మిషన్ శక్తి గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే ఔరా అనేస్తారు

భారత్ ను అగ్రదేశాల సరసన నిలిపిన అంతరిక్ష ప్రయోగం మిషన్ శక్తి గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనతో కూడిన సుదీర్ఘ చర్చలు మొదలయ్యాయి. అంతరిక్ష ప్రయోగం మిషన్ శక్తి గురించి ప్రధాని మంత్రి మోడీ జాతిను

|

భారత్ ను అగ్రదేశాల సరసన నిలిపిన అంతరిక్ష ప్రయోగం మిషన్ శక్తి గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనతో కూడిన సుదీర్ఘ చర్చలు మొదలయ్యాయి. అంతరిక్ష ప్రయోగం మిషన్ శక్తి గురించి ప్రధాని మంత్రి మోడీ జాతినుద్దేశించి కీలక ప్రకటన చేశారు. లో ఆర్బిట్ శాటిలైట్‌ ను మిసైల్ ద్వారా కూల్చిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని మోడీ పేర్కొన్నారు.

మిషన్ శక్తి గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే ఔరా అనేస్తారు

ఈ సందర్భంగా ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న డీఆర్డీవో, ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందించారు. యాంటీ శాటిలైట్ వెపన్ తయారీతో భారత్ రక్షణరంగంలో కొత్త ఒరవడి ప్రారంభమైంది. మరి దీని పూర్తి వివరాల్లోకెళితే...

చైనాకు హెచ్చరికలు

చైనాకు హెచ్చరికలు

భారత్ ఈ యాంటి శాటిలైట్ వెపన్ ప్రయోగం విజయం సాధించడం ద్వారా సరిహద్దు దేశాలు చైనా, పాకిస్తాన్ లకు హెచ్చరికలు జారీ చేసినట్లు అయ్యిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల అంతర్జాతీయ సమాజంలో అలజడి మొదలైట్లుగా తెలుస్తోంది.

అంతర్జాతీయ చట్టాలకు లోబడి

అంతర్జాతీయ చట్టాలకు లోబడి

అయితే ఈ ప్రయోగం అంతర్జాతీయ చట్టాలకు లోబడి జరిగిందని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. అలాగే ఈ యాంటీ శాటిలైట్ వెపన్ పూర్తిగా స్వదేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించినట్లు ప్రధాని మోడీ ప్రకటనలో తెలిపారు.

అంతరిక్షం కూడా యుద్ధ రంగంగా మారనున్న నేపథ్యంలో..

అంతరిక్షం కూడా యుద్ధ రంగంగా మారనున్న నేపథ్యంలో..

భవిష్యత్తులో అంతరిక్షం కూడా యుద్ధ రంగంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యాంటి శాటిలైట్ వెపన్ కీలకంగా మారనుందని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా శత్రుదేశాలు భూమి నుంచి తక్కువ ఎత్తులో గూఢచార్యం చేసే ఉపగ్రహాలను కూల్చివేసేందుకు ఈ యాంటి శాటిలైట్ వెపన్ ఉపయోగపడనుందని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.

 

 

DRDO

DRDO

కొత్తగా రూపొందించిన యాంటీ శాటిలైట్(A-SAT) వెపన్‌ అంతరిక్షంలో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెస్ట్ శాటిలైట్‌ను విజయవంతంగా కూల్చేసింది. యాంటీ శాటిలైట్(A-SAT) వెపన్‌‌ను భారతదేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) స్వయంగా రూపొందించడం విశేషం.

కేవలం 3 నిమిషాల్లో

కేవలం 3 నిమిషాల్లో

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిషన్ శక్తి' ఆపరేషన్‌ను కేవలం 3 నిమిషాల్లో పూర్తి చేశారు. మిషన్ శక్తి విజయంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టమ్ ఉన్న నాలుగో దేశంగా ఇండియా రికార్డు సాధించింది.

మూడు దశల్లో

మూడు దశల్లో

వ్యూహాత్మక సైనిక చర్యల్లో భాగంగా శాటిలైట్లను కూల్చేందుకు A-SAT వెపన్స్‌ను తయారు చేశారు. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్(BMD) ప్రోగ్రామ్‌ను ఈ ప్రయోగంలో ఉపయోగించారు. మొత్తంగా ఈ మిస్సైల్ మూడు దశల్లో పనిచేస్తుంది.

మూడు దశలు

మూడు దశలు

ముందుగా ఎక్కడైనా రాడార్ టార్గెట్‌ను పసిగట్టిన వెంటనే లో ఎర్త్ ఆర్బిట్‌లో శాటిలైట్‌ కదలికల్ని రాడార్ గుర్తిస్తుంది. తొలి దశలో మిస్సైల్‌ను భూమి నుంచి లాంఛ్ చేస్తారు. తర్వాత రెండో దశలో మిస్సైల్ నుంచి హీట్ షీల్డ్స్ తొలగిపోతాయి. ఇక మూడో దశలో కింద ఉన్న రాడార్‌లు వెపన్‌ను గైడ్ చేస్తాయి. రాడార్ ఇచ్చిన సిగ్నల్స్ ఆధారంగా వెపన్ లక్ష్యానికి చేరువవుతుంది. చివరగా యాంటీ శాటిలైట్(A-SAT) వెపన్‌ శాటిలైట్‌ను కూల్చేస్తుంది.

Best Mobiles in India

English summary
Here all you need to know about India’s Anti-Satellite Missile test Mission Shakti

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X