జియోకి కౌంటర్: Airtel నయా అన్‌లిమిటెడ్ ఆఫర్

Written By:

వరుస ఆఫర్లతో వినియోగదారులను తనవైపు ఆకర్షించుకుంటున్న జియో నెట్‌వర్క్‌కు దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ కౌంటర్‌ ఇచ్చింది. జియో ప్రవేశపెట్టిన ఆఫర్ తోనే Airtel షాక్ ఇచ్చింది. జియో ఇంతకుముందు ప్రవేశపెట్టిన రూ.399 ప్లాన్ తోనే ఇప్పుడు దానికి కౌంటర్ ఇవ్వబోతోంది.

ఫేస్‌బుక్‌‌లో ఇవి చూడకుంటే కొంప కొల్లేరే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.399కే

కేవలం రూ.399కే అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందించేలా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ రిలయన్స్‌ జియో ఇటీవల ప్రకటించిన రూ.399 ఆఫర్‌లాగే ఉంది.

రూ.149 ప్లాన్‌

దీంతో పాటు ఎయిర్‌టెల్‌ రూ.149 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

రూ.349, రూ.399 రెండు ప్లాన్లను

జియో కూడా ఇంతకుముందు రూ.349, రూ.399 రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.349 రీఛార్జ్ చేయించుకొంటే 20 జీబీ డేటా లభిస్తుంది. దీనికి 56 రోజులపాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందుటో డేటా లిమిట్ పూర్తయిన తర్వాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

రూ.399తో రీఛార్జ్ చేయించుకొంటే

రూ.399తో రీఛార్జ్ చేయించుకొంటే దాదాపు ధన్ ధనా ధన్ ఆఫర్ లాగానే ఉంటుంది. ఈ ప్లాన్ ను వేసుకొంటే రోజుకు 1జీబీ 4 జీ చొప్పున 84 రోజుల కాల పరిమితి లభిస్తోంది.

వినియోగదారులను ఆకర్షించడానికి

రిలయన్స్‌ జియో వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగ దారులను ఆకర్షించడం వల్ల ఇతర నెట్‌వర్క్‌ల వ్యాపారం బాగా పడిపోయింది.దీంతో వినియోగదారులను ఆకర్షించడానికి అవి కూడా జియో బాటపడుతున్నాయి.

వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసేందుకు

ఇప్పటికే 12 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న జియో.. తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసేందుకు 4జీ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే దీన్ని లక్షలాది మంది బుక్‌ చేసుకున్నారు.

ఎయిర్‌టెల్‌ సైతం

ఎయిర్‌టెల్‌ సైతం రూ.2500కు ఓ ఫోన్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel's Latest Offer To Counter Jio: 84 GBs Of Data, Unlimited Calls At Rs. 399 Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot