Amazon Alexa కొత్త అప్ డేట్!! హిందీ భాష మద్దతుతో ఆదేశాలు
ప్రపంచంలోని ఉత్తమ వర్చువల్ అసిస్టెంట్లలో ఒకటిగా అమెజాన్ అలెక్సా గుర్తించబడింది. భారతదేశంలోని ఫైర్ టీవీ డివైస్ వినియోగదారుల కోసం ఇప్పుడు అలెక్సా హిందీలో ఆదేశాలను ఇవ్వడానికి అనుమతిని ఇస్తున్నది. భారతదేశంలోని అన్ని ఫైర్ టివి డివైస్ లకు అమెజాన్ అలెక్సా కొత్త అప్ డేట్ లో భాగంగా హిందీ భాషకు మద్దతు లభిస్తుందని అమెజాన్ ఇటీవల ప్రకటించింది. ఇప్పటి వరకు ఫైర్ టీవీ డివైస్లు కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఆదేశాలను అనుమతించేవి. కానీ ఇప్పుడు హిందీ భాష యొక్క అదనపు మద్దతును తీసుకురావడంతో వినియోగదారులు వీటిని వినియోగ ప్రాధాన్యత ముందు కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ అలెక్సాలో హిందీ భాష మద్దతు
భారతదేశంలోని అన్ని ఫైర్ టీవీ పరికరాల్లోని అమెజాన్ అలెక్సా ఇప్పుడు కొత్త అప్ డేట్ ను పొందింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఇది హిందీ భాషకు మద్దతును ఇవ్వడం ప్రారంభించింది. భాష మద్దతుతో పాటు అమెజాన్ అలెక్సా రొటీన్‌లను ఫైర్ టీవీ డివైస్లకు జోడించింది. ఇది ఇంటిలో ఉంచిన అన్ని అలెక్సా పరికరాల ద్వారా వినియోగదారులను కమ్యూనికేట్ చేయడానికి మరియు అనేక ఆదేశాలను అమలు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

అమెజాన్ ఫైర్ టీవీ పరికరాలలో అలెక్సా ప్రయోజనం
అమెజాన్ ప్రకారం ఫైర్ టీవీ పరికరాల్లో అలెక్సా ఇప్పుడు పాటలు, వ్యక్తిత్వాలు, టైమర్లు మరియు అలారాలను సెట్ చేయడానికి మరియు వాతావరణ సమాచారం మరియు వార్తలను హిందీలో ఆదేశాలను ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. ఇందులో యూజర్లు గమనించవలసిన విషయం ఏమిటంటే ఆదేశాలను మాత్రమే హిందీలో అలెక్సా అర్థం చేసుకుంటుంది. కానీ అలెక్సా మాత్రం హిందీలో స్పందించదు కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్పందిస్తుంది.

అమెజాన్ అలెక్సాతో హిందీ భాషలో ఆదేశాలు
అమెజాన్ ఎకో పరికరాలు ప్రస్తుతం హిందీ భాషా మద్దతును కలిగి ఉన్నందున హిందీలో ఆదేశాలను తీసుకోని ఇంగ్లీష్ భాషలో మీకు కావలసిన సమాచారాన్ని ఇస్తుంది. కాకపోతే వినియోగదారులతో హిందీలో కమ్యూనికేట్ చేయగలిగే సామర్ధ్యం ఉంటే కనుక బాగా ఉండేది. ఏదేమైనా ఫైర్ టీవీ డివైస్లకు భవిష్యత్తులో అప్ డేట్లు లభిస్తున్నందున వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అతి త్వరలోనే పొందే అవకాశం ఉంది.

అమెజాన్ అలెక్సాలో హిందీ భాషను సెట్ చేసే విధానం
అమెజాన్ ఎకో డివైస్లు ప్రస్తుతం కొత్త అప్ డేట్ ను పొందిన తరువాత వినియోగదారులు హిందీలో ఆదేశాలను ఇవ్వడం కోసం వారి యొక్క అలెక్సాలోని సెట్టింగులను మార్చవచ్చు. ఇందుకోసం సెట్టింగులు> ప్రిఫెరెన్స్ > లాంగ్వేజ్ పద్దతులను పాటించి హిందీ బాషలోకి మార్చుకోవచ్చు. అదే సమయంలో క్రొత్త వినియోగదారులు తమ పరికరాన్ని హిందీలో సెట్ చేయడానికి అదనపు ఎంపికను పొందుతారు. ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల్లో అమెజాన్ అలెక్సా మద్దతును 2020 సెప్టెంబర్‌లో పరిచయం చేసింది.


Click it and Unblock the Notifications