టాటా ప్లే బింగే+ VS ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్: మీ ఛాయస్ ఏ ఆండ్రాయిడ్ STBకి?

|

భారతదేశంలో డైరెక్ట్-టు-హోమ్ (DTH) విభాగంలో భారతి ఎయిర్‌టెల్ మరియు టాటా ప్లే రెండు ఆపరేటర్‌లు మంచి యూజర్ బేస్ ని కలిగి ఉన్నాయి. ఈ రెండు కంపెనీలూ తమ యొక్క వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తూ అత్యుత్తమ సర్వీస్ ప్రొవైడర్‌లుగా పరిగణించబడుతున్నాయి. ఇవి HD మరియు SD బాక్స్‌లను కలిగి ఉండడంతో పాటుగా ఇవి ఆండ్రాయిడ్ STBలు (సెట్-టాప్ బాక్స్‌లు) లేదా స్మార్ట్ STBలను కూడా తన యొక్క వినియోగదారులకు అందిస్తున్నాయి. స్మార్ట్ STBని మీరు కొనుగోలు చేసినప్పుడు శాటిలైట్ టీవీతో పాటు OTT (ఓవర్-ది-టాప్) కంటెంట్ రెండింటినీ చూడడానికి అనుమతిని కూడా అందిస్తుంది.

ఆండ్రాయిడ్ STB

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ మరియు టాటా ప్లే రెండూ కూడా భారతీయ వినియోగదారులకు వారి ఆండ్రాయిడ్ STBని కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ పేరుతో ఆండ్రాయిడ్ బాక్స్ ని అందిస్తుంటే కనుక టాటా ప్లే సంస్థ దాని ఆండ్రాయిడ్ STB ని టాటా ప్లే బింగే+ పేరుతో అందిస్తున్నది. అయితే ఈ రెండు ఆండ్రాయిడ్ STB లలో మీరు కొనుగోలు చేయడానికి ఏది ఉత్తమంగా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ప్రస్తుతం మార్కెట్ లో రూ.2,000 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కాబట్టి మీరు మీ యొక్క టీవీలో నేరుగా వేలాది అప్లికేషన్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే టీవీ యొక్క స్క్రీన్‌పై కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ కూడా ఉంది. దీని యొక్క సాయంతో వినియోగదారులు కంటెంట్‌ను సెర్చ్ చేయడం కోసం రిమోట్ లోని గూగుల్ అసిస్టెంట్‌ని యాక్టీవేట్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కి సబ్‌స్క్రిప్షన్ పొందడం వలన మీరు ఒకే లాగిన్‌లో అనేక ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

STB
 

భారతీ ఎయిర్‌టెల్ నుండి స్మార్ట్ STB వినియోగదారులను గరిష్టంగా 4K రిజల్యూషన్‌లో కంటెంట్‌ను వీక్షించడానికి అనుమతిస్తుంది. కాబట్టి మీరు 4K రిజల్యూషన్ టీవీని కలిగి ఉంటే కనుక మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ నుండి అత్యుత్తమ అనుభవాన్ని పొందవచ్చు. మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌ని కొనుగోలు చేయడం ద్వారా కూడా ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను పొందవచ్చు. అయితే ఇందులో ఛార్జీలు కూడా ఉంటాయి. ఈ STB ఆండ్రాయిడ్ టీవీ9లో రన్ అవుతుంది.

Airtel Xstream సబ్‌స్క్రిప్షన్‌ ప్యాక్‌ల వివరాలు

Airtel Xstream సబ్‌స్క్రిప్షన్‌ ప్యాక్‌ల వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ని పొందిన వినియోగదారులు ఒక నెల సబ్‌స్క్రిప్షన్ ను రూ.149 ధర వద్ద పొందవచ్చు. అలాగే ఒక సంవత్సరం లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ ను రూ.1499 ధర వద్ద చెల్లించి పొందవచ్చు. ఈ ప్లాన్‌లలో దేనితోనైనా వినియోగదారులు ఏకకాలంలో రెండు స్క్రీన్‌లలో కంటెంట్‌ను చూడగలరు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో వినియోగదారులు ఎయిర్‌టెల్ DTH బాక్స్ (ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్), లార్జ్ స్క్రీన్ (ఫైర్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ మొదలైనవి), డెస్క్‌టాప్ ద్వారా వెబ్‌సైట్‌కి వెళ్లడం, అలాగే iOS మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా అందుబాటులో ఉండడంతో వినియోగదారులు కంపెనీ అందించే అన్ని రకాల కంటెంట్‌లను అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగించడానికి అనుమతిస్తుంది.

టాటా ప్లే బింగే+ STB

టాటా ప్లే బింగే+ STB

టాటా ప్లే బింగే+ STB ని వినియోగదారులు రూ.2199 ధర వద్ద ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కొత్త కస్టమర్ కంపెనీ యొక్క వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లోనే పేమెంట్ ని పూర్తి చేస్తున్నట్లయితే కనుక దీన్ని రూ.200 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఈ STB ధర ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కంటే రూ.100 తక్కువ ధర వద్ద లభిస్తుంది. టాటా ప్లే బింగే+ STB కూడా ఒక ఆండ్రాయిడ్ బాక్స్ కావున ఇది కూడా శాటిలైట్ మరియు OTT కంటెంట్ రెండింటినీ చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్, ముందే లోడ్ చేయబడిన OTT యాప్‌లు, గూగుల్ అసిస్టెంట్‌కు మద్దతు వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. STBల యొక్క ఫీచర్ల మధ్య చెప్పుకోదగ్గ పెద్ద తేడాలు అయితే ఏమి లేవు.

భారతదేశంలో మరింత మెరుగ్గా టాటా ప్లే సేవలు

భారతదేశంలో మరింత మెరుగ్గా టాటా ప్లే సేవలు

GSAT-24 సాటిలైట్ అందుబాటులోకి రావడంతో తన యొక్క వినియోగదారులకు విశ్వసనీయమైన మరియు అతుకులు లేని DTH సేవలను అందించడంలో టాటా ప్లే మరింత మెరుగైన స్థానానికి చేరుకుంటుంది. అలాగే కంపెనీ OTT ఆఫర్‌లను కూడా అధికంగా అందించబోతున్నది. అలాగే DTH విభాగంలో కూడా కంపెనీ యొక్క పోటీదారులతో పోలిస్తే ఖచ్చితంగా ఒక అంచున అధిక స్థానంలోనే ఉంటుంది.

DTH ఆపరేటర్

'డిమాండ్-డ్రైవెన్' మోడల్‌లో ఆపరేషనల్ శాటిలైట్ మిషన్‌లను చేపట్టడానికి భారత ప్రభుత్వంచే NSIL ఏర్పడింది. టెక్‌రాడార్ నివేదిక ప్రకారం GSAT-24 సాటిలైట్ ప్రస్తుతం అందుబాటులోకి రావడంతో టాటా ప్లే విభాగంలో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి వీలును కల్పిస్తుంది. టాటా ప్లే ఇప్పటికే దేశంలో అతిపెద్ద DTH ప్లేయర్ లలో ఒకటిగా కొనసాగుతున్నది. ఈ DTH ఆపరేటర్ తన యొక్క వినియోగదారులకు OTT నెట్‌ఫ్లిక్స్ బండిల్ తో కూడిన టీవీ ప్లాన్‌లను ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ అందించే OTT కాంబో ప్లాన్‌ల విభాగంలో వినియోగదారులు వారి సాధారణ శాటిలైట్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా మరొక 10 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లను కూడా పొందవచ్చు. టాటా ప్లే దాని పోటీదారుల కంటే వేగంగా ముందుకు సాగుతూ కంపెనీని లీడర్ పొజిషన్‌లో ఉంచడంలో GSAT-24 సాటిలైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

టాటా ప్లే బింగే+ VS ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

టాటా ప్లే బింగే+ VS ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

Tata Play Binge+ STB ని కొనుగోలు చేసిన వినియోగదారులు ఒక నెల బింగే సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు. ఇది బండిల్ చేయబడిన OTT ఆఫర్. ఇది ఎయిర్‌టెల్ దాని ఎక్స్‌స్ట్రీమ్ సర్వీస్ ద్వారా అందించే దానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. బింగే సబ్‌స్క్రిప్షన్ నిజానికి డీల్ బ్రేకర్ మరియు టాటా ప్లే బింగే+ STBకి ఎడ్జ్ ఇస్తుంది. అయితే మీరు టాటా ప్లే బింగే సబ్‌స్క్రిప్షన్‌ని మీరు క్రమం తప్పకుండా కోరుకుంటున్నారో లేదో నిర్ణయించుకోవాలి. కాకపోతే మీరు STBలలో దేనికైనా వెళ్లవచ్చు ఎందుకంటే రెండూ కూడా ఒకే రకమైన పోలికలను మరియు ఒకే ధర పరిధిలో అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
Airtel Xstream VS Tata Play Binge+: Which Android STB is Best

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X