ఆలీబాబా నుంచి మొట్ట మొదటి ఇంటర్నెట్ కారు
చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా తన మొదటి ఇంటర్నెట్ కనెక్టెడ్ కారును ఏప్రిల్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ కారును ఆలీబాబా అలానే షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్‌లు సంయుక్తంగా అభివృద్థి చేసాయి. టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్‌లో భాగంగా ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తోన్న నేపథ్యంలో ఈ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకునంది.
Read More : హ్యాపీ హోలీ సేల్, రూ.1859కే స్మార్ట్‌ఫోన్

ఎనర్జీ సేవర్ ఆప్షన్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ కారులో ప్రత్యేకమైన కంప్యూటర్ వ్యవస్థతో పాటు అత్యాధునిక సెన్సార్స్, ఇర్ఫర్మేషన్ ఫ్యూజన్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అలానే ఆటోమెటిక్ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసారు. ఈ ఇంటర్నెట్ కార్ ప్రాజెక్టుకు సంబంధించి 800 మంది రిసెర్చర్లను ఏర్పాటు చేయటంతో పాటు మిలియన్ల కొద్ది డాలర్లను ఆలీబాబా ఖర్చుచేసినట్లు సమాచారం.
Read More : సూపర్ ఛాన్స్... రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్


Click it and Unblock the Notifications








