ఆధార్ కార్డ్ ఉంటే చాలు, ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు

|

ఆధార్ కార్డ్ ఆధారంగా ఏటీఎమ్ నుంచి డబ్బలు విత్‌డ్రా చేసుకునే సరికొత్త టెక్నాలజీని ఇటీవల ఓ బ్యాంక్ అందుబాటులోకి తీసుకువచ్చింది తెలిసిందే. ఈ ఆధార్ బేసిడ్ ఏటీఎమ్ సర్వీస్ ద్వారా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అలానే మీ ఫింగర్ ప్రింట్ (బయోమెట్రిక్)ను ఉపయోగించి మెచీన్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఏటీఎమ్ కార్డ్ అలానే పిన్ నెంబర్లతో అసలు పని ఉండదు.

Read More : మీ అకౌంట్‌లోని డబ్బును ఫోన్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

తొలత ముంబైలో..
 

తొలత ముంబైలో..

ఈ విప్లవాత్మక సర్వీసును తొలత డీసీబీ (డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్) ముంబైలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ 2016లో, ఈ సర్వీసును విజయవంతంగా పరీక్షించి చూసిన తరువాత ఒడిస్సా, పంజాబ్, బెంగుళూరు రాష్ట్రాలో ఈ ఏటీఎమ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

ఆధార్ కార్డ్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్..

ఆధార్ కార్డ్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్..

ఆధార్ కార్డ్ ఆధారంగా నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయం ప్రస్తుతానికి DCB Bank ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏటీఎమ్ సర్వీసును ఉపయోగించుకునే క్రమంలో డీసీబీ బ్యాంక్ ఖాతాదారులు ముందుగా తమ ఆధార్ కార్డ్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోవల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫింగర్ ప్రింట్ రీడర్ పై వేలి ముద్ర..

ఫింగర్ ప్రింట్ రీడర్ పై వేలి ముద్ర..

మెచీన్‌లో ముందుగా మీ ఆధార్ కార్డ్‌కు సంబంధించిన 12 అంకెల నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత మీ బయోమెట్రిక్ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్ రీడర్ పై వేలి ముద్రను ప్రెస్ చేసి కావల్సిన మొత్తంలో నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

డీసీబీ బ్యాంక్ తరహలో అన్ని బ్యాంకులు..
 

డీసీబీ బ్యాంక్ తరహలో అన్ని బ్యాంకులు..

డీసీబీ బ్యాంక్ తరహలో అన్ని బ్యాంకులు ఆధార్ బేసిడ్ ఏటీఎమ్ మెచీన్లను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఆర్థిక లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించుకునే వీలుంటుంది. అంతేకాకుండా ప్రతిఒక్కరు సులువుగా ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. డీసీబీ బ్యాంక్ తరహాలోనే ఈ తరహా పరిజ్ఞానాన్ని మిగిలిన బ్యాంకులు కూడా త్వరగా అందిపుచ్చుకుని దేశవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.

పూర్తి పేరు ఆటోమెటెడ్ టెల్లర్ మిషిన్

పూర్తి పేరు ఆటోమెటెడ్ టెల్లర్ మిషిన్

'ఎనీ టైమ్ మనీ' అని మనం ముద్గుగా పిలుచుకునే ATM అసలు పేరు ఆటోమెటెడ్ టెల్లర్ మిషిన్. బ్యాంకింగ్ రంగంలో ఏటీఎం కేంద్రాలు ఓ విప్లవం అని చెప్పుకోవాలి. ATM మెచీన్లు అందుబాటులోకి రాకముందు గంటల తరబడి బ్యాంకుల్లో వేచి ఉండి డబ్బులు డ్రా చేసుకోవల్సిన పరిస్థితి. అది కూడా బ్యాంక్ వర్కింగ్ అవర్స్‌లోనే.

ఎప్పడు కావాల్సి వస్తే అప్పుడు..

ఎప్పడు కావాల్సి వస్తే అప్పుడు..

బ్యాంకింగ్ అవర్స్ తరువాత ఎమర్జెన్సీగా డబ్బు అవసరమైతే తెలిసిన వారి వద్ద చేబదులు తీసుకోవడమో.. లేక అప్పు చేయక తప్పేది కాదు. కాని ఎటిఎంలు వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పడు కావాల్సి వస్తే అప్పుడు నగదు డ్రా చేసుకునే

సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలో మొదటి సారిగా..

దేశంలో మొదటి సారిగా..

మన దేశంలో మొదటి సారిగా ఏటిఎంను ప్రారంభించింది హంగ్ కాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పోరేషన్. 1987లో ముంబాయిలో HSBC బ్యాంక్ ఎటీఎమ్ మెచీన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ తరువాత అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల కూడా ఏటిఎంను ప్రారంభించాయి.

దాదాపు  80వేల ఏటిఎంలు ఉన్నాయి...

దాదాపు 80వేల ఏటిఎంలు ఉన్నాయి...

ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ వివిరాల ప్రకారం ప్రస్థతం దేశంలో సుమారు 80వేల పై చిలుకు ఏటిఎంలు ఉన్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియాకు సుమారు 27వేల ఏటిఎంలన్నాయట. మనలో చాలా మంది ఏటీఎమ్ కార్డులను నగదు తీసుకోవడానికో లేదా అకౌంట్లో బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్ తీసుకోవడానికి మాత్రమే పయోగించుకుంటున్నారు.

అందుబాటులో రకరకాల సేవలు..

అందుబాటులో రకరకాల సేవలు..

ఏటీఎమ్ మెషీన్స్ ద్వారా రకరకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. క్యాస్ విత్ డ్రాల్, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లింపు, యుటిలిటీ బిల్స్ చెల్లింపు, మొబైల్ రీఛార్జింగ్, టికెట్ బుకింగ్, ఈఎమ్ఐ చెల్లింపు, ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఫిక్సుడ్ డిపాజిట్స్, లోన్ అకౌంట్ చెల్లింపు ఇలా అనేక రకాల సేవలను ఏటీఎమ్ మెషీన్స్ ద్వారా పొందవచ్చు.

రిసిప్ట్ ను భద్రంగా ఉంచుకోవాలి!

రిసిప్ట్ ను భద్రంగా ఉంచుకోవాలి!

సాధారణంగా ఏటీఎమ్‌లో డబ్బు డ్రా చేయగానే మనో రిసిప్ట్ వస్తుంది. మనలో చాలా మంది ఈ రిసిప్ట్‌ను అక్కడే నలిపేసి పాడేస్తుంటారు. నిర్లక్ష్యంతో మనం వదిలివేసే రిసిప్ట్ సైబర్ నేరాలకు కారణం కాగలదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. మనం పారేసిన ఏటీఎమ్ రిసిప్ట్ వివరాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు మన అకౌంట్‌లలోకి చొరబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

 టెక్నికల్ లోపాలు తలెత్తే అవకాశం..

టెక్నికల్ లోపాలు తలెత్తే అవకాశం..

కొన్నికొన్ని సందర్భాల్లో ATM నుంచి నగడు డ్రా చేస్తున్నపుడు టెక్నికల్ లోపాలు తలెత్తుతంటుటాయి. నగదు మన చేతికి రాకుండానే అకౌంట్‌లో డబ్బు కట్ అయినట్లు చూపిస్తుంది. ఇటువంటి సమయంలో ATM రిసిప్ట్ ఆధారంగానే బ్యాంకు‌లో మీ కంప్లెయింట్ ఫైల్ చేయబడుతుంది.

రిసిప్ట్‌లను బయట పాడేయకండి

రిసిప్ట్‌లను బయట పాడేయకండి

నిర్లక్ష్యంతో మీరు వదిలిపారేసే రిసిప్ట్ ద్వారా దొంగతనాలు జరిగే అవకాశముంది. ఎందుకంటే మీరు వదిలేసిన రిసిప్ట్ మీ అకౌంట్ లో మిగిలి ఉన్న నగదుకు సంబంధించి అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. మళ్లీ మీరు అదే ATM సెంటర్‌కు వచ్చినప్పుడు మిమ్మల్ని బెదిరించే మీ సొమ్మును దోచుకునే పరిస్థితులు కూడా రావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ATM కార్డ్ తాలూకా రిసిప్ట్‌లను బయట పాడేయకండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Most Read Articles
Best Mobiles in India

English summary
All you need to know about Aadhaar based ATM. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X