2 మిలియన్ల మార్క్ చేరిన Airtel Xstream OTT యూజర్లు !

By Suguru Subash
|

ఓటీటీ రంగంలో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ స‌రికొత్త రికార్డు సృష్టించింది. త‌మ ప్లాట్‌ఫాంపై వివిధ రకాల ఓటీటీ సేవ‌ల‌ను మొబైల్‌, టీవీ స్క్రీన్ల‌పై అందిస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఓటీటీ స‌రికొత్త‌ మైలురాయిని చేరుకుంది. అతి త‌క్కువ వ్య‌వ‌ధిలో 2 మిలియ‌న్ల పెయిడ్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను క‌లిగి ఉంద‌ని ఎయిర్‌టెల్ డిజిట‌ల్ సీఈవో ఆద‌ర్శ్ నాయ‌ర్ వెల్ల‌డించారు. ఎయిర్‌టెల్ ఎక్స్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఓటీటీ ప్లాట్‌ఫాం యూజ‌ర్ల‌కు పాకెట్ ఫ్రెండ్లీ అనుభూతిని క‌లిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యూజ‌ర్ల‌ను చేరుకునేందుకు ఇది స‌హ‌క‌రిస్తోందని నాయ‌ర్ పేర్కొన్నారు.

Airtel Xtream OTT achieved 2million paid subscribers

తాజాగా చౌప‌ల్ టీవీతో భాగ‌స్వామ్యo

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఓటీటీ తాజాగా చౌప‌ల్ టీవీతో జ‌త‌క‌ట్టింది. ఇదువ‌ర‌కే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ హోయిచోయ్, షెమారో, సోనీ లైవ్‌, ల‌య‌న్స్ గేట్‌, ఇరోస్ నౌ స‌హా ప‌లు 15 ప్ర‌ముఖ‌ ఓటీటీల‌తో భాగ‌స్వామ్యం క‌లిగి ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా చౌప‌ల్ టీవీతో జ‌త‌క‌ట్ట‌డం విశేషం.
ఈ సంద‌ర్భంగా నాయ‌ర్ మాట్లాడుతూ.. "వివిధ ర‌కాల ఓటీటీల‌ను ఒకే స‌బ్‌స్క్రిప్ష‌న్ తో పొంద‌డాన్ని వినియోగ‌దారులు ఇష్ట‌ప‌డ‌తారు. మ‌హారాష్ట్ర, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన వినియోగ‌దారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో వినియోగ‌దారుల స‌గ‌టు వీక్ష‌ణా స‌మ‌యం 150 నిమిషాలు. ఆ స‌మ‌యం కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌న్నారు. అతి త్వ‌ర‌లో 20 మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను మార్కును చేరుకోవ‌డ‌మే ల‌క్ష్యం. అంతేకాకుండా సంస్థ ప్రాంతీయ వినియోగ‌దారుల ఆస‌క్తికి అనుగుణంగా ప‌నిచేయడానికి ప్ర‌య‌త్నిస్తోంది" అని నాయ‌ర్ పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Airtel Xtream OTT achieved 2million paid subscribers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X