Amazon Alexaలో కొత్తగా టైపింగ్ ఫీచర్!! ప్రస్తుతం వీరికి మాత్రమే
ప్రముఖ రిటైల్ దిగ్గజం అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోసం అలెక్సాను విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు iOS పరికరాల్లోని అలెక్సా సాయంతో టైపింగ్ చేసే కార్యాచరణను కూడా పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వినియోగదారులు వాయిస్ ఉపయోగించకుండా వాట్సాప్ వలే అలెక్సాకు మెసేజ్ లను పంపడానికి అనుమతిస్తుంది. బహిరంగంగా లేదా ఏదైనా ముఖ్యమైన సమావేశంలో ఉన్న వారు మరొకరి నుంచి సమాచారం పొందడానికి లేదా పంపడానికి వాయిస్ ఆదేశాలను ఉపయోగించకూడదనుకునే వారికి ఈ కొత్త ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టైప్ విత్ అలెక్సా కొత్త ఫీచర్ వివరాలు
ది యాంబియంట్ పబ్లికేషన్ ఈ ‘టైప్ విత్ అలెక్సా' కొత్త ఫీచర్‌ను పబ్లిక్ ప్రివ్యూలో భాగంగా మొదట గుర్తించింది. అయితే మొదటగా ఈ ఫీచర్‌ను ఐఫోన్ మరియు ఐప్యాడ్ వినియోగదారుల యొక్క అలెక్సా స్మార్ట్ హోమ్ యాప్ ద్వారా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిని యాక్టీవేట్ చేయడానికి మీరు యాప్ యొక్క మెయిన్ మెనూ యొక్క ఎడమ ఎగువ భాగంలో కనిపించే కీబోర్డ్ చిహ్నాన్ని నొక్కవలసి ఉంటుంది. ‘టైప్ విత్ అలెక్సా' ఫీచర్ అనేది వాయిస్ ఉపయోగించకుండా అలెక్సాతో సంభాషించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంటే మీరు ప్రస్తుతం అలెక్సాతో నోటితో చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు మీ అలెక్సా మొబైల్ యాప్ ను ఉపయోగించి వాట్సాప్ మాదిరిగా టైప్ చేయవచ్చు.

అమెజాన్ అలెక్సా vs గూగుల్ అసిస్టెంట్
టైప్ విత్ అలెక్సా కొత్త ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎప్పుడు విడుదల అవుతుందో అన్న విషయం మీద అమెజాన్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఇది కేవలం పరీక్ష దశలో మాత్రమే ఉంది. అలెక్సాకు పోటీగా గూగుల్ అసిస్టెంట్ ఇప్పటికే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది అనేక భాషలలో తమకు కావలసిన ప్రశ్నను టైప్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. గూగుల్ ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్నందున అమెజాన్ దీనికి పోటీని ఇవ్వడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

అమెజాన్ అలెక్సా కొత్త ఫీచర్ స్పెసిఫికేషన్స్
అమెజాన్ యొక్క అలెక్సా వర్చువల్ అసిస్టెంట్‌లో కొత్త కొత్త సామర్థ్యాలను జోడించడంతో పాటుగా ఎక్కువ భాషల మద్దతును కలిగి ఉండే సామర్ధ్యంను కలిగి ఉన్నట్లు ఇదివరకే చాలా రకాల పుకార్లు వచ్చాయి. అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ సహాయంతో విదేశీ మార్కెట్లను అన్వేషించడానికి అవకాశాన్ని ఇవ్వడమే కాక వివిధ భాషలలోని ఇన్‌పుట్‌ల లైబ్రరీని కూడా సులభంగా పొందడానికి వీలుగా ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ సహాయంతో దాని సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలెక్సా గత సంవత్సరం ఇంగ్లీష్ మరియు ఇతర భాషలకు ఆటోమ్యాటిక్ గా స్పందించే సామర్థ్యాన్ని అందుకున్నందున ఇది సులభంగా రెండు భాషలలోను స్పందించగలదు.


Click it and Unblock the Notifications








