అలీబాబా అధినేత నుంచి షాకింగ్ న్యూస్, బిల్ గేట్స్ బాటలో..

చైనా ఈ కామర్స్ రంగంలో ఎదురులేని ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కంపెనీ అధినేత నుంచి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

|

చైనా ఈ కామర్స్ రంగంలో ఎదురులేని ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కంపెనీ అధినేత నుంచి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. అలీబాబా సహ వ్యవస్థాపకుడు,ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్‌ మా తాను కంపెనీ నుంచి వైదొలుగుతున్నానే వార్తతో అందరికీ షాకిచ్చారు. దాదాపు 420 బిలియన్ల డాలర్ల సంస్థనుంచి వైదొలగాలని యోచిస్తున్నట్టు చెప్పారు.విద్యారంగంలో దాతృత్వతను కొనసాగించేందుకు, పదవీ విరమణ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ అంశంపై సమాధానాన్ని దాటవేస్తూ తే వచ్చిన జాక్‌ చివరికి తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే అలీబాబా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా, కంపెనీ నిర్వహణ మార్గదర్శిగా కొనసాగుతారు.

ఇంటర్నెట్ సౌకర్యంతో కోటి ఉచిత స్మార్ట్‌ఫోన్లు, ఏంటీ ఈ భామా షా పథకం !ఇంటర్నెట్ సౌకర్యంతో కోటి ఉచిత స్మార్ట్‌ఫోన్లు, ఏంటీ ఈ భామా షా పథకం !

దాతృత్వంపై మరింత దృష్టి..

దాతృత్వంపై మరింత దృష్టి..

ఇటీవల దాతృత్వంపై మరింత దృష్టి కేంద్రీకరించడంపై ఆలోచిస్తున్నానంటూ, మైక్రోసాఫ్ట్ అధిపతి, దాత బిల్ గేట్స్‌ను ఉదాహరణగా పేర్కొన్న జాక్‌ చివరికి అన్నంత పనీ చేశారు.

భవిష్యత్‌ సమయాన్ని ఇక విద్యకే..

భవిష్యత్‌ సమయాన్ని ఇక విద్యకే..

విద్య అంటే తనకు అమితమైన ప్రేమ అని అందుకే తన భవిష్యత్‌ సమయాన్ని ఇక విద్యకే కేటాయిస్తానని పేర్కొన్నారు. ఇది ముగింపు కాదని మరో కొత్త శకానికి నాంది అని చైనీస్ బిలియనీర్ జాక్‌ మా వ్యాఖ్యానించారు.

అమెజాన్, గూగుల్ లాంటి సంస్థల గుండెల్లో..

అమెజాన్, గూగుల్ లాంటి సంస్థల గుండెల్లో..

అలీబాబా, టెన్సెంట్, బైడు, జెడి.కామ్‌ సంస్థలను తన ఆధ్వర్యంలో లాభాల దౌడు తీయించి, అమెరికన్‌ సంస్థలు అమెజాన్, గూగుల్ లాంటి సంస్థల గుండెల్లో జాక్ రైళ్లను పరిగెత్తించారు.

అమ్మకాలలో 60 శాతం పురోగతి ..

అమ్మకాలలో 60 శాతం పురోగతి ..

గత నెల వెల్లడించిన ఆలీబాబా త్రైమాసిక ఫలితాల్లో లాభాలు పడిపోయినప్పటికీ, అమ్మకాలలో 60 శాతం పురోగతి సాధించింది. కంపెనీ వార్షిక ఆదాయం సుమారు 40బిలియన్ డాలర్లుగా నమోదైంది.

54వ సంవత్సరంలోకి

54వ సంవత్సరంలోకి

మరోవైపు చైనాలో టీచర్స్‌డేగా వ్యవహరించే (సెప్టెంబరు10, సోమవారం) ఆయన 54వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నారు.

50వ పడిలో..

50వ పడిలో..

చైనా వ్యాపార దిగ్గజాలు 50వ పడిలో పదవికి రాజీనామా చేయడం చాలా అరుదని ఎనలిస్టులు చెబుతున్నారు.

ఇంగ్లీష్‌ టీచర్‌గా కెరీర్ ప్రారంభం

ఇంగ్లీష్‌ టీచర్‌గా కెరీర్ ప్రారంభం

మల్టీబిలియన్ డాలర్ల ఇంటర్నెట్ దిగ్గజం ఆవిష్కారానికి ముందు జాక్‌ ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేశారు.

17మందితో కలిసి..

17మందితో కలిసి..

1999లోమరో 17మందితో కలిసి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఇ-కామర్స్, డిజిటల్ చెల్లింపుల సంస్థ ఆలీబాబాకు ప్రాణం పోశారు జాక్‌ మా. కాగా ఈ వార్తలపై జాక్‌మా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Alibaba co-founder Jack Ma is planning exit from the company more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X