Just In
- 2 hrs ago
Jio డైరెక్టర్ గా ముకేశ్ అంబానీ రాజీనామా ..? Jio కొత్త చైర్మన్ ఎవరో తెలుసా?
- 3 hrs ago
రూ.10 వేలలోపు బెస్ట్ మొబైల్ కావాలా.. అయితే ఈ సేల్ మీకోసమే!
- 4 hrs ago
విద్యార్థులకు అమ్మ ఒడి ల్యాప్‌టాప్‌లకు బదులుగా టాబ్లెట్లను ఇవ్వనున్న జగన్ సర్కార్
- 4 hrs ago
Apple ఫోన్ అద్భుతం.. 10 నెలలు నీటిలో పడినా బాగా పనిచేస్తోంది..!
Don't Miss
- News
Viral video:ఏందిరా అయ్యా అది.. ఏనుగులతోనే అలా.. ప్రతాపం చూపిందిగా..
- Finance
ఈ స్టాక్స్ 5 శాతం అంతకంటే ఎక్కువగా నష్టపోయాయి
- Sports
Eoin Morgan Retirement: నా వల్లనే ప్రాబ్లమైతే ఎల్లిపోతరా ఈడికెంచి.! ఆటకు గుడ్‌బై చెప్పిన మోర్గాన్!
- Movies
Prabhas సలార్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు కమెడియన్.. ఎలాంటి రోల్ అంటే?
- Automobiles
మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..
- Lifestyle
మీ అందం పెంచుకోవడానికి పౌడర్ బ్లష్, క్రీమ్ బ్లష్ లో ఏది సూటవుతుందో చూసెయ్యండి...
- Travel
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యం పొందిన పది జలపాతాలు..
Amazon Alexa మీకు ఇష్టమైన వారి వాయిస్‌తో మాట్లాడుతుంది!! త్వరలోనే అందుబాటులోకి
టెక్నాలజీ మరింత పెరగడంతో వినియోగదారులు కొత్త అప్ డేట్ లను వినియోగించడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఇంటిలోని స్మార్ట్ వస్తువులను ఆన్ మరియు ఆఫ్ చేయడానికి వాయిస్ కమాండ్ లను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం అమెజాన్ అలెక్సాను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు అలెక్సాలో సెలబ్రిటీల యొక్క వాయిస్ లను వినియోగించడం చూసాము. అయితే మీకు ఇష్టమైన కుటుంబ సభ్యులు, చనిపోయిన వారి యొక్క వాయిస్ అలెక్సాలో వినబడితే ఎలా ఉంటుంది?. అమెజాన్ యొక్క వర్చువల్ అసిస్టెంట్, అలెక్సా త్వరలో ఇటువంటి ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొనిరానున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon యొక్క Re: MARS (మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, రోబోట్స్ మరియు స్పేస్) కాన్ఫరెన్స్‌లో అలెక్సా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ ప్రసాద్ మాట్లాడుతూ అలెక్సాలో స్వరాలను అనుకరించే సామర్థ్యం గల ఫీచర్ ని ప్రదర్శించారు. ఈ ఫీచర్ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు కోల్పోయిన లేదా మీకు బాగా నచ్చిన కుటుంబ సభ్యుల యొక్క వాయిస్లతో లేదా దాదాపుగా వారి యొక్క వాయిస్ కి సమానంగా అన్ని రకాల కమాండ్ లను ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలెక్సాలో ఈ ఫీచర్ మనం కోల్పోయిన లేదా ఇప్పుడు మనతో లేని వారి స్వరాలను అనుకరించడానికి కూడా అనుమతిస్తుంది.

అమెజాన్ ఈవెంట్‌లో ఈ కార్యాచరణను రికార్డ్ చేసిన వీడియో రూపంలో కూడా ప్రదర్శించింది. ఈ వీడియోలోని సమాచారం ప్రకారం ఒక పిల్లవాడు ఇలా అంటాడు "అలెక్సా, అమ్మమ్మ నన్ను ది విజార్డ్ ఆఫ్ ఓజ్ చదవడం పూర్తి చేయగలదా?". అభ్యర్థనను విన్న తర్వాత అలెక్సా తన సాధారణ స్వరంలో పిల్లల అభ్యర్థనను అంగీకరిస్తుంది. ఆ తర్వాత పిల్లవాడి అమ్మమ్మ యొక్క వాయిస్ తో కథను చదవడం ప్రారంభిస్తుంది. ఆ వాయిస్ పిల్లవాడి యొక్క చనిపోయిన అమ్మమ్మ వాయిస్ కి సమానంగా ఉంటుంది అని కొన్ని నివేదికలు సూచించాయి. కంపెనీ యొక్క వార్షిక ఈవెంట్‌లో ప్రజల యొక్క జ్ఞాపకాలను కాపాడుకోనే ఉద్దేశంతో ప్రసాద్ ఈ కొత్త కార్యాచరణను రూపొందించారు. అలెక్సాలో ప్రజల స్వరాలను అనుకరించే ఈ కార్యాచరణ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా 'ప్రజల యొక్క జ్ఞాపకాలను శాశ్వతంగా చేయగలదు' అని అమెజాన్ సంస్థ పేర్కొంది.

అమెజాన్ అలెక్సాలో ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది?
అమెజాన్ అలెక్సాలో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే విషయానికి వస్తే కనుక అలెక్సా యొక్క ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత మీరు అందించే వ్యక్తి యొక్క వాయిస్ తో అలెక్సా ఒక నిమిషం పాటు ఆడియోపై శిక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తి యొక్క సింథటిక్ వాయిస్‌ప్రింట్‌ను సృష్టించగలదని అమెజాన్ Engadgetకి తెలిపింది. దీన్ని టెక్స్ట్-టు-స్పీచ్ టెక్నాలజీతో కంపెనీ అభివృద్ధి చేసింది. అమెజాన్ కూడా ఇటీవల ఈ పరిణామాలను వివరించే వైట్‌పేపర్‌ను షేర్ చేసింది. అందులో 'వాయిస్ ఫిల్టర్' వాయిస్‌ని ప్రతిబింబించడానికి అలెక్సా కోసం ఒక నిమిషం మాత్రమే ప్రసంగాన్ని ఉపయోగించగలదని పేర్కొంది.

"అత్యాధునికమైన టెక్స్ట్-టు-స్పీచ్ (TTS) సిస్టమ్‌లకు అధిక-నాణ్యత సింథటిక్ ప్రసంగాన్ని రూపొందించడానికి అనేక గంటలపాటు రికార్డ్ చేయబడిన ప్రసంగ డేటా అవసరం. ఈ పేపర్‌లో మేము వాయిస్ ఫిల్టర్ అనే అత్యంత తక్కువ-రిసోర్స్ TTS పద్ధతిని ప్రతిపాదించాము. టార్గెట్ స్పీకర్ కేవలం ఒక నిమిషం తక్కువ ప్రసంగాన్ని ఉపయోగిస్తుంది. ఇది వాయిస్ కన్వర్షన్ (VC)ని ముందుగా ఉన్న అధిక-నాణ్యత TTS సిస్టమ్‌కు జోడించిన పోస్ట్-ప్రాసెసింగ్ మాడ్యూల్‌గా ఉపయోగిస్తుంది. అలాగే ఇప్పటికే ఉన్న TTS నమూనాలో సంభావిత మార్పును సూచిస్తుంది. కొన్ని-షాట్ TTS సమస్యను VC టాస్క్‌గా రూపొందించింద" అని కంపెనీ పేర్కొంది.

అమెజాన్ అలెక్సా చనిపోయిన లేదా మీతో పాటు ఉన్న మీకు బాగా నచ్చిన వారి యొక్క వాయిస్ కమాండ్ లను ఉపయోగించడం అనేది చాలా గొప్పగా అనిపించినప్పటికీ దానిని అందుబాటులోకి తీసుకొని రావడం అనేది కనిపించేంత సులభం కాదు. నకిలీ వీడియోలలో వాయిస్‌లను పునరావృతం చేయడానికి ఉపయోగించే టూల్స్ గురించి నిపుణులు చాలా కాలంగా ఆందోళన చెందుతున్నారు. ఇది ఇంకా అభివృద్ధిలో ఉన్న కారణంగా అమెజాన్ తన వినియోగదారులకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుందో లేదో అస్పష్టంగా ఉంది. ఇది అందుబాటులోకి వస్తే కనుక స్కామర్‌లు మరియు సైబర్ నేరస్థులు ఈ టెక్నాలజీను దుర్వినియోగం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కావున ఈ సమస్యల గురించి ఆందోళనలు లేవనెత్తుతుంది.

అలెక్సా వాయిస్ సెట్టింగ్‌లో అమితాబ్ బచ్చన్ వాయిస్ ను మార్చే విధానం
** అలెక్సాలో ప్రారంభించడానికి "అలెక్సా, నాకు అమితాబ్ బచ్చన్‌ని పరిచయం చేయండి" అని చెప్పండి. తరువాత సూచనలను జాగ్రత్తగా వినండి.
** కొనుగోలును నిర్ధారించండి. ** ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి ఎకో పరికరాల్లో "అలెక్సా, అమిత్ జీ వేక్ ఎనేబుల్ వర్డ్" అని చెప్పండి.
** అమెజాన్ షాపింగ్ యాప్‌లో (ఆండ్రాయిడ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది) సెట్టింగ్‌ల ట్యాబ్‌లోని అలెక్సా విభాగాన్ని సందర్శించండి మరియు "అమిత్ జీ" వేక్ వర్డ్‌ను ఎనేబుల్ చేయండి.
** సంగీతం, కవిత్వం, జోక్, తొంగీ ట్విస్టర్‌లు మరియు మరిన్నింటి కోసం అమిత్ జీని అడగండి.
** అలాగే వినియోగదారులు "అమిత్ జీ, మీరు ఏమి చేయవచ్చు?" అని కూడా అడగవచ్చు. మరింత అన్వేషించడానికి.
ఎకో పరికరాలలో వినియోగదారులు అలెక్సా ద్వారా ఇంగ్లీష్ లేదా హిందీ రెండు భాషలలో మాత్రమే బచ్చన్‌తో సంభాషించవచ్చు. భాషను మార్చడానికి అలెక్సా యాప్‌లోని డివైస్ సెట్టింగ్‌లకు వెళ్లండి లేదా మీ ఎకో పరికరానికి "అలెక్సా, హిందీలో మాట్లాడండి" అని చెప్పండి. అమెజాన్ షాపింగ్ యాప్‌లో అమిత్ జీ మరియు అలెక్సా లాంచ్‌లో మాత్రమే ఆంగ్లంలో సంభాషించవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086