Home
News

Airtel యూజర్లు కానీ వారు కూడా Xstream సబ్‌స్క్రిప్షన్ ను పొందే అవకాశం

ఇండియాలో అధిక యూజర్ బేస్ కలిగిన టెలికాం ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అన్ని రకాల సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఎయిర్‌టెల్ కాని ఇతర వినియోగదారులకు కూడా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్ట్రీమింగ్ సర్వీసును అందివ్వనున్నది. కాకపోతే ఉచితంగా మాత్రం కాదు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సర్వీస్ ఇప్పటి వరకు ఎయిర్‌టెల్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ మీద ఆసక్తి గల వారు ఎవరైనా సరే రూ.499 ధర వద్ద పొందవచ్చు. ఈ స్ట్రీమింగ్ సర్వీస్ 350 లైవ్ టివి ఛానెల్‌లు, సినిమాలలను చూడటానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్ అనేది ఇదివరకు ఎయిర్టెల్ సంస్థ యొక్క ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు పరిమితం చేయబడింది. పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కొన్ని ప్లాన్‌లతో ఎయిర్‌టెల్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సభ్యత్వాన్ని అందిస్తోంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రీమియం కంటెంట్‌ను ఆస్వాదించడానికి మరియు డౌన్‌లోడ్ చేయడానికి ఎక్కువ మంది ఎయిర్‌టెల్ వినియోగదారులు దీనిని కొనుగోలు చేస్తూ ఉంటారు.

Airtel యూజర్ కానీ వారికీ Xstream సబ్‌స్క్రిప్షన్ ధరల వివరాలు

Airtel యూజర్ కానీ వారికీ Xstream సబ్‌స్క్రిప్షన్ ధరల వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను ఇప్పుడు ఒక సంవత్సరం చెల్లుబాటుతో రూ.499 ధర వద్ద ఎవరైనా పొందవచ్చు. లైవ్ టీవీ సపోర్ట్ కారణంగా సంస్థ రూ.499 ‘పరిచయ' ధర వద్ద అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మొబైల్ యాప్‌లో 350 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఉండగా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యొక్క వెబ్ వెర్షన్‌లో కేవలం 100 లైవ్ టీవీ ఛానెల్‌లు మాత్రమే ఉన్నాయి. వీటిలో స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ మరియు న్యూస్ జోనర్లలో కొత్తగా 73 లైవ్ టివి ఛానెళ్లను జోడించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లోని లైవ్ టివి ఛానెల్స్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, అస్సామీ, పంజాబీ, భోజ్‌పురి, గుజరాతీ మరియు ఉర్దూ వంటి వివిధ రకాల భాషలలో అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ లైవ్ టీవీ

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ లైవ్ టీవీ

లైవ్ టీవీ యొక్క ఆఫర్లు పక్కన పెడితే ఈ స్ట్రీమింగ్ సర్వీసులో వూట్, Zee5, హంగమా, ఈరోస్ నౌ, షేర్‌ఇట్, యూట్యూబ్, షెమరూమీ, అల్ట్రా మరియు క్యూరియాసిటీ స్ట్రీమ్ వంటి వివిధ స్ట్రీమింగ్ల నుండి 10,000 కి పైగా సినిమాలు మరియు 100 టివి షోలను కూడా చూడవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొందిన వారు గడిచిన ఏడు రోజుల ముందు నుండి టీవీ షోలను చూడగలిగే టీవీ మద్దతును కూడా కలిగి ఉంటుంది.

రిలయన్స్ జియో టీవీ vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

రిలయన్స్ జియో టీవీ vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

రిలయన్స్ జియో తన వినియోగదారులకు లైవ్ టీవీ మరియు సినిమాలను చూడటానికి చాలా యాప్లను కలిగి ఉన్న మాదిరిగా కాకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ వినియోగదారులకు ఒక-స్టాప్ పరిష్కారంగా ఉంటుంది. ఇందులో మంచి విషయం ఏమిటంటే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ యాప్ Chromecast కి కూడా మద్దతు ఇస్తుంది. అంటే మీకు నచ్చిన కంటెంట్‌ను మీ టెలివిజన్ స్క్రీన్ పై ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసారం చేయవచ్చు. నాన్-ఎయిర్టెల్ మరియు ఎయిర్టెల్ కస్టమర్లు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సభ్యత్వాన్ని రూ.499 పరిచయ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Xstream Premium Subscription Access Now Available Non-Airtel Users Also
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X