ఈ కామర్స్ దిగ్గజాలకు ఆలీబాబా ఝలక్, కొత్త మోడల్‌తో బరిలోకి
చైనా ఈ-కామర్స్, ఇంటర్నెట్, టెక్నాలజీ, రిటైల్, ఇన్వె్‌స్టమెంట్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ తాజాగా భారత ఈ-కామర్స్ వ్యాపార విభాగంలో ప్రవేశించాలని యోచిస్తోంది. అనుబంధ సంస్థ యూసీవెబ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ-కామర్స్‌లో వినూత్న వ్యాపార మోడల్‌తో భారత్‌లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్లు యూసీవెబ్ గ్లోబల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ హువైయువాన్ యాంగ్ తెలిపారు. అయితే, ఆలీబాబాకు భారత ఈ-కామర్స్ వ్యాపారంలో ఉన్న పేటీఎంలో 30.15 శాతం, స్నాప్‌డీల్‌లోనూ 3 శాతం వాటా ఉంది.

ఈ-కామర్స్ విభాగంలోకి తమ ఎంట్రీతో పేటీఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయన చెప్పారు. ఈ-కామర్స్ చాలా విస్తృతమైనదని, తమకు అనుకూల వ్యాపార భాగస్వాములతో.. తగిన ఉత్పత్తుల విభాగాలను ఎంచుకుంటామని, పేటీఎంతో పోటీ పడబోమని యాంగ్ చెప్పారు. భారత్‌లో ఆన్‌లైన్ మూవీ టికెటింగ్ సేవల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందని యాంగ్ వెల్లడించారు. దీంతో పాటుగా యూసీవెబ్ ఆన్‌లైన్లో సినిమాల విక్రయం కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు యాంగ్ చెప్పారు. యూసీవెబ్‌నకు చెందిన యూసీ బ్రౌజర్ 2009 నుంచి భారత్‌లో అందుబాటులో ఉంది. యూసీవెబ్ వర్గాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా (చైనా మినహా) 110 మంది యూజర్లు ఈ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా, ఇందులో సగభాగం యూజర్లు భారత్ నుంచే ఉన్నారు.

Comments
Best Mobiles in India
English summary
Alibaba’s UCWeb plans foray into e-commerce in India this fiscal
Story first
published: Saturday, September 7, 2019, 15:13 [IST]


Click it and Unblock the Notifications