రూ.149 ఆఫర్స్‌తో పండుగ చేస్కోండి!

రిలయన్స్ జియో అనౌన్స్ చేసిన రూ.149 అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్ దెబ్బకు ఇతర టెల్కోలు దిగరాక తప్పలేదు. జియో బాటలోనే బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌ ఇంకా ఆర్‌కామ్‌లు చౌక రేట్లలో అన్‌లిమిటెడ్ వాయిస్ ఇంకా డేటా ప్లాన్ లను మార్కెట్లో అనౌన్స్ చేసి పండుగ చేసుకోమంటున్నాయి...

Read More : ఇక 3జీ ఫోన్‌లలో రిలయన్స్ Jio!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీస్ఎన్ఎల్ రూ.149

మొబైల్ నెట్‌వర్క్ విభాగంలో వ్యూహాత్మక అడుగలతో ముందుకుసాగుతోన్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీస్ఎన్ఎల్ ఇటీవల రూ.149 ప్లాన్‌ను అనౌన్స్ చేసి ప్రత్యర్థులకు గట్టి షాకే ఇచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ యూజర్లు నెల రోజలు పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచిత కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో
ఇంటర్నెట్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2017 జనవరి నుంచి..

2017 జనవరి నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది. ఇతర టెల్కోలకు గట్టిపోటినిచ్చే క్రమంలో బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం మరికొన్ని ఆఫర్లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్స్ రూ.99 నుంచి ప్రారంభం కానున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఎయిర్‌టెల్ రూ.145 ప్లాన్

జియోతో పోటీపడే క్రమంలో ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.145 ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ - ఎయిర్‌టెల్ కాల్స్ ఉచితం. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో భాగంగా 300 ఎంబీ 4జీ డేటాను కూడా ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తుంది. మీరు 4జీ యూజర్ కాకపోయినట్లయితే 50MB డేటా మాత్రమే మీకు లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్‌

ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.345 ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. ఈ బండిల్డ్ ప్లాన్ లో భాగంగా 1జీబి 4జీ డేటాను యూజర్ పొందగలుగుతారు.

 

 

వొడాఫోన్ ప్లాన్స్..

వొడాఫోన్ తన 2జీ, 3జీ, 4జీ ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేట్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. మొదటి ప్లాన్ విలువ సర్కిల్‌ను బట్టి రూ.144 - రూ.149 రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వొడాఫోన్ - వొడాఫోన్ మధ్య 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు, ఇన్‌కమింగ్ కాల్స్ పూర్తిగా ఉచితం. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయస్ కాల్స్‌తో పాటు 300 ఎంబి 4జీ డేటాను కూడా వొడాఫోన్ అందిస్తోంది.

ఐడియా ఆఫర్స్..

పోటీ మార్కెట్ నేపథ్యంలో ఐడియా సెల్యులార్ రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.148 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఐడియా - ఐడియా కాల్స్ ఉచితం. ఈ బండిల్డ్ ప్యాక్‌లో భాగంగా 300 ఎంబీ 4జీ డేటాను కూడా యూజర్ పొందే అవకాశం.

ఆర్‌కామ్ నుంచి..

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.148 రీఛార్జ్ ప్యాక్‌‌ను మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. ఈ బండిల్డ్ ప్లాన్‌లో భాగంగా 300 ఎంబి డేటాను కూడా రిలయన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ డేటా బెనిఫిట్స్ అనేవి 2జీ, 3జీ, అలానే 4జీ యూజర్లకు వర్తిస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
All you need to know about the Cheap plans offered by BSNL, Airtel, vodafone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot