జియో కొత్త ప్లాన్లతో లాభమెంత..?

Written By:

జియో కొత్త ఆఫర్లు ప్రకటించిన నేపథ్యంలో యూజర్లకు అవి ఎంత మాత్రం లాభమో తెలుసా..?టెల్కోల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఆఫర్ల మీద అందరి దృష్టి పడింది. జియో సమ్మర్ సర్ ఫ్రైజ్ ఇంకో నాలుగు నెలల నేపథ్యంలో వాళ్లకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే జియో ధనాధన్ ప్లాన్ గడువు అయిపోతోంది. వారు కొత్త ఆఫర్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి. మరి వారు జియోలోనే కొనసాగితే వారికి లాభమెంత అనేది ఓ సారి చూద్దాం.

స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి దిమ్మతిరిగేలా షియోమి Lanmi

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

309 రూపాయలకు

సమ్మర్ సర్ప్రైజ్మ్, ధనాధన్ ఆఫర్ ముగిసిన తరువాత, నార్మల్ గా ఐతే 309 రూపాయలకు రోజుకి ఒక జిబి డేటా, 28 రోజుల పాటు రావాలి. ఇది ఇంతకుముందు ప్రకటించిన ఆఫర్. కాని దీని నిడివిని పొడిగిస్తోంది జియో. ఇకనుంచి 56 రోజుల పాటు ఈ ఆఫర్ పనిచేస్తుంది.

509 రూపాయల రీచార్జికి

ఇక 509 రూపాయల రీచార్జికి రోజుకి 2 GB 28 రోజులపాటు రావాలి. ఈ ఆఫర్ లో కూడా నిడివి మార్పులు చేస్తోంది జియో. ఇందులో కూడా 28 రోజుల వ్యాలిడిటిని 56 రోజులకి పెంచేసింది.

రెండు కొత్త ప్లాన్స్

ఇక రెండు కొత్త ప్లాన్స్ రాబోతున్నట్టు సమాచారం. అందులో ఒకటి 349 రూపాయల రీచార్జ్ కాగా, మరొకటి 399 రూపాయల రీచార్జ్. 349 రూపాయల రీచార్జ్ కి 20 GB డేటా వస్తుంది.

20GB వాడటం పూర్తయితే స్పీడ్

ఇందులో రోజుకి ఇంత అని డేటా లిమిట్ లేదు. ఆ 20 GB ని మీరు ఒక్కరోజులో ఖాళి చేయొచ్చు, బుద్ధిగా 56 రోజులు కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి 20GB వాడటం పూర్తయితే స్పీడ్ 128 KBPS కి పడిపోతుంది.

399 రూపాయల ప్యాక్ విషయానికి వస్తే

ఇక 399 రూపాయల ప్యాక్ విషయానికి వస్తే రోజుకి 1 GB వస్తుంది. వ్యాలిడిటి మాత్రం అద్భుతం. ఏకంగా 84 రోజుల నిడివి. మోడరేట్ గా ఇంటర్నెట్ వాడేవారికి చక్కగా సరిపోయే ఆఫర్ ఇది.

999 రూపాయల రీచార్జిపై

999 రూపాయల రీచార్జిపై వ్యాలిడిటి ఇంతకుముందు 60 రోజులు ఉండేది, దాన్ని 90 రోజులు చేసారు. 1999 రూపాయల రిచార్జీ వ్యాలిడిటి ఇంతకుముందు 90 రోజులు ఉంటే, ఇకనుంచి 120 రోజులు ఉంటుంది.

4999 రూపాయల రీచార్జ్

4999 రూపాయల రీచార్జ్ యొక్క కొత్త నిడివి 210 రోజులు కాగా, 9999 రూపాయల ప్లాన్ 300 పనిచేయబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
all details you should know about jio new plans Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot