Home
News

Airtel Xstream ఫైబర్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!! 17 OTTలకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

ఇండియాలో టెలికాం రంగంలో గల భారతీ ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో సేవలను అందిస్తూ మంచి యూజర్ బేస్ ని కలిగి ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ విభాగం సర్వీసు కింద నేడు కొత్తగా మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ జాబితాలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, లయన్స్‌గేట్, హోయిచోయ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో సహా 17 OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కొత్తగా ప్రారంభించిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వినియోగదారులకు అదనంగా 350కి పైగా టీవీ ఛానెల్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తాయి. ఈ ఉచిత బండిల్‌లో ఎయిర్‌టెల్ 4K ఎక్స్‌స్ట్రీమ్ టీవీ బాక్స్ కూడా ఉంది. ఇది వినియోగదారులకు ఈ ఉచిత సేవలన్నింటికీ యాక్సెస్ ఇస్తుంది. బండిల్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ఈ సేవలకు మొదటి నెల అద్దెను ఉచితంగా అందిస్తోంది. అలాగే ఎయిర్‌టెల్ 4K ఎక్స్‌స్ట్రీమ్ టీవీ బాక్స్ ని కొనుగోలు చేసినవారికి ఇన్‌స్టాలేషన్ ఖర్చులు కూడా ఉచితంగా లభిస్తాయి. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొత్త ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ. 699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ. 699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కొత్తగా అందిస్తున్న ప్లాన్‌లో మొదటి ప్లాన్ నెలకు రూ.699 ధర వద్ద లభిస్తుంది. ఇది 40Mbps స్పీడ్ తో అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్ వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంకి ఉచిత యాక్సెస్ ను పొందుతారు. ఇది సోనీలివ్, లయన్స్‌గేట్, హోయిచోయ్, ఈరౌస్ నౌ, మనోరమమాక్స్, షెమరూ, అల్ట్రా, హంగామాప్లే, EPICon వంటి వాటితో పాటుగా 14 OTTల ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. వీటిలో అదనంగా డివోటీవీ, క్లిక్, నమ్మఫ్లిక్స్, డాలీవుడ్ మరియు షార్ట్స్ టీవీ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ డెడికేటెడ్ రిలేషన్ షిప్ మేనేజర్‌తో ఎయిర్‌టెల్ 4K ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో 350కి పైగా టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.1,099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.1,099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కొత్త ప్లాన్‌ల జాబితాలోని రెండవ ప్లాన్ రూ.1,099 ధర వద్ద ఒక నెల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 200Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్ వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లకు కూడా ఉచిత యాక్సెస్ ను పొందుతారు. ఈ ప్యాక్ సబ్‌స్క్రైబర్‌లకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. ఇందులో సోనీలివ్, ఎరోస్‌నౌ, లయన్స్‌గేట్ ప్లే, హోయిచోయ్, మనోరమమాక్స్, షెమరూ, అల్ట్రా, హంగామాప్లే, EPICon, డివోటీవీ, క్లిక్, నమ్మఫ్లిక్స్, డాలీవుడ్ మరియు షార్ట్స్ టీవీతో సహా మరో 14 OTTల ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్‌తో ఎయిర్‌టెల్ 4Ki ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో 350కి పైగా టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కొత్త ప్లాన్‌ల జాబితాలోని చివరి ప్లాన్ రూ.1,599 ధర వద్ద లభిస్తుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా ఒక నెల చెల్లుబాటుతో వస్తుంది. అయితే ఇది 300Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌ని ఎంచుకునే సబ్‌స్క్రైబర్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లకు ఉచిత యాక్సిస్ ని పొందుతారు. వీటితో పాటుగా సోనీలివ్, ఎరోస్‌నౌ, లయన్స్‌గేట్ ప్లే, హోయిచోయ్, మనోరమమాక్స్, షెమరూ, అల్ట్రా, హంగామాప్లే, EPICon, డివోటీవీ, క్లిక్, నమ్మఫ్లిక్స్, డాలీవుడ్ మరియు షార్ట్స్ టీవీతో సహా మరో 14 OTTల ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్‌తో ఎయిర్‌టెల్ 4Ki ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో 350కి పైగా టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Xstream Introduced Three New Fiber Broadband Plans in India: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X