డేటాను అందిస్తాయి. ఎయిర్టెల్ 40 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది. ఇది BSNL మరియు JioFiber యొక్క 30 Mbps కన్నా అధిక వేగంగా ఉంటుంది. ఎయిర్‌టెల్ ప్లాన్‌తో పోలిస్తే జియోఫైబర్ రూ.100 చౌకైనది. అయితే ఎక్కువ ప్రయోజనాలు ఇప్పటికీ ఎయిర్‌టెల్ ప్లాన్‌తోనే ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber vs JioFiber vs Bharat Fiber: These Service Providers Offering Low Cost Broadband Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X