Home
News

బడ్జెట్ యూజర్లకు ఎయిర్‌టెల్ బంపరాఫర్.. రోజుకు రూ.10కే ఏడాదంతా 2.5GB డైలీ డేటా!

By Ram Kumar

భారతదేశ టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ (Airtel) నమ్మదగిన సర్వీస్‌గా పేరు తెచ్చుకుంది. జియో (Jio) తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా సుమారు 38 కోట్ల మంది వినియోగదారులతో దూసుకుపోతోంది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని, రకరకాల సర్వీసులు అందిస్తుందని చాలామంది పొగుడుతుంటారు.

ఇప్పుడున్న రోజుల్లో రీఛార్జ్ ఖర్చులు మండిపోతున్నాయి. అందుకే చాలామంది నెలనెలా రీఛార్జ్ చేసుకునే బదులు ఒకేసారి ఎక్కువ కాలం పనిచేసే ప్లాన్లు ఎంచుకుంటున్నారు. కస్టమర్ల ఈ అవసరాన్ని గుర్తించి ఎయిర్‌టెల్ అదిరిపోయే లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది.

Airtel s Gift to Budget-Conscious Users  2 5GB Data for 365 Days at rs 10 per Day

అందులో రూ.3,999 ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్‌లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఏకంగా ఒక ఏడాది (365 రోజులు) పాటు పనిచేస్తుంది. అంతేకాదు, ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 SMSలు కూడా ఉచితంగా పంపించుకోవచ్చు.

* డేటా బెనిఫిట్స్

రోజుకి 2.5GB హై-స్పీడ్ డేటా ( High Speed Data) ఇస్తారు. అంటే సంవత్సరం మొత్తానికి 730GB డేటా వస్తుంది. ఒకవేళ మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ ఉంటే, ఎలాంటి ఎక్స్‌ట్రా మనీ చెల్లించకుండా అన్‌లిమిటెడ్ 5G డేటా (Unlimited 5G Data) వాడుకోవచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవాళ్లకి ఇందులో అదిరిపోయే ఆఫర్ ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఫ్రీగా ఇస్తారు. సినిమాలు, టీవీ షోలు, లైవ్ ఛానెళ్లు అన్నీ ఫ్రీగా చూడొచ్చు. వీటితో పాటు ఎయిర్‌టెల్ స్ట్రీమ్ ప్లేలో కూడా ఫ్రీగా బోలెడంత కంటెంట్ చూడొచ్చు.

అంతేకాదు ఇదే ప్లాన్‌లో హలో ట్యూన్స్‌ లెక్కలేనని ఫ్రీగా లభిస్తాయి కాబట్టి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కాలర్స్‌కు బోరింగ్ కాలర్ ట్యూన్ ( Caller Tune) కాకుండా మంచి పాటను వినిపించవచ్చు. వింక్ మ్యూజిక్ (Wnyk Music) కూడా ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఇందులో చాలా పాటలు ఉంటాయి. వాటిని హై క్వాలిటీలో వినొచ్చు.

* మరో రెండు అదిరిపోయే ఎయిర్‌టెల్ ప్లాన్లు..

ఒకటి వచ్చి ఏకంగా రూ.1999 ప్లాన్. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మీకు మొత్తం 24GB డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 SMSలు కూడా ఫ్రీ. డేటా ఎక్కువగా వాడిని వారికి ఇది మంచి పైసా వసూల్ ప్లాన్‌ అని చెప్పవచ్చు.

ఇంకో ప్లాన్ వచ్చేసి రూ.929. ఇది కొంచెం తక్కువ కాలానికి, అంటే 90 రోజుల వరకు వ్యాలిడిటీతో వస్తుంది. కానీ ఇందులో రోజుకి 1.5GB డేటా ఇస్తారు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 SMSలు ఇందులో కూడా ఉన్నాయి. మీ అవసరానికి తగ్గట్టు ఈ ప్లాన్లను ఎంచుకోవచ్చు.

* మరో గుడ్ న్యూస్

సెకండరీ సిమ్ కార్డులు వాడేవారి కోసం ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దగ్గర రెండు సిమ్స్‌ ఉంటే, వాటిని ఎలా వాడాలో ఇప్పుడు కొన్ని రూల్స్ వచ్చాయి. ఒకవేళ సెకండరీ సిమ్‌ను 90 రోజుల పాటు వాడకపోతే అది ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ అవుతుంది. అంటే ఈ 90 రోజుల్లో ఆ సిమ్‌తో ఎవరికీ కాల్ చేయకూడదు, మెసేజ్ పంపకూడదు, ఇంటర్నెట్ వాడకూడదు, ఎలాంటి వాల్యూ యాడెడ్ సర్వీసులు కూడా వాడకూడదు.

ఒకవేళ సిమ్‌లో డబ్బులు ఉండి 90 రోజులు వాడకపోతే, ఆ డబ్బుల్లోంచి రూ.20 కట్ చేసి దాన్ని మరో 30 రోజులు యాక్టివ్‌లో ఉంచుతారు. ఒకవేళ డబ్బులు లేకపోతే మాత్రం సిమ్ డీయాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ నంబర్‌ను వేరే వాళ్లకు ఇచ్చేస్తారు. అయితే, సిమ్ డీయాక్టివేట్ అయినా కూడా 15 రోజుల లోపు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు దగ్గరలోని ఎయిర్‌టెల్ స్టోర్‌కు వెళ్లాలి లేదా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel, India’s second-largest telecom provider, offers a popular Rs 3999 annual plan with unlimited calls, daily 2.5GB data, 5G access, 100 SMS/day, and a Disney+ Hotstar subscription.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X