అల్‌ఖైదా చేతుల్లోకి భారత రైల్వే వెబ్‌సైట్ : చిందిన రక్తానికి ప్రతీకారమంటూ మెసేజ్

Written By:

ఇండియన్ రైల్వే నిర్వహిస్తున్న మైక్రోసైట్ రైల్ నెట్ ను అల్ ఖైదా ఉగ్రవాదులు హ్యాక్ చేశారు. కేంద్ర రైల్వేల్లో భాగమైన భుసావల్ డివిజన్ పర్సనల్ విభాగం నిర్వహించే సైట్ పేజీలను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు,దక్షిణాసియా అల్ ఖైదా చీఫ్ మౌలానా అసీమ్ ఉమర్ సందేశాన్ని అక్కడ ఉంచారు.

అల్‌ఖైదా చేతుల్లోకి భారత రైల్వే వెబ్‌సైట్

హ్యాకయిన సైట్ లో సందేశం ఇలా ఉంది. మీ సముద్రంలో ఎలాంటి తుఫానూ లేదెందుకు..?మౌలానా అసీమ్ ఉమర్ నుంచి భారత ముస్లింలకు ఓ సందేశం అంటూ ఆ మెసేజ్ తో కలిపి మొత్తం 11 పేజీల డాక్యుమెంట్ ను ఉంచారు. భారత ముస్లింలు మరచిపోయిన జీహాద్ పాఠాలను నేర్పి వారిని యుద్ధ రంగానికి కదిలేలా చేయగలవారెవరు..?బాలాకోట్ లో చిందిన రక్తానికి ప్రతీకారం ఎవరు తీర్చుకోవాలి..? అంటూ ఉగ్రవాదం వైపు యువతను మళ్లించేలా ఆ డాక్యుమెంట్ సాగిందీ.

అల్‌ఖైదా చేతుల్లోకి భారత రైల్వే వెబ్‌సైట్

కాగా అల్ ఖైదా చీఫ్ ఉమర్ అలియాస్ సనౌల్ హక్ ,యూపీ పరిధిలోని సంభల్ వాసీ, 1992లో బాబ్రీ మసీద్ విధ్వంసం తరువాత ప్రతీకారేచ్ఛతో ఉగ్రవాదుల్లో కలిసిపోయారు. 1995 నుంచి ఉమర్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నాడో జాడలు నిఘావర్గాలకు ఇప్పటిదాకా తెలియదు.

అల్‌ఖైదా చేతుల్లోకి భారత రైల్వే వెబ్‌సైట్

గత సంవత్సరంలో భారత ఉపఖండానికి అల్ ఖైదా విభాగం ఛీఫ్ గా ఉమర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సంధర్భంగా ప్రపంచంలో గతేడాది జరిగిన అతి పెద్ద హ్యాకింగ్స్ గురించి తెలుసుకుందాం.

Read more: హ్యాకింగ్ తో దేశాలను హడలెత్తిస్తున్న ఐఎస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్‌‌లు హ్యాక్

100 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్‌‌లు హ్యాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను టార్గెట్ చేస్తూ జూలైలో పబ్లిక్‌లోకి చొరబడిన ‘స్టేజ్‌ఫ్రైట్' అనే మాల్వేర్, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను చుట్టిముట్టినట్లు సెక్యూరిటీ సంస్థ జింపీరియమ్ గుర్తించింది. ఈ మాల్వేర్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టే క్రమంలో గూగుల్ యుద్ధ ప్రాతిపదికన ప్యాచప్ చర్యలు చేపట్టింది.

లక్షన్నర కార్లు వెనక్కి

తాము అభివృద్థి చేసిన యు కనెక్ట్ ఫీచర్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకోవటంతో Fiat Chrysler Automobiles లక్షన్నర కార్లను రీకాల్ చేసింది. కార్లలో పొందుపరిచే ఈ యు కనెక్ట్ పీచర్ ఫోన్ కాల్స్‌ను ఎనేబుల్ చేయటంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అలానే నేవిగేషన్‌ను కంట్రోల్ చేస్తుంది. యుకనెక్ట్స్ సెల్యులార్ కనెక్షన్‌లోని సెక్యూరిటీ లొసుగులను ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు కార్లకు సంబంధించి ఐపీ అడ్రస్‌‌లను తమ ఆధీనంలోకి తీసుకుని అలజడి సృష్టించారు.

 

 

అక్రమ సంబంధాల వెబ్‌సైట్‌ను హ్యాకర్లు విడిచిపెట్టలేదు

యాష్లే మాడిసన్ డేటింగ్ వెబ్‌సైట్ హ్యాకింగ్ భాగోతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.. ఈ అక్రమ సంబంధాల వెబ్‌సైట్‌లోని సభ్యులకు సంబంధించిన చాటు మాటు వ్యవహారాలను చాకిచక్యంగా దొంగిలించిన హ్యాకర్లు దశలు వారీగా ఆ డేటాను ఇంటర్నెట్‌లో విడుదల చేసారు. మొదటి దశలో36 మిలియన్ల మంది ప్రొఫైల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని రెండవ దశలో 20 జీబిల నిడివిగల డేటాను హ్యాకర్లు లీక్ చేసారు. వెబ్‌సైట్‌కు సీఈఓకు సంబంధించిన ఈ-మెయిల్స్‌తో పాటు మొత్తం కంపెనీకి సంబంధించిన సోర్స్ కోడ్స్ ను కూడా హ్యాకర్లు ఆన్ లైన్ లో ఉంచారు.

 

 

జీఎమ్ సంస్థ కార్లను హ్యాక్ చేసిన యువ హ్యాకర్

29 సంవత్సరాల యువ హ్యాకర్ సామీ కామ్కర్ తాను సొంతంగా అభివృద్థి చేసిన ఓ గాడ్జెట్ సహాయంతో జీఎమ్ సంస్థ కార్లలోని ఆన్‌స్టార్ సిస్టమ్‌ను హ్యాక్ చేయగలిగారు. OnStar రిమోట్ లింక్ యాప్‌ను అప్ డేట్ చేయటం ద్వారా జీఎమ్ సంస్థ ఈ హ్యాక్‌ను నివారించగలిగింది.

 

 

ఫోన్ మెసేజ్‌తో కారు బ్రేకులనే ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు

ఓ పరిశోధనలో భాగంగా రిసెర్చర్లు Corvette కారుకు సంబంధించిన బ్రేకులను టెక్స్ట్ మేసెజ్ ద్వారా కంట్రోల్ చేయగలిగారు.

 

 

యాపిల్ సంస్థకు తప్పని అవమానం

సెక్యూరిటీ విషయంలో ఎంతో కట్టుదిట్టంగా వ్యవహరించే యాపిల్ సంస్థ కూడా ఓసారి హ్యాకర్ల ఉచ్చులో పడాల్సి వచ్చింది. Mac OS X 10.10లోని సెక్యూరిటీ లోపాన్ని ఆసారా తీసుకున్న హ్యాకర్లు ఓ వ్యక్తి కంప్యూటర్‌లోకి చొరబడి మల్వేర్‌లతో కూడిన యాప్స్‌ను ఇన్స్‌స్టాల్ చేసారు. సమస్యను గుర్తించిన యాపిల్ హుటాహుటిన సమస్యను పరిష్కరించింది.

 

 

 

ఎలాంటి కార్ లాక్‌నైనా ఓపెన్ చేసే 30 డాలర్ల టూల్

30 డాలర్లను వెచ్చించి ఓ హ్యాకర్ అభివృద్థి చేసిన టూల్ ఎలాంటి కార్ లాక్‌నైనా ఓపెన్ చేసేస్తుంది.

 

 

డెల్ కంప్యూటర్స్

గడిచిన నెలలో డెల్ కంప్యూటర్స్ మేజర్ సెక్యూరిటీ సమస్యను ఫేస్ చేయవల్సి వచ్చింది.

 

 

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌‌లోనూ సెక్యూరిటీ సమస్య

మొజిల్లా తన ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌‌లో అతిపెద్ద సేక్యూరిటీ లోపాన్ని గుర్తించింది. ఈ సెక్యూరిటీ లోపం కారణంగా హ్యాకర్ల యూజర్‌కు తెలియకుండా కంప్యూటర్ నుంచి డేటాను దొంగిలించే ప్రమాదముందని హెచ్చరించింది. వెంటనే తమ సాఫ్ట్‌వేర్‌అను అప్‌డేట్ చేసుకోవాలని మొజిల్లా తెలిపింది. Show Thumbnail

 

 

పిల్లల ప్రొఫైల్స్‌ను కూడా విడిచిపెట్టలేదు

చైనాకు చెందిన ప్రముఖ టాయ్ మేకర్ వీటెక్ మేజర్ సెక్యూరిటీ సమస్యను ఫేస్ చేయవల్సి వచ్చింది. ఈ సంస్థ పై దాడులకు తెగబడిన హ్యాకర్లు 4.9 మిలియన్ల పేరెంట్ అకౌంట్ లతో పాటు 6.7 మిలియన్ల కిడ్స్ ప్రొఫైల్స్ ను దొంగిలించారు.

 

 

అత్యంత కరడుగట్టిన హ్యకర్స్ జాబితాలో కెవిన్ మిట్‌నిక్

ఇప్పటివరకు అత్యంత కరడుగట్టిన హ్యకర్స్ జాబితాలో కెవిన్ మిట్‌నిక్ (Kevin Mitnik) ముందున్నాడు.

రెండవ స్థానంలో నిలిచిన ఆడ్రెయిన్ లామో

రెండవ స్థానంలో నిలిచిన ఆడ్రెయిన్ లామో ‘Adrian Lamo' మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసి చరిత్ర సృష్టించాడు.

మూడవ స్థానంలో నిలిచిన జొనాత్ జేమ్స్

మూడవ స్థానంలో నిలిచిన జొనాత్ జేమ్స్ ‘Jonathan James' 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపబడ్డాడు.

నాలుగవ స్ధానంలో నిలిచిన హ్యాకర్ రాబర్ట్ టాప్పన్ మోరిస్

నాలుగవ స్ధానంలో నిలిచిన హ్యాకర్ రాబర్ట్ టాప్పన్ మోరిస్ ‘Robert Tappan Morris'.

ఐదో స్ధానంలో నిలిచిన మరో హ్యాకర కెవిన్ పౌల్సన్

ఐదో స్ధానంలో నిలిచిన మరో హ్యాకర కెవిన్ పౌల్సన్ ‘ Kevin Poulsen' పై ఎఫ్‌బిఐ నిఘా కొనసాగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Al Qaeda hacks Indian Railways website; encourages Muslims to join Jihad
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot