ఆపిల్, గూగుల్, వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!
ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ ప్యాగ్‌షిప్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ప్రీమియం క్వాలిటీ, అధునాతన ఫీచర్లు సహా అత్యుత్తమ పనితీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ల సొంతం. అయితే సాధారణ ఫోన్ల కంటే వీటి ధర కొంచెం అధికంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ప్రజలు ఈ ఫోన్లపై ఆసక్తి చూపరు.
అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఇలాంటి ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ల జాబితాలో ఆపిల్, గూగుల్, వన్‌ప్లస్, షియోమీ, వివో సహా మరెన్నో సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల ఫోన్లపై ప్రస్తుతం అత్యుత్తమ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 13 మిని : ఆపిల్ ఐఫోన్ 13 మిని స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్ మరియు iOS 16 ఆధారంగా పనిచేస్తుంది. ఐఫోన్ 13 మిని 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.94,900 ఉంది. ఈ ఫోన్‌పై అమెజాన్ 5 శాతం ప్లాట్ డిస్కౌంట్ అందజేస్తుంది.
సుమారుగా రూ.4,901 తగ్గనుంది. మరియు అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీని ద్వారా సుమారు రూ.22,500 వరకు తగ్గింపును పొందవచ్చు. మరియు కొన్నిబ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే ఐఫోన్ 13 మినీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 14: ఐఫోన్ 14 పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 14 128GB వేరియంట్ ప్రస్తుతం రూ.79,900 ఉంది. అదే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే కేవలం రూ.67,999 సొంతం చేసుకోవచ్చు. మరియు దీనితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో రూ.35,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

వన్‌ప్లస్ 11 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11 5Gపై ఈ కామర్స్ సంస్థలు మంచి ఆఫర్ ప్రకటించాయి. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.55,899కే కొనుగోలు చేయవచ్చు. అదే అమెజాన్‌లో ధర రూ.56,999కు అందుబాటులో ఉంది. దీంతోపాటు 9 నెలల వరకు నో కాస్ట్ EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వన్‌ప్లస్ 11 5Gపై ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకటించాయి.
గూగుల్ పిక్సల్ 7 ప్రో: పిక్సల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లాగ్‌షిప్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్‌పై అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. పిక్సల్ 7 ప్రో 128GB, 12GB ర్యామ్ వేరియంట్‌ను కేవలం రూ.67,000కే కొనుగోలు చేయవచ్చు. మరియు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై సుమారు రూ. 4000 వరకు తగ్గింపు ధరను అందిస్తోంది.
షియోమీ 13 ప్రో: షియోమీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 13 ప్రో పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను అందించింది. ప్రస్తుతం ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999కు అందుబాటులో ఉంది. అదే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.8,000 తగ్గింపును పొందవచ్చు.
వివో X90: వివో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ X90పై ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్ ప్రకటించింది. వివో X90 ఫోన్ 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం ధర రూ.63,999 అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.41,000 వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.


Click it and Unblock the Notifications