Home
News

ఎయిర్‌టెల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్,రోజుకు 3జిబి డేటా

దేశీయ టెలికాం రంగంలో జియోతో ఎయిర్‌టెల్ ఢీ అంటే ఢీ అంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో జియోతో ఎయిర్‌టెల్ ఢీ అంటే ఢీ అంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియో రూ.509 ప్లాను కాలపరిమితి 28 రోజులు కాగా... ఎయిర్‌టెల్ 82 రోజుల కాలపరిమితితో ఈ కొత్తప్లానును తీసుకొచ్చింది. జియో ఆఫర్‌లో రోజుకు 3 జీబీ డేటాతోపాటు, 100 మెసేజ్‌లు అందుతున్నాయి.

రూ.558తో కొత్త ప్లాన్

రూ.558తో కొత్త ప్లాన్

రూ.558తో కొత్త ప్లాన్ ద్వారా 82 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తంగా యూజర్లకి 246GBs 3జీ /4జీ డేటా లభిస్తుంది. 100 local and national free SMSలు లభిస్తాయి. ఈ ప్లాను కోసం official website of Airtel (airtel.in)ని సందర్శించగలరు.

రూ.309, రూ.509 ప్లాన్స్‌

రూ.309, రూ.509 ప్లాన్స్‌

కాగా జియో ప్రస్తుతం రూ.309, రూ.509 ప్లాన్స్‌ కూడా రెండు నెలల పాటు వాలిడిటీలో ఉన్నాయి. రూ.309 ప్లాన్‌ కింద 60జీబీ డేటాను, రూ.509 ప్లాన్‌ కింద 128జీబీ డేటాను జియో అందిస్తోంది. రూ.999 ప్లాన్‌ కింద రూ.90జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు.

 వొడాఫోన్

వొడాఫోన్

మరో టెలికామ్ సంస్థ వొడాఫోన్ కూడా ఇటీవలే రూ.511, రూ.569 ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.511 ప్లాన్ కింద రోజుకు 2 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. రూ.569 ప్లాన్ కింద రోజుకు 3 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల అందిస్తోంది. ఈ రెండు ప్లాన్ల కాలపరిమితి 84 రోజులు.

బీఎస్‌ఎన్‌ఎల్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌

ఇక దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ డేటా సునామి' ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌ కింద 98 రూపాయలకే రోజుకు 1.5 జీబీ డేటాను 26 రోజుల పాటు ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త ఆఫర్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్కిల్స్‌లో వెంటనే అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Best Mobiles in India

English summary
Airtel's New Rs. 558 Prepaid Plan Offers 3GB Per Day Data For 82 Days. Other Benefits Here More news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X