చరిత్రలో నిలిచిపోయే రోజు!!

Posted By: Super

చరిత్రలో నిలిచిపోయే రోజు!!

 

1998, మే 11... దేశంలోని సాంకేతికతకు కొత్త రూపాన్ని అద్దిన రోజు, శక్తిగా పిలవబడే, పోక్రాన్ అణు పరీక్షను సమర్ధవంతంగా ప్రయోగించిన ఈ రోజును భారతీయులు ‘జాతీయ టెక్నాలజీ దినోత్సవంగా’ జరుపుకుంటారు. ప్రస్తుత పరిస్ధితులను పరిగణంలోకి తీసుకుంటే టెక్నాలజీ ఏ విధంగా దైనందని జీవితాల్లో భాగమైపోయిందో అర్ధమవుతుంది. జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాస్త్రీయ అంశాలను ఆధారంగా చేసుకుని ఇంటరాక్టివ్ సెషన్లతో పాటు వివిధ ప్రదర్శనలు ఇంకా ఉపన్యాసాలను నిర్వహిస్తున్నారు.

ఇంజనీర్లతో పాటు శాస్త్రవేత్తలకు ఈ రోజు చాలా ప్రధానమైనది. సైన్స్ యొక్క స్ఫూర్తిని యువతలో నింపే క్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏటా ప్రత్యేక కర్యాక్రమాలను ఏర్పాటు చేసి సంబంధిత రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని సత్కరిస్తుంది. జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో శుక్రవారం టెక్నాలజీ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్, రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి అష్మీ కుమార్‌తో పాటు సైన్స్ & టెక్నాలజీ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌లు హాజరుకానున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot