ఫోన్‌లలో panic button తప్పనిసరి

Written By:

భారత్‌లో జనవరి 1, 2017 నుంచి విక్రయించే ప్రతి మొబైల్ ఫోన్‌లలో panic button తప్పనిసరిగా ఉండాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి మేనకా గాంధీ తెలిపారు. ప్రమాద సమయాల్లో మహిళలు అత్యవసర ఫోన్‌కాల్స్‌ను మరింత సులభంగా చేసేందుకు వీలుగా మొబైల్ ఫోన్‌లలో అత్యవసర పానిక్ బటన్‌లను ఫిట్ చేయాలని మంత్రి తన రాజ్యసభ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయంలో పానిక్ బటన్‌ను ప్రెస్ చేసినప్పుడు ఆ సమాచారం 10 ముఖ్యమన వ్యక్తలకు చేరే విధంగా ఓ యాప్ ను కూడా స్మార్ట్ ఫోన్ కంపెనీలు అభివృద్థి చేయవల్సి ఉంది. ఫీచర్ ఫోన్లలో 5 లేదా 9 నంబరు బటన్‌లను అత్యవసర కాల్స్ చేసే పానిక్ బటన్‌గా వాడాల్సి ఉంటుంది.

ఫోన్‌లలో panic button తప్పనిసరి

మహిళల పై రోజురోజుకు అరాచకాలు పెరిపోతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఫంద సంస్థలు సరికొత్త యాప్స్‌తో ముందుకొస్తున్నాయి. మహిళా భద్రతకు పెద్దపీట వేసే ఈ సెక్యూరిటీ యాప్స్ ఆపదలో చిక్కుకున్న మహిళల తాలుకా బంధవులకు సమచారాన్ని అందించటంతో పాటు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తం చేస్తాయి. మహిళల సెక్యూరిటీ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన యాప్స్‌ను క్రింది స్లైడర్‌‌లో చూడొచ్చు...

Read More : వణికించిన హిట్లర్ ప్రయోగాలు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

safetipin

మహిళల సెక్యూరిటీ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన యాప్స్‌


సేఫ్టీపిన్

సేఫ్టీపిన్, ఈ వ్యక్తిగత సెక్యూరిటీ యాప్‌లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్, జీపీఎస్, ట్రాకింగ్, సేఫ్ లొకేషన్ డైరెక్షన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో యాప్ అందుబాటులో ఉంది.

 

Raksha

మహిళల సెక్యూరిటీ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన యాప్స్‌

రక్ష

ప్రముఖ టెక్నాలజీ నిపుణులు ఈ సెక్యూరిటీ యాప్‌‌ను డిజైన్ చేసారు. ఈ యాప్‌లో పొందుపరిచిన ప్రత్యేకమైన బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌కు అలర్ట్స్ వెళ్లిపోతాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఫెయిల్ లేదా యాప్ స్విచ్ ఆఫ్ అయిన పక్షంలో ఫోన్ వాల్యుమ్ బటన్‌ను మూడు సార్లు ప్రెస్ చేసినట్లయితే అలర్ట్స్ వెళ్లిపోతాయి.

Himmat

మహిళల సెక్యూరిటీ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన యాప్స్‌

హిమ్మత్

మహిళా ప్రొటెక్షన్ నిమిత్తం ఈ యాప్‌ను ఢిల్లీ పోలీసులు అభివృద్థి చేసారు. ఈ యాప్‌ను ఉపయోగించుకునే మహిళలు ముందుగా ఢిల్లీ పోలీస్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే యూజర్ కు ఓటీపీ అందుతుంది. ఈ యాప్ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న మహిళలు SOS అలర్ట్‌ను నేరుగా ఢిల్లీ పోలీసులకు పంపవచ్చు.

Women safety

మహిళల సెక్యూరిటీ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన యాప్స్‌

ఉమెన్ సేఫ్టీ

ఈ యాప్‌లో మూడు ప్రత్యేకమైన బటన్‌లను ఏర్పాటు చేసారు. సమస్య తీవ్రతను బట్టి బటన్‌ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ఎస్ఎంఎస్ ద్వారా సదరు మహిళ సమాచారాన్ని పంపటంతో పాటు ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల సహాయంతో రెండు ఫోటోలను చిత్రీకరించి నేరుగా సర్వర్‌లోకి పంపుతుంది.

Smart24x7

మహిళల సెక్యూరిటీ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన యాప్స్‌

ఈ యాప్ ద్వారా మహిళలకు వివిధ రాష్ట్రాల పోలీసుల సేవలను వినియోగించుకోవచ్చు. కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
All Indian cell phones to have panic buttons from Jan 1, 2017. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting