Home
News

ఆలీబాబా సింగిల్స్ డే సేల్ వచ్చేస్తోంది, ఇండియా నుంచి పాల్గొనటం ఎలా..?

ఇప్పటి వరకు మనము వాలెంటైన్స్ డే రోజున లేదా ఫాదర్ డే రోజున, మధర్స్ డే రోజున,ఫ్రెండ్ షిప్ డే రోజున స్పెషల్ సేల్స్ చూస్తుంటాము. అయితే వీటికి బిన్నంగా సింగిల్స్ డే అంటూ స్పెషల్ సేల్స్ జరుపుతుంది.

ఇప్పటి వరకు మనము వాలెంటైన్స్ డే రోజున లేదా ఫాదర్ డే రోజున, మధర్స్ డే రోజున,ఫ్రెండ్ షిప్ డే రోజున స్పెషల్ సేల్స్ చూస్తుంటాము. అయితే వీటికి బిన్నంగా సింగిల్స్ డే అంటూ స్పెషల్ సేల్స్ జరుపుతుంది అలీబాబా గ్రూప్ అఫ్ కంపెనీ.ఈ సేల్ ప్రతి ఏటా 11-11న జరుపుతుంది. 'సింగిల్స్ డే' అనేది చైనాలోవార్షిక వన్-డే షాపింగ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ సేల్ అమెరికా Black Friday , Cyber Monday కంటే చాలా గొప్పగా జరుగుతుంది .ప్రతి సంవత్సరం ఈ సింగిల్స్ డే రోజున రికార్డు స్థాయిలో సేల్స్ జరుపుతుంది.అయితే ఈ సారి గత ఏడాది కంటే మరింత ఎక్కువ సేల్స్ జరపాలని ఆలీబాబా గ్రూప్ సంస్థ ప్లాన్ చేస్తుంది.నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా ఈ సింగిల్స్ డే అంటే ఏంటి ఇండియా లో కూర్చొని ఈ సేల్ లో ఎలా పాల్గొనాలో మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి

ఇంతకీ సింగిల్స్ డే అంటే ఏంటి ఇది ఎలా మొదలైంది...?

ఇంతకీ సింగిల్స్ డే అంటే ఏంటి ఇది ఎలా మొదలైంది...?

నాన్జింగ్ యూనివర్సిటీలోని కొంతమంది విద్యార్ధులు సింగిల్స్ కోసం ఏదో ఒక ఫెస్టివల్ ను నిర్వహించాలి అనుకున్నప్పుడు , సింగిల్స్ డే ఒక వాలెంటైన్స్ వ్యతిరేక దినోత్సవ వేడుకగా ప్రారంభమైంది.ఈ సేల్ లో సింగిల్స్ వారికి నచ్చిన వస్తువులు తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఆలోచించే అలీబాబా సంస్థకి ఈ సింగిల్స్ డే నచ్చి వారితో 2009 నుంచి జత కట్టింది.

ఇండియాలో కూర్చొని షాపింగ్ చేయడం ఎలా?

ఇండియాలో కూర్చొని షాపింగ్ చేయడం ఎలా?

దీవాలి సేల్ లో ఎలాగైతే మనకి కావాల్సిన వస్తువులు ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లో కొనుగోలు చేసామో ఇక్కడ కూడా అలాగే వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ మీరు AliExpress, DealExtreme మరియు Gearbest వంటి ఆన్ లైన్ సైట్స్ లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు తగినంతగా జాగ్రత్త ఉంటే మీకు కావాల్సిన వస్తువులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

సింగిల్స్ డే సమయంలో బెస్ట్ డీల్స్ తెలుసుకోవడం ఎలా?

సింగిల్స్ డే సమయంలో బెస్ట్ డీల్స్ తెలుసుకోవడం ఎలా?

ఈ సేల్ మొదటి కొన్ని గంటలు చాలా కీలకంగా ఉంటుంది అప్పుడే మీకు కావాల్సిన వస్తువులను చాలా తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది.మీరు ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఆ ఆన్ లైన్ స్టోర్ యొక్క అకౌంట్ ను ఓపెన్ చేయండి లేదా వాటి మొబైల్ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోండి.

చైనీస్ ఆన్ లైన్  రిటైలర్ల నుండి సురక్షితంగా షాపింగ్ చేయడం ఎలా?

చైనీస్ ఆన్ లైన్ రిటైలర్ల నుండి సురక్షితంగా షాపింగ్ చేయడం ఎలా?

సింగిల్స్ డే సమయంలో ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు భద్రత మీ అతిపెద్ద కన్సర్న్ గా ఉండాలి. ఈ సేల్ ఏ వస్తువైనా చాలా తక్కువ ధరతో లేదా చూడడానికి చాలా అందంగా కనిపించిన వాటి జోలికి అస్సలు పోకండి .మీకు కావాల్సిన వస్తువులు కేవలం పాపులర్ ఆన్ లైన్ స్టోర్స్ లో మాత్రం కొనుగోలు చేయండి.

అత్యంత ముఖ్యమైన అంశం మీ చెల్లింపు కోసం కేవలం క్రెడిట్ కార్డు ను మాత్రం ఉపయోగించండి. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే క్రెడిట్ కార్డుతో ఛార్జ్ బ్యాక్ కోసం సులభంగా ఫైల్ చేయవచ్చు.

ఈ సేల్ ఎంతవరకు వర్తబుల్?

ఈ సేల్ ఎంతవరకు వర్తబుల్?

సింగిల్స్ డే గురించి భారతదేశంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇంకోక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో షిప్పింగ్ చాలా నెమ్మదిగా ఉంటుంది, కాబట్టి మీ ఉత్పత్తులను చేరుకోవడంలో కొంచెం సమయం పడుతుంది. మీకు ఏదైనా వస్తువు తక్కువ ధరలో కొనాలి అనుకుంటే ఈ సేల్ లో పాల్గొనవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
Alibaba Singles’ Day 2018: All You Need to Know and How to Shop From India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X