ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ దాకా జియో మొత్తం ప్లాన్స్ వివరాలు

రిలయన్స్ జియో.. భారత్‌లో తన 4జీ సేవలను సెప్టంబర్, 2016న అధికారికంగా ప్రారంభించింది. తొలత జియో, వెల్‌కమ్ ఆఫర్ పేరిట మూడు నెలల పాటు తమ యూజర్లకు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌ను అందించింది. ఆ తరువాత జియో వెల్‌కమ్ ఆఫర్‌ను, జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌గా మార్చి మరో మూడు నెలల పాటు అవే ఆఫర్లను కంటిన్యూ చేసింది.

Read More : డిస్‌ప్లే పగిలిన టచ్ ఫోన్‌ను ఎలా ఆపరేట్ చేయాలి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో " Summer Surprise" ఆఫర్‌

జియో ఉచిత సేవలు ఏప్రిల్ 1, 2017తో ముగియాల్సి ఉండగా.. మార్చి 31, 2017న జియో మరో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. తన జియో ప్రైమ్ యూజర్ల కోసం " Summer Surprise" ఆఫర్‌ను అనౌన్స్ చేసింది.

మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ సేవలు..

ఈ ఆఫర్‌లో భాగంగా ఏప్రిల్ 15, 2017లోపు రూ.303 అంతకన్నా ఎక్కువ ప్లాన్ తీసుకున్న ప్రైమ్ యూజర్లకు 3 నెలల పాటు తమ సేవలను ఉచితంగా ఆఫర్ చేస్తామని జియో ప్రకటించింది.

రూ.333తో రోజుకు 3జీబి డేటా, 90 రోజులు మీ ఇష్టం

 

 

జియో ధన్ దనా ధన్...

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల నేపథ్యంలో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు జియో ప్రకటించింది. అక్కడితో ఆగిపోకుండా, ధన్ దనా ధన్ పేరుతో సరికొత్త ప్లాన్‌‌ను రిలయన్స్ జియో అనౌన్స్ చేసింది. ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ దాకా జియో అందిస్తోన్న మొత్తం ప్లాన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

 

 

రూ.19 నుంచే ప్రారంభం..

రిలయన్స్ జియో ప్లాన్స్ రూ.19 నుంచి ప్రారంభవుతాయి. రూ.19 ప్లాన్ కేవలం ఒక రోజు వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్‌కు 200 ఎంబి డేటా లభిస్తుంది. నాన్-జియో ప్రైమ్ యూజర్‌కు కేవలం 100ఎంబి మాత్రమే లభిస్తుంది.

మోటరోలా కొత్త ప్లాన్, రూ.6,000కే షియోమీని తలదన్నే ఫోన్‌లు

రూ.49 ఆఫర్ తీసుకుంటే...

రిలయన్స్ జియో రెండవ ప్లాన్ రూ.49కే దొరుకుతుంది. మూడు రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లకు 600 ఎంబి డేటా లభిస్తుంది. నాన్-జియో ప్రైమ్ యూజర్లకు కేవలం 300ఎంబి మాత్రమే లభిస్తుంది.

రూ.96 ప్లాన్ తీసుకుంటే...

రిలయన్స్ జియో మూడవ ప్లాన్ రూ.96తో ప్రారంభమవుతుంది. 7 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లకు 7జీబి డేటా లభిస్తుంది. రోజుకు 1జీబి డేటాను వాడుకోవచ్చు. నాన్-జియో ప్రైమ్ యూజర్లకు కేవలం 600ఎంబి డేటా (రోజుకు) మాత్రమే లభిస్తుంది.

5000 mAh బ్యాటరీతో మోటో ఇ4 ప్లస్, రూ.10,000లోపే?

 

రూ.149 ప్లాన్ తీసుకుంటే..

రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన మరో ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.149 చెల్లించి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 2జీబి డేటాతో పాటు 300 మెసెజ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 28 రోజులు. ఇదే ప్లాన్‌ను నాన్ జియో ప్రైమ్ యూజర్లు ఎంపికచేసుకున్నట్లయితే కేవలం 1జీబి డేటా మాత్రమే లభిస్తుంది.

ధన్ దనా ధన్ ప్లాన్ 1

ధన్ దనా ధన్ పేరుతో జియో అనౌన్స్ చేసిన రూ.309 ప్లాన్ లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.309 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే నెలకు 28 రోజులు చొప్పున మూడు నెలల పాటు రోజుకు 1జీబి డేటా అందుబాటులో ఉంటుంది. మొత్తం 84జీబి డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్‌‌ను నాన్ జియో ప్రైమ్ యూజర్లు తీసుకున్నట్లయితే కేవలం 28జీబి డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.309కే అందుబాటులో ఉంటుంది.

ఇండియాలో Redmi ఫోన్‌లకు తిరుగులేదు

 

ధన్ దనా ధన్ ప్లాన్ 2

ధన్ దనా ధన్ పేరుతో జియో అనౌన్స్ చేసిన రూ.509 ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.509 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే నెలకు 28 రోజులు చొప్పున మూడు నెలల పాటు రోజుకు 2జీబి డేటా డేటా 84జీబి డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే ప్లాన్‌‌ను నాన్ జియో ప్రైమ్ యూజర్లు తీసుకున్నట్లయితే కేవలం 56జీబి డేటా మాత్రమే లభిస్తుంది.

రూ.999 నుంచి రూ.9,999 వరకు వివిధ రేంజ్‌లలో

జియో తన ప్రీపెయిడ్ చందాదారుల కోసం రూ.999 నుంచి రూ.9,999 వరకు వివిధ రేంజ్‌లలో ప్లాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఉత్కంఠ రేపుతోన్న Nokia 9 స్మార్ట్‌ఫోన్

వాటి వివరాలు...

రూ.999 ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లకు 120జీబి డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 120 రోజులు. రూ.1,999 ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లకు 185జీబి డేటా అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులు. రూ.4.999 ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లకు 410జీబి డేటా అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ 240 రోజులు.
రూ.9,999 ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లకు 810 జీబి డేటా అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ 410 రోజులు. పైన పేర్కొన్న ప్లాన్‌లను నాన్ జియో ప్రైమ్ యూజర్లు సెలక్ట్ చేసుకున్నట్లయితే వాళ్లకు ప్లాన్ ను బట్టి 60జీబి, 125జీబి, 350జీబి
ఇంకా 750జీబి డేటా మాత్రమే లభిస్తుంది.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్...

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ రూ.309 నుంచి ప్రారంభమవుతాయి రూ.309 ప్లాన్‌లో భాగంగా మూడు నెలల పాటు 90 జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 1జీబి డేటాను వాడుకునే వీలుంటుంది.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్...

రూ.509 ప్లాన్‌లో భాగంగా జియో పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 180జీబి 4జీ డేటా లభిస్తుంది. మూడు నెలల పాటు ఈ డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 2జీబి డేటాను వినియోగించుకునే వీలుంటుంది.

బ్రాండ్ అంటే నోకియానే..

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్...

రూ.999 ప్లాన్‌లో భాగంగా జియో పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 180జీబి 4జీ డేటా లభిస్తుంది. మూడు నెలల పాటు ఈ డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 2జీబి డేటాను వినియోగించుకునే వీలుంటుంది.

ట్రాయ్ పరిశీలనలో ఉన్నాయి..

జియో కొత్త ప్లాన్‌లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలించి ఆమోదించాల్సి ఉంది.

మోటో జీ5 ప్లస్ బెస్టా..?, రెడ్మీ నోట్ 4 బెస్టా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
All about Reliance Jio's Prime and non-Prime plans. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot