స్వామి నిత్యానంద వెబ్‌సైట్‌లో ఏమున్నాయ్..?

Posted By: Super

స్వామి నిత్యానంద వెబ్‌సైట్‌లో  ఏమున్నాయ్..?

 

స్వామి నిత్యానంద ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. పరమహంస నిత్యానందగా పిలవబడే స్వామి నిత్యానంద ధ్యానం యొక్క విశిష్టతను ప్రజలకు చాటిచెప్పే సంకల్పంతో  ధ్యానపీఠాన్ని నెలకొల్పారు. ఈ ఆధ్యాత్మిక గురవుకు దేశ, విదేశాల్లో లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు. నిత్యానంద నిర్వహించే అనేక కార్యక్రమాలు, బోధనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందించేందకు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటైంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నిత్యానంద. వోఆర్‌జి ( www.nithyananda.org) పేరుతో రన్ అవుతున్న ఈ సైట్ అందిస్తున్న సేవల వివరాలు.

నిత్యానంద నిర్వహించిన అనేక  ఆధ్యాత్మిక  బోధనా కార్యక్రమాలను వీడియోల రూపంలో ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నిర్వహించబోయే పూజలు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు  ఫోటోగ్యాలరీల రూపంలో అప్‌లోడ్ కాబడి  ఉంటాయి. ట్విట్టర్ ద్వారా ఈ

వెబ్‌సైట్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్య 1653 కాగా ఫేస్‌బుక్ నుంచి ఫాలో అవుతున్న వారి సంఖ్య 1328.

ఈ వైబ్‌సెట్‌లో 250 ఈ-పుస్తకాలను నిక్షిప్తం చేశారు. ఆధ్యాత్మిక, ధ్యాన సంబంధిత అంశాలతో నిండి ఉన్న ఈ పుస్తకాలను యూజర్లు ఉచితంగా చుదువుకోవచ్చు. డయోబెటిస్ వ్యాధిని 21 రోజులో నియంత్రించే శక్తివంతమైన క్రియులను సైట్‌లో చూడొచ్చు. నిత్యానందకు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో 10 మిలియన్ల భక్తులు ఉన్నారట!. ఏర్పాటు చేసిన ప్రత్యేక టీవీ ఛానల్ ‘నిత్యానంద టీవీ’ 33 దేశాల్లోని 320 పట్టణాల్లో ప్రసారమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot