Home
News

27 రోజుల బ్యాటరీ, 26GB స్టోరేజీ తో Amazfit కొత్త స్మార్ట్‌వాచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు 

Amazfit ఇటీవలే IFA ఈవెంట్ లో కంపెనీ యొక్క తదుపరి మోడల్ స్మార్ట్‌వాచ్ అయిన T-Rex 3 ని పరిచయం చేసింది. ఇది కంపెనీ యొక్క గత సంవత్సరం లాంచ్ అయిన T-Rex 2 యొక్క వారసుడిగా త్వరలో భారతదేశంలో స్మార్ట్ వాచ్‌ లాంచ్ అవుతుందని ధ్రువీకరించింది.

గత మోడల్ యొక్క 1.39-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో పోలిస్తే, ఇది పెద్ద 1.5-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 2,000 nits గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ఇది ఇప్పటికీ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ (MIL-STD-810G) రేటింగ్ కలిగి ఉంది.

Amazfit T-Rex 3 Teaser Released Ahead Of India Launch  Expected Specifications  Price And Launch Details

ఇది 10 మీటర్ల వరకు నీటి లోపల నిరోధకతను కలిగి ఉన్నందున 100 మీటర్ల లోతైన జలాలతో పాటు 70C వేడి నుండి -30 చలి వరకు విపరీతమైన ఉష్ణోగ్రత మరియు పర్యావరణ పరిస్థితులను తట్టుకోగలదు.

ఈ స్మార్ట్‌వాచ్‌లో కొత్త Hyrox రేస్ మోడ్, ఫ్రీడైవింగ్, అల్ట్రామారథాన్ మరియు అప్‌గ్రేడ్ చేసిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మోడ్‌ లతో సహా 177+ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇది GPS ఫీచర్ ని కలిగి ఉంది మరియు ఉచిత ఆఫ్‌లైన్ మ్యాప్‌లు మరియు టర్న్ డైరెక్షన్‌లతో కాంటౌర్ మ్యాప్‌లతో వస్తుంది. ఇది GPS విచక్షణ కోసం ఎంపికలతో సహా మెరుగైన గోప్యతా రక్షణ చర్యలను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇది రెడీనెస్ స్కోర్ మరియు స్లీప్ హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV) లక్షణాలను కలిగి ఉంది. ఇది మ్యూజిక్ ని స్టోరేజీ చేయడానికి 26GB అంతర్నిర్మిత స్టోరేజీ ని కూడా కలిగి ఉంది. OpenAI యొక్క GPT-4o టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. మరియు Zepp OS 4 యొక్క అన్ని స్థాయిలలో ఇది ఏకీకృతం చేయబడింది. Zepp ఫ్లో మీ వాయిస్‌తో మీ వాచ్‌పై పూర్తి నియంత్రణను అందిస్తుంది.

ఇది T-Rex 2 లోని 500mAh తో పోలిస్తే ఇప్పుడు పెద్ద 700mAh బ్యాటరీని కలిగి ఉంది. కాబట్టి ఇది సాధారణ వినియోగంతో 27 రోజుల బ్యాటరీ జీవితాన్ని లేదా గరిష్టంగా 180 గంటల GPS వినియోగాన్ని అందిస్తుంది.

ప్రపంచ మార్కెట్లో ఈ స్మార్ట్‌వాచ్ ధర
అమాజ్‌ఫిట్ టి-రెక్స్ 3 ఒనిక్స్ మరియు లావా రంగులలో వస్తుంది మరియు ఇది గ్లోబల్ మార్కెట్‌లలో దీని ధర 279.99 USD (రూ. 23,515.) / 299.90 యూరోలు (సుమారు రూ. 27,820), కాబట్టి మేము భారతదేశంలో కూడా ఇదే ధరలో ఉంటుందని ఆశించవచ్చు.

ఇక లాంచ్ తేదీ విషయానికొస్తే, కంపెనీ ఇటీవల తన సోషల్ ఛానెల్‌లలో ప్రకటించిన సమాచారం ప్రకారం త్వరలోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. సంస్థ నిర్వహిస్తున్న పోటీ యొక్క విజేతలను సెప్టెంబర్ 20న ప్రకటిస్తామని, కాబట్టి వచ్చే వారంలో లాంచ్ అవుతుందని మేము ఆశించవచ్చు. ఇది Amazon.in, Amazfit వెబ్‌సైట్‌లో సేల్ కు వస్తుంది. మరియు లాంచ్ అయిన తర్వాత ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazfit T-Rex 3 Teaser Released Ahead Of India Launch. Expected Specifications, Price And Launch Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X