ఉద్యోగులకు చుక్కలు చూపించేందుకు చైనా కంపెనీలు రెడీ

చైనా కంపెనీలు తమ దేశంలోని ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. 8 గంటల పనిదినాన్ని మార్చివేసి ఉద్యోగులను నరకయాతనకు గురిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా చైనా బిలియనీర్, ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఆలీబా

|

చైనా కంపెనీలు తమ దేశంలోని ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. 8 గంటల పనిదినాన్ని మార్చివేసి ఉద్యోగులను నరకయాతనకు గురిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా చైనా బిలియనీర్, ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఆలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా "ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ ఆరు రోజులూ" పనిచేసే విధానం ఉండాలనే వాదనను కొనసాగిస్తున్నారు.

 
ఉద్యోగులకు చుక్కలు చూపించేందుకు చైనా కంపెనీలు రెడీ

ఆలీబాబా కంపెనీ సమర్ధిస్తూ..'996'గా పిలుస్తున్న ఈ విధానం గురించి ప్రస్తుతం చైనీస్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. చైనాలో దీన్ని ప్రవేశపెట్టాలనే విధానాన్ని జాక్ మా గట్టిగా సమర్థిస్తున్నారు.

ఉద్యోగం చేయాలనుకుంటే

ఉద్యోగం చేయాలనుకుంటే

చైనా అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్ ఫాం ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ కూడా ఓవర్ టైమ్ వర్కింగ్ కల్చర్ తీసుకోచ్చింది. తమ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటే.. ఓవర్ టైమ్ డ్యూటీ చేయాల్సిందే.. లేదంటే.. ఉద్యోగం మానేయడంటూ స్టాప్ వర్కర్లకు అల్టిమేటం జారీచేసింది.

అధికారిక వైబో అకౌంట్‌లో పోస్టు

అధికారిక వైబో అకౌంట్‌లో పోస్టు

కంపెనీలో జాయిన్ అయ్యే ముందే ఆలోచించుకుని ఆ తర్వాత జాయిన్ అవ్వండని ఆలీబాబా కంపెనీ స్పష్టం చేసింది. ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు, బిలినీయర్ జాక్ మా.. ఇకపై తమ ఇండస్ట్రీలో ఓవర్ టైమ్ 996 వర్క్ కల్చర్ ను తీసుకురానున్నట్టు ఆలీబాబా అధికారిక వైబో అకౌంట్‌లో పోస్టు పెట్టారు.

వారంలో ఆరు రోజులు
 

వారంలో ఆరు రోజులు

ఇటీవల జరిగిన కంపెనీ అంతర్గత సమావేశంలో జాక్ మా మాట్లాడుతూ.. ఆలీబాబా కంపెనీకి 8 గంటల డ్యూటీ ఆఫీసు లైఫ్ స్టయిల్ కోరుకునే వారు అవసరం లేదన్నారు. జాక్.. ఉద్దేశం ప్రకారం.. 9 : 9 : 6 అంటే.. వారంలో ఆరు రోజులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.

విమర్శలు

విమర్శలు

జాక్ మా 996 వర్క్ కల్చర్ తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా టెక్ కంపెనీల్లో చాలామంది ప్రొగ్రామర్లు.. గంటల కొద్ది ఓవర్ టైమ్ డ్యూటీ చేసి తీవ్ర ఒత్తిడి కారణంగా చనిపోతున్నారు. దీంతో జాక్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సంస్థ మార్కెట్ విలువ

సంస్థ మార్కెట్ విలువ

996 వర్క్ షెడ్యూల్ లో ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తే.. అదనంగా వేతనం ఇస్తారా లేదో స్పష్టం చేయకపోవడం అర్థరహితమంటు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఆలీబాబా నుంచి ఎలాంటి స్పందన లేదు.కాగా ఆ సంస్థ మార్కెట్ విలువ సుమారు రూ.34 లక్షల కోట్లుగా ఉంది. జాక్ మా వ్యక్తిగత సంపద రూ.2.7 లక్షల కోట్లని అంచనా.

Best Mobiles in India

English summary
Alibaba founder Jack Ma defends '996' overtime work culture

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X