ఎయిర్‌టెల్ సిమ్ యాక్టివేషన్ కోసం అదిరిపోయే రీఛార్జ్ కూపన్స్.. రూ.20 బ్యాలెన్స్ ఉంటే సిమ్ సేఫ్..
Airtel SIM activation: భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్, కొత్త కనెక్షన్ తీసుకున్నవాళ్ల కోసం అదిరిపోయే ఆఫర్లతో ఫస్ట్ రీఛార్జ్ కూపన్లు (FRCs) తీసుకొచ్చింది. కొత్త సిమ్ కార్డ్ వేసుకున్న వెంటనే సర్వీసులు వాడాలనుకునే వారికి ఈ కూపన్లు బాగా ఉపయోగపడతాయి. ఒకప్పుడు కొన్ని స్పెషల్ ప్లాన్స్ ఎంచుకుంటేనే సిమ్ యాక్టివేట్ అయ్యేది, కానీ ఇప్పుడు దాదాపు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌తోనూ మీ సిమ్ ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
రూ.128 రీఛార్జ్ చేస్తే చాలు.. సిమ్ రెడీ
కొత్త ఎయిర్‌టెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోవాలంటే కనీసం రూ.128 రీఛార్జ్ చేయాలి. అంతే, సిమ్ ఉపయోగించడానికి సిద్ధమవుతుంది. ఎయిర్‌టెల్‌లో కనీస ధర ప్లాన్ కూడా రూ.199 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపు అందరూ ఈ కండీషన్ ఈజీగా రీచ్ అయిపోతారు.

* రీఛార్జ్ చేయకపోతే ఏమవుతుంది..
ఒకవేళ రీఛార్జ్ చేయకపోతే సిమ్ పరిస్థితి ఏంటనే సందేహం రావచ్చు. 128 కనీస రీఛార్జ్ చేయకపోయినా, లేదా మెయిన్ అకౌంట్లో రూ.20 బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా, నంబర్ డీయాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ వెంటనే కాదు. సిమ్ తీసుకున్న దగ్గర్నుంచి 90 రోజుల వరకు ఎలాంటి యాక్టివిటీ లేకుండా ఉంటేనే మీ నంబర్ డీయాక్టివేట్ చేస్తారు.
యాక్టివిటీ అంటే కనీసం ఒక కాల్ చేయడం లేదా రిసీవ్ చేసుకోవడం, ఒక్క SMS పంపడం, డేటా యూజ్ చేయడం (ఏదైనా అప్‌లోడ్ లేదా డౌన్‌లోడ్), లేదా ఏదైనా వాల్యూ-యాడెడ్ సర్వీస్ యూజ్ చేయడం. ఈ పనులేవీ 90 రోజులు చేయకపోతే, అప్పుడు సిమ్ డీయాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అది కూడా అకౌంట్లో రూ.20 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటేనే. 90 రోజుల తర్వాత కూడా ఎయిర్‌టెల్ మీకు ఇంకో 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఈ టైమ్‌లో మీరు రీఛార్జ్ చేసుకుంటే మీ సిమ్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది. జస్ట్ రూ.20 రీఛార్జ్ చేసినా చాలు. మీ నంబర్ మీకు మళ్లీ వచ్చేస్తుంది.
* రూ.20 బ్యాలెన్స్ ఉంటే సిమ్ సేఫ్..
ఒకవేళ మీ అకౌంట్లో ఆల్రెడీ రూ.20 బ్యాలెన్స్ ఉంటే, మీ సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎయిర్‌టెల్ కంపెనీ ఎంప్లాయిస్ ప్రతి 30 రోజులకి రూ.20 కట్ చేసుకుంటూ ఉంటారు. బ్యాలెన్స్ ఉంటే మీ సిమ్ పర్మినెంట్‌గా వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే రెగ్యులర్‌గా రీఛార్జ్ చేస్తూ ఉండాలి. లేదా కనీసం ₹20 బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి.
* ఎయిర్‌టెల్ వద్దనుకుంటే..
జియో సిమ్ కార్డు తీసుకోవచ్చు. 2025లో కేవలం రూ.189 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 2GB డేటా మీ సొంతం. అంతేకాదు, జియోటీవీ , జియోసినిమా (బేసిక్ యాక్సెస్), జియో క్లౌడ్ కూడా ఫ్రీ. వొడాఫోన్ ఐడియా కూడా మినిమమ్ రీఛార్జ్ ప్లాన్ ధరను తక్కువగానే ఉంచింది. ఆ ప్లాన్ కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








