అకాయ్ ఎల్‌ఈడి టివి, ధర కేవలం రూ 11,000 మాత్రమే

అకాయ్ 19ఇంచ్ ఎల్‌ఈడి టివి మీకు ఏమేమి అందిస్తుందంటే హెచ్‌డితో పాటు డైనమిక్ కాంట్రాస్ట్ 100000:1, ఇక రిజల్యూషన్ విషయానికి వస్తే 1366 x 768 ఫిక్సల్ సమార్ద్యం కలిగి ఉంటుందన్నారు. అంతేకాకుండా 16.7మిలియన్ కలర్స్‌ని ఇది డిప్లే చేస్తుంది. ఇక ఈటివిలో ముఖ్యంగా మనం ప్రస్తావించుకోదగ్గ ఫీచర్ ఏమిటంటే వీడియో రికార్డింగ్ ఫీచర్ డిటివి. రిమోట్‌లో ఉన్నటువంటి రికార్డింగ్ కీ బటన్ నొక్కగానే వీడియో యయస్‌బి లోకి రికార్డ్ అవుతుంది.
అంతేకాకుండా యుయస్‌బి నుండే మీరు డైరెక్ట్‌గా మంచి క్లారిటీ సౌండ్‌తో సినిమాలను ఇందులో చూడోచ్చు. ఈ టివి మీకు డిజిటల్ మరియు ఎనలాగ్ సిగ్నల్స్‌గా పనిచేస్తుంది. ఈ టివిని ముఖ్యంగా ఇండియాలోకి విడుదల చేయడానికి ముఖ్యకారణం మీ డబ్బుకి వాల్యూని తీసుకోని రావడమేనని అంటున్నారు. అంతేకాకుండా ఇందులో పోందుపరచినటువంటి లేటేస్ట్ ఫీచర్స్ యూజర్స్‌కి ఓ అద్బుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని అందించునుంది. ఇక అకాయ్ ప్రవేశపెట్టినటువంటి ఈ టివి బరువు కూడా కేవలం 3.5కేజీలు మాత్రమే.


Click it and Unblock the Notifications








