60 లక్షల 4G స్మార్ట్‌ఫోన్ లతో అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్

|

ఇండియాలో పండుగ వాతావరణం అప్పుడే మొదలైంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ లు వారి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్ లను మరియు స్మార్ట్‌టీవీలను ఉంచారు. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ఆన్‌లైన్ ఫెస్టివల్ సేల్స్ దేశంలో దాదాపు ఆరు మిలియన్ల కొత్త 4G స్మార్ట్‌ఫోన్ లను అందిస్తున్నట్లు కొత్త నివేదిక తెలిపింది.

టెక్ఆర్సి
 

మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ టెక్ఆర్సి ప్రకారం దసరా,దీపావళి పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులు ఇప్పటికే తమ వద్ద ఉన్న 2G మరియు 3G ఫోన్ ల నుండి 4G స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవడానికి ఈ పండుగ సీజన్‌లో దాదాపు 10 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవుతాయని అంచనా.

అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ల లో ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లు

4Gస్మార్ట్‌ఫోన్

అనుకున్న విధంగా ఈ 4Gస్మార్ట్‌ఫోన్ హ్యాండ్‌సెట్ల అమ్మకం జరిగితే వీటి మార్కెట్ 1.3 శాతం నుండి పెరిగి 72.9 శాతానికి చేరుకుంటుంది. నాన్ -4G స్మార్ట్‌ఫోన్ ఇన్‌స్టాల్ చేసిన బేస్ ఇప్పటికీ వాడుకలో ఉన్న మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో 30 శాతం పైన ఉంది.

అమెజాన్ ఫెస్టివల్ షాపింగ్‌లో ఈ జాగ్రత్తలు పాటించండి

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఆన్‌లైన్ లో ఫెస్టివల్ సేల్స్ కాలంలో ఆశించిన ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తున్నందున ప్రస్తుతమున్న 2 జి మరియు 3 జి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లలో వాణిజ్యపరంగా లభించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తమ ఫోన్ లను అప్‌గ్రేడ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము" అని టెక్‌ఆర్సి చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కౌసా తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: చౌకైన స్మార్ట్‌ఫోన్‌లు

ఆన్‌లైన్ సేల్స్
 

ఈ ఆన్‌లైన్ సేల్స్ ద్వారా అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వారి మార్కెటింగ్ మరియు ప్రకటనల వ్యూహాన్ని బాగా ఉపయోగించి వారు దేశవ్యాప్తంగా మొత్తం 4G స్మార్ట్‌ఫోన్ స్థావరాన్ని గణనీయంగా పెంచుకోవాలని చూస్తున్నారు. వీరు ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, ఒడిశా మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలపై దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 4G యేతర స్మార్ట్‌ఫోన్‌ల స్థావరం 30 శాతానికి మించి ఉంది అని కౌసా తెలిపారు.

గ్రేట్ న్యూస్: రియల్‌మి ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు

గార్ట్‌నర్

మరోవైపు పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 2019 లో 3.2 శాతం తగ్గాయని పేర్కొంది. ప్రీమియం ఫోన్‌ల లైఫ్-టైం 2019 వరకు ఉన్నందున ఫలితంగా వినియోగదారులు వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అయితే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2020 లో 2.9 శాతం వృద్ధిరేటుకు చేరుకుంటుందని అధ్యయనం అంచనా వేసింది. 5G సామర్థ్యం గల ఫోన్‌ల వాటా 2020 లో 10 శాతం నుంచి 2023 నాటికి 56 శాతానికి పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon and Flipkart Festival Sales Plans with 60 lakh 4G Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X