Home
News

Airtel vs JioFiber vs BSNL :రూ.999 ధర వద్ద సర్వీస్ ప్రొవైడర్ల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఇదే బెస్ట్..

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం టెలికామ్ రంగంతో పాటుగా బ్రాడ్ బాండ్ రంగంలో కూడా కొత్త భారత్ ఫైబర్ ప్లాన్ లను అధికారికంగా ప్రవేశపెట్టింది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క కొత్త ప్లాన్ల యొక్క ప్రయోజనాలు జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వంటివి వారి వినియోగదారులకు అందించే ప్రయోజనాలకు సమానంగా ఉన్నాయి. కాబట్టి కొత్త వినియోగదారులు ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP)ను ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం కొంచెం కష్టమవుతుంది. ఈ ప్రొవైడర్లందరూ కూడా రూ.999 ధర వద్ద ఇంటర్నెట్ ప్లాన్ ను అందిస్తున్నారు. ఈ ముగ్గురు ఆపరేటర్లలో ఏది ఉత్తమమైన ప్రయోజనాలను కలిగి ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL భారత్ ఫైబర్ రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

BSNL భారత్ ఫైబర్ రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

బిఎస్‌ఎన్‌ఎల్ తన రూ.999 ధర వద్ద వినియోగదారులకు ‘ఫైబర్ ప్రీమియం' పేరుతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3.3TB ఎఫ్‌యుపి డేటాను 200Mbps వేగంతో అందిస్తుంది. FUP పరిమితి దాటిన తర్వాత ఆపరేటర్ డేటా వేగాన్ని 2Mbps కు తగ్గించబడుతుంది. ఫైబర్ ప్రీమియంతో సహా కొత్త భారత్ ఫైబర్ ప్లాన్‌లు ఏవి కూడా దీర్ఘకాలిక సభ్యత్వానికి అందుబాటులో లేవని గమనించాలి. ఇతర భారత్ ఫైబర్ ప్లాన్‌ల మాదిరిగానే ఫైబర్ ప్రీమియం ప్లాన్‌ కూడా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌ను అందిస్తున్నాయి.

 

జియోఫైబర్ రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

జియోఫైబర్ రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

రిలయన్స్ జియో యొక్క ఫైబర్-టు-హోమ్ (FTTH) ఆర్మ్ జియోఫైబర్ కూడా ఆగస్టు చివరిలో తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను మార్పులు చేసింది. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అదే రూ.999 ధర వద్ద తన వినియోగదారులకు 150Mbps వేగంతో ‘గోల్డ్' ప్లాన్ ను అందిస్తుంది. వినియోగదారులు ఈ ఒక నెల చెల్లుబాటు వ్యవధిలో 150Mbps వేగంతో 3.3TB FUP అపరిమిత డేటాను అందిస్తుంది. FUP డేటా వినియోగం తరువాత డేటా యొక్క స్పీడ్ 1 Mbps కి తగ్గించబడుతుంది. ఇదే కాకుండా JioFiber వినియోగదారులకు "అపరిమిత వాయిస్ కాలింగ్" ప్రయోజనం కూడా అందించబడుతుంది. ముఖ్యంగా జియోఫైబర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులు అదనంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ VIP, సోనీ LIV, ZEE5, JioCinema, Lionsgate Play, Voot, SunNXT, Hoichoi, ShemarooMe మరియు ALT బాలాజీలతో వంటి అనేక OTT యాప్ లకు యాక్సిస్ ను ఉచితంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.999 ధర వద్ద అందించే ‘ఎంటర్టైన్మెంట్' బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ వినియోగదారులకు 200Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో వస్తుంది. ఇతర బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్ల మాదిరిగానే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కూడా తన ప్లాన్‌లలో మార్పులను తీసుకువచ్చింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యొక్క ప్రతి ప్లాన్‌తో అపరిమిత డేటాను అందిస్తోంది. ఇది నెలకు 3.3TB చొప్పున ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లతో లయన్స్‌గేట్ ప్లే, వూట్ బేసిక్, ఈరోస్ నౌ, హంగమా ప్లే, షెమరూ మి, హోయిచోయ్ మరియు అల్ట్రా వంటి OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. వీటితో పాటు అదనపు ప్రయోజనాలలో అపరిమిత కాలింగ్ ఆఫర్ కూడా ఉంది. ఏదేమైనా ఎయిర్టెల్ చాలా నగరాల్లో దాని ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వినియోగదారులు OTT ప్రయోజనాలను పొందడానికి ఎక్స్‌స్ట్రీమ్ DTH బాక్స్‌ను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని గమనించాలి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ vs జియోఫైబర్ vs భారత్ ఫైబర్ : రూ.999 ధర ప్లాన్‌లో విజేత

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ vs జియోఫైబర్ vs భారత్ ఫైబర్ : రూ.999 ధర ప్లాన్‌లో విజేత

రూ.999 ధర వద్ద లభించే ఉత్తమమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో మొదటి స్థానం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్. ఇతర ఆపరేటర్ల మాదిరిగానే ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లతో 3.3TB డేటా క్యాప్‌ను అందిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ జియోఫైబర్‌తో పాటు OTT ప్రయోజనాలను కూడా అందిస్తుంది కాని BSNL ఎటువంటి ప్రయోజనాన్ని అందించడం లేదు. ఈ ప్లాన్‌ను దీర్ఘకాలికంగా కోరుకునే వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ దీన్ని అందుబాటులోకి అందిస్తున్నాయి. అయితే బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతానికి దీర్ఘకాలిక ప్రణాళికను అందించడం లేదు. ముఖ్యంగా ఎయిర్టెల్ దీర్ఘకాలిక ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులకు 15% వరకు తగ్గింపును అందిస్తుంది. స్పీడ్ విభాగంలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ 999 ప్లాన్ జియోఫైబర్ యొక్క రూ .999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కంటే ముందుంది.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber vs JioFiber vs Bharat Fiber: Which Broadband Plan Best at Rs.999 Price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X