కామిక్ కథలు ఇప్పుడు మీ విండోస్ 8 ఫోన్‌లో

Posted By:

కామిక్ కథలు ఇప్పుడు మీ విండోస్ 8 ఫోన్‌లో

అమ్మ చేతి గోరుముద్ద ఎంత తియ్యగా ఉంటుందో.. నాన్నమ్మ చెప్పే కామిక్ (హాస్యంతో నిండిన) కమ్మటి కథ కూడా అంతే తియ్యగా ఉంటుంది. అమర్ చిత్ర కథలోని కామిక్ శీర్షికలు ఇప్పుడు విండోస్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే ఫోన్‌లు, టాబ్లెట్‌లలో లభ్యమవుతున్నాయి. మైక్రోసాఫ్ట్, అమర్ చిత్ర కథా సంయుక్త భాగస్వామ్యంతో అమర్ చిత్ర కథా కామిక్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంది.

ACK Comics అప్లికేషన్‌ను నైన్ స్టార్స్ అప్లికేషన్ 9 డిజిటల్ స్టూడియో రూపొందించింది. ఈ అప్లికేషన్‌ను విండోస్ 8 యూజర్లు తమ తమ డివైజ్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా అమర్ చిత్ర కథలోని కావల్సిన కామిక్ కథలను చదవచ్చు. ఈ యాప్‌ను  ఇన్స్‌స్టాల్ చేసుకున్న వినియోగదారులు ఎడిటర్ప్ పిక్‌లో భాగంగా శకుంతల, బీర్బాల్ ద వైజ్, తిరుపతి, టెంజింగ్ నార్గే, అనంత్ పాయ్ వంటి కామిక్ కథలను ఉచితంగా పొందుతారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot