Home
News

అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్ విశేషాలివిగో ...

అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్ ఇప్పుడు మార్కెట్లలో ఎక్కువగా పేరు వినిపిస్తోంది. ఈ ఫైర్ క్యూబ్ ఒకే సారి అటు ఫైర్ టీవీని మరియు ఎకో డాట్ కలిసి ఉన్న పరికరం.

By M Krishna Adithya

అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్ ఇప్పుడు మార్కెట్లలో ఎక్కువగా పేరు వినిపిస్తోంది. ఈ ఫైర్ క్యూబ్ ఒకే సారి అటు ఫైర్ టీవీని మరియు ఎకో డాట్ కలిసి ఉన్న పరికరం. ఒక్కమాటలో చెప్పాలంటే అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్ ఒక ఇంటిలిజెంట్ డివైజ్ అని చెప్పవచ్చు. ఇది ఒకే సారి అటు టీవీ, వీడియో స్ట్రీమింగ్, సౌండ్ సిస్టం ఇలా చాలా పనులను చేసేందుకు సిద్ధపడుతుంది. దీన్నుంచి అటు టీవీ షోస్, అలాగే సినిమాలను చూసే వీలుంది. అలాగే ప్రైమ్ వీడియోలతో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా చూసే వీలుంది.

ఫైర్ టీవీ క్యూబ్ అంటే ఏంటి ?

ఫైర్ టీవీ క్యూబ్ అంటే ఏంటి ?

ఇది అమెజాన్ ఫైర్ టీవీ లాంటిదే, చూసేందుకు ఒకే లాగా ఉంటుంది. కానీ పనితీరు మాత్రం కాస్త తేడా అనే చెప్పాలి. రెండింటిలోనూ డ్యూయల్ బ్యాండ్ వైఫై, అలాగే 1.5 గీగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, హెచ్ డీఆర్ 10 సపోర్ట్, 4 కే అల్ట్రా హెచ్ డీ సపోర్ట్, డాల్బీ అట్మాస్ ఆడియో స్టాండర్డ్, అలేవా వాయిస్ రిమోట్ ఉన్నాయి. కానీ ఫైర్ టీవీ క్యూబ్ ఫైర్ టీవీ కన్నా కూడా చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఇది 16జీబీల స్టోరేజీ స్పేస్ కలిగి ఉంది. అలాగే బిల్టిన్ స్పీకర్, అలాగే ఇథర్ నెట్ అడాప్టర్, 2 జీబీ ర్యామ్, అలాగే వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఫర్ టెలివిజన్ కలిగి ఉంది.

ఫైర్ టీవీ క్యూబ్ సైజ్ ఎంత ?

ఫైర్ టీవీ క్యూబ్ సైజ్ ఎంత ?

ఫైర్ టీవీ క్యూబ్ బరువు 16.4 ఔన్సులు, అలాగే దీని కొలతలు 3.4 X 3.4 X 3.0 ఇంచులు, ఇది ఫైర్ టీవీ కన్నా కాస్త పెద్దది, కానీ చాలా అనువైనది.

ఏమేం చేయవచ్చు ?

ఏమేం చేయవచ్చు ?

ఫైర్ టీవీ క్యూబ్, అమెజాన్ ఫైర్ టీవీ తరహాలోనే పనిచేస్తుంది. కానీ కాస్త ఎక్కువ సానుకూలతలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా దీని ద్వారా అటు సౌండ్ బార్స్ ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే అన్ని రకాల టీవీలకు ఇది పనిచేస్తుంది. అలాగే ఏవీ రిసీవర్స్ ను కూడా కలిగి ఉంది. దీంతో పాటు లైవ్ టీవీ కూడా చూసే వీలుంది. వాయిస్ కమాండ్స్ కూడా పనిచేస్తాయి. వాయిస్ తో టీవీ ఆపడం, అలాగే టీవీ షోస్ మార్చడం చేయవచ్చు. అలాగే ఫైర్ టీవీ క్యూబ్ తో స్మార్ట్ లైట్స్, కెమెరాలను కూడా కంట్రోల్ చేయవచ్చు.

ఎక్కడ కొనొచ్చు..

ఎక్కడ కొనొచ్చు..

ఫైర్ టీవీ క్యూబ్ ను అమెజాన్ వెబ్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు. ప్రీ ఆర్డర్ ద్వారా కొనుగోలు చేసే వీలుంది. జూన్ 21న ఇది అఫీషియల్ గా లాంచ్ కానుంది. ప్రస్తుతం ఇది నార్త్ అమెరికాలో మాత్రమే ప్రీఆర్డర్స్ తీసుకుంటున్నారు. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

పూర్తి స్థాయి స్మార్ట్ టీవీ ఎక్స్ పీరియన్స్

పూర్తి స్థాయి స్మార్ట్ టీవీ ఎక్స్ పీరియన్స్

చివరిగా చెప్పాలంటే ఫైర్ టీవీ క్యూబ్ పూర్తి స్థాయి స్మార్ట్ టీవీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఫైర్ టీవీ, అలాగే అమెజాన్ ఎకో కలిస్తే ఫైర్ టీవీ క్యూబ్ అవుతుందని కంపెనీ వర్గాలు ఇప్పటికే చెప్పాయి.

 

 

Best Mobiles in India

English summary
All you need to know about Amazon Fire TV Cube More news at GIzbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X