ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

|

రాజకీయనేతల నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల వణుకు పుట్టిస్తున్నాయి. వీరు ఏమాట ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడాలంటే తమ సంభాషనలను ఎవరన్నా ట్యాప్ చేస్తున్నారేమోనన్న అనుమానులు వీరిని పట్టిపీడిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కారణంగా ప్రభుత్వాలే కూలిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం కారణంగానే పీఎం చంద్రశేఖర్ ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సిన పరిస్థితులు ఏర్పడాయి. శరద్ పవార్, లలిత్ మోడీ సంభాషణలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బహిర్గతమైన విషయం తెలిసిందే. కార్పొరేట్ లాబీయిస్ట్ నీరారాడియా, బర్ఖాదత్, రతన్ టాటా ఫోన్‌లు ట్యాపింగ్ జరిగాయి. వీరి సంభాషణలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి..? ఎవరైనా సలువుగా ఫోన్‌ట్యాప్ చేయవచ్చా...? దీనికి చట్టాలు లేవా..?. ఈ ప్రశ్నలకు సమాధానాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

1.) ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

టెలిఫోన్ రిసీవర్‌లో రికార్డర్ పెట్టి సంభాషణలను రికార్డ్ చేయటమనేది పాతకాలం పద్ధతి. సాంకేతికత మరింతగా విస్తరించటంతో సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. దీంతో ప్రతి ఒక్కరి దగ్గరా ఒకటి నుంచి రెండు సెల్‌ఫోన్‌లు ఉంటున్నాయి.

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

2.) సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉన్నా..?

సెల్‌ఫోన్‌లలో ఓ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేయటం ద్వారా ఆయా ఫోన్‌లకు సంబంధించిన సంభాషణలను ట్యాప్ చేయవచ్చు. అయితే.. ఎంతమంది ఫోన్‌లలో ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేయగలదు..? ఒకవేళ ఇన్స్‌స్టాల్ చేసినా ఆ ఫోన్‌తోనే మాట్లాడాతారన్న గ్యారంటీ ఏంటి.

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?
 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

3.) అందుబాటులోకి ఆధునిక టెక్నాలజీ..?

పై అంశాలను పరిగణంలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఓ అత్యాధునిక టెక్నాలజీని నిఘా వర్గాలకు అందించింది. ఈ సాంకేతికత సాయంతో ఎవరి ఫోన్‌ల‌నైనా ఎప్పుడైన ట్యాప్ చేయవచ్చు.

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

4.) ఫోన్ ట్యాపింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఏదైనా ఉందా..?

అవును.. ఫోన్ ట్యాపింగ్‌లకు సంబంధించి ప్రత్యేకమైన వ్యవస్థే ఉంది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనేజేషన్ (ఎన్‌టి‌ఆర్‌ఓ) ఆధ్వర్యంలో ఈ వ్యవహారం జరుగుతుంది. సెల్‌ఫోన్స్ నుంచి వెళ్లే ప్రతి ఎస్ఎంఎస్‌ను , కాల్‌ను ఎన్‌టి‌ఆర్‌ఓ పసిగట్టగలుగుతుంది. జీఎస్ఎమ్ ఇంకా సీడీఎమ్ఏ నెట్‌వర్క్ ఫోన్‌లు దేశంలో పెరుగుతుండటంతో వాటిని ట్యాప్ చేయగలిగే పరకారాలను ఇజ్రాయెల్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

5.) ఎక్సేంజ్‌ల్లో కూర్చొని ట్యాప్ చేయనక్కర్లేదు!

పాత రోజుల్లా ఎక్సేంజ్‌ల్లో కూర్చొని ట్యాప్ చేయనక్కర్లేదు. ఆఫ్‌ది ఎయర్ మానిటరింగ్ డివైజ్‌లుగా పిలిచే ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా కార్లలో వెళుతూనే ఫోన్‌లను ట్యాప్ చేయవచ్చు. సెల్‌ఫోన్ టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను ఇవి అందుకుంటాయి. ఈ డివైజ్ అమర్చిన కారుకు రెండు కిలోమీటర్ల పరిధిలో జరిగే సంభాషణలన్నీ రికార్డు చేయవచ్చు.

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

6.) ఈ టెక్నాలజీ ఎంత మంది వద్ద ఉంది..?

ఇలా కార్లలో అమర్చ గలిగే ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ దాదాపు 90 నిఘా సంస్థల వద్ద అందుబాటులో ఉన్నట్లు అంచనా. ఢిల్లీ, ముంబైతో పాటు మన రాష్ట్రంలోనూ ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

7.) ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడే అధికారం ఎవరెవరికి ఉంది..?

ప్రస్తుతం ఫోన్‌ను ట్యాప్ చేసే అధికారం ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, సీబీఐ, ఎన్ఐఏ, సీబీడీటీ, డీఆర్ఐ, నార్కెటెక్స్ కంట్రోబ్యూరో, ఈడీ, ఆదాయపన్ను, రాష్ట్ర పోలీసు ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఉంది. 1885 భారత టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్ 5(2) ప్రకారం వీరు ఏ ఫోన్ నెంబరును అయినా హోంశాఖ అనుమతితో ట్యాప్ చేయవచ్చు.

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

8.) నిఘా సంస్థలు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి!

నిఘా సంస్థలు ఫోన్ ట్యాపింగ్‌కు దరఖాస్తు చేస్తు.. హోంశాఖ కార్యాదర్శి నేతృత్వంలోని హోంశాఖ కార్యదర్శి, న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శులతో కూడిన కమిటీ దాన్ని పరిశీలించి ట్యాపింగ్‌కు అనుమతినిస్తుంది.

 

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

9.) నిఘా వర్గాల చేతిలో 10వేల మొబైల్ నెంబర్లు?

ప్రస్తుత నిఘావర్గాల 10 వేల మొబైల్ నెంబర్‌లను అధికారికంగా ట్యాప్ చేస్తున్నట్లు వినికిడి?. ఈ నంబర్ల జాబితాలో ఉగ్రవాద కార్యకలాపాలు ఇతర అసాంఘిక శక్తులకు సంబంధించినవే ఏక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X