Just In
- 50 min ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 3 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 5 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 7 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Movies
విజయ్ భార్యకు న్యాయం చేయాలి అంటూ కామెంట్స్.. ఆమెతో రెండో పెళ్లి వార్తలు.. ఎలా స్టార్ట్ అయ్యాయంటే?
- News
`పొంగులేటి`తో వైఎస్ షర్మిల మంతనాలు- భారీ ఆఫర్: ఆ ఒక్కటీ తప్ప..!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 5 అంశాలు ప్రాణాలు తీస్తాయి, వాటితో జాగ్రత్త అవసరం
- Sports
IND vs NZ: శతక్కొట్టిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Finance
Jio 5G: కొత్త రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ఎయిర్‌టెల్ ఆరు నెలల అపరిమిత ప్లాన్, ఓ లుక్కేసుకోండి
దేశీయ రంగంలో పెను సవాల్ విసురుతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.995కి ఓ కొత్త ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. జియోకి పోటీగా వచ్చిన ఈ ప్లాన్లో కస్టమర్లకు ఆరు నెలల పాటు అపరిమిత ఆఫర్ లభించనుంది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 6జీబీ డేటా వస్తుంది. దీన్ని నెలకు 1జీబీ చొప్పున వాడుకోవచ్చు. ఇక 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. కాగా జియోలో ఇదే ప్లాన్ రూ.999కు లభిస్తుండగా దాంట్లో వినియోగదారులకు 60 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు ఎయిర్‌టెల్ లో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ ప్లాన్లు మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 98 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
airtel రూ. 98 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను సమీక్షించింది. రూ. 98 రీచార్జ్‌పై రోజువారీ పరిమితి లేకుండా 28 రోజుల వ్యవధిలో 5జీబీ (3జీ / 4జీ)డేటా ఉచితమని ప్రకటించింది. అంటే 28 రోజుల్లో ఎపుడైనా మొత్తం 5జీబీ డేటాను వాడుకనే సౌలభ్యాన్ని అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఆఫర్లు లేవు. అలాగే ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా రూ. 93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో కూడా ఇటీవల మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 1 జీబీ( 3జీ / 4జీ) డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం.

రూ.9 ఆఫర్..
ఎయిర్‌టెల్ రూ.9 ఆఫర్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు అదనంగా రోజులో 100 ఎస్‌ఎంఎస్‌లను, 100 ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. కాగా ఇది ఒకరోజు వ్యాలిడిటీతో వచ్చింది. రిలయన్స్ జియో రూ.19 ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ ఈ రూ.9 రీఛార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది.

జియో రూ.19 ప్లాన్‌లో..
జియో ఆఫర్ చేస్తున్న రూ.19 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, 20 ఎస్‌ఎంఎస్‌లు, 150ఎంబీ డేటాను మాత్రమే వినియోగదారులు పొందుతున్నారు. ధర పరంగా, ఆఫర్ల పరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్‌టెలే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది.

రూ.23 plan
రూ.23తో ఎయిర్‌టెల్ మరో ప్లాన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 200 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులు పొందుతారు. కాగా ఇది రెండు రోజుల వరకు యూజర్లు వాడుకోవచ్చు.ఈ ప్లాన్లు కంపెనీ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోంబో ఆఫర్ సెక్షన్ కింద ఈ రీఛార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంది.

రూ.98 ప్యాక్
ఇదిలా ఉంటే నెల రోజుల పాటు ఇలాంటి ప్రయోజనాలు పొందాలనుకునే వారికి కూడా ఎయిర్‌టెల్ రూ.98 ప్యాక్‌ను ఇటీవల లాంచ్ చేసింది. దీని కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్‌పై ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ 4జీ లేదా 3జీ డేటాను కస్టమర్లకు ఎయిర్‌టెల్ 28 రోజుల పాటు అందిస్తోంది.

ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ బెస్ట్ అనే దానికి కారణాలు !
ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను రివిజన్ చేసింది. Rs. 399, Rs. 499, Rs. 799, and Rs. 1,199 ప్లాన్లను రివిజన్ చేసి అధిక డేటా ఆఫర్ ని అందిస్తోంది. నెల రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్లో యూజర్లకు డబుల్ డేటా బెనిఫిట్లు అందుతాయి. ఇందులో ముఖ్యంగా Rs. 499 ప్లాన్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.

Double data benefit
ఈప్లాన్లో భాగంగా 40GB of 3G/4G dataను యూజర్లకు అందిస్తోంది. దీంతో పాటు unlimited local, STD and roaming callsను అందిస్తోంది. రోమింగ్ సమయంలో మీరు incoming and outgoing calls చేసుకోవచ్చు. ఇంతకు ముందు 20GB of 3G/4G లభించేది.

Data Rollover feature
ఈ ప్లాన్లో మీరు ఈ నెలలో డేటా వాడకం ఏదైనా మిగిలి ఉంటే అది వచ్చే నెలకు యాడ్ అవుతుంది. ఇలా 200 జిబి వరకు మీకు వచ్చే నెలకు వాడని డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు MyAirtel app ద్వారా రిమెయినింగ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.

Other benefits
దీంతో పాటు ఈ ప్లాన్లో మీకు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. Wynk Music, Live TV & Movies, and handset damage protection లాంటివి ఉచితంగా మీకు అందుతాయి.దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందే అవకాశాన్ని ఈ ప్లాన్ కల్పిస్తోంది. దీని ధర రూ. 999. అయితే ఇది పూర్తిగా ఉచితం.

Watch Amazon Prime for free with Airtel TV
ఏడాది పాటు ఉచిత ప్రైమ్ మెంబర్ షిప్ మీకు అమెజాన్ నుంచి కావాలంటే మీరు ముందుగా Airtel TV app యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు Amazon Prime app డౌన్లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా మీరు ఏడాది పాటు అన్ లిమిటెడ్ సినిమాలు ,అలాగే టీవీషోలు ఉచితంగా వీక్షించవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470