ఎయిర్‌టెల్ కొత్త పాన్లు జియోతో పోటీ పడతాయా..? స్మార్ట్ లుక్కేయండి

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియోకి పోటీగా ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తూనే ఉంది.

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియోకి పోటీగా ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తూనే ఉంది. గత వారం రోజుల్లో వినియోగదారుల కొసవ ఏకంగా మూడు సరికొత్త ఆకర్షణీయమైన ప్లాన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. అయితే ఇది ఎంత మాత్రం జియోకి ప్లాన్లకు పోటీ ఇవ్వగలదని టెక్ విశ్లేషకులు మెదడుకు పనిచెబుతున్నారు. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.249రీఛార్జ్‌ చేసుకుంటే 56జీబీ ఇంటర్నెట్‌ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్‌ కాలపరిమితి 28 రోజులు. కాగా, గతంలో రూ.349 రీఛార్జ్‌తో 2.5జీబీ డేటాను అందించేది.ఇప్పుడు తీసుకొచ్చిన రూ.249రీఛార్జ్‌తో అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు.

Airtel

ఐపీఎల్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రిలయన్స్‌ జియో రూ.251ఐపీఎల్‌ ప్యాక్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 51 రోజుల పాటు 104జీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా రూ.248కే రోజుకు 3జీబీ డేటాను అందిస్తోంది. మరి వీటితో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ పోటీ పడుతుందా లేదా అన్నది ముందు ముందు చూడాల్సిందే.

దీంతోపాటు రూ.349 ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందించనుంది. కాగా రూ.499 రీఛార్జ్‌తో నిన్న కొత్త ప్రీపెయిడ్‌ను ప్రకటించింది. ఇందులో ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు, రోజుకు 2జీబీ డేటాను 82 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ సందర్భంగా దిగ్గజాలు ఇస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవేఐపీఎల్ సందర్భంగా దిగ్గజాలు ఇస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే

దీంతో పాటు ఎయిర్టెల్ రూ. 499 ప్లాన్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్‌ లిమిటెడ్‌, లోకల్‌, రోమిండ్‌ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది. దీని అర్థం, ఎయిర్‌టెల్‌ మొత్తం 164జీబీ డేటాను అందిస్తుందన్నమాట. ఈ క్రమంలో ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజూ లభించే 2 జీబీ డేటాను ఉపయోగించుకుని రోజూ ప్రసారమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లను ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో వీక్షించవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel’s Rs 249, Rs 349 prepaid recharge compared with Jio’s Rs 299, Rs 349 prepaid plans More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X