అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గొప్ప ఆఫర్!! ఉబెర్ రైడ్‌లపై భారీ డిస్కౌంట్లు...

|

ప్రముఖ ఈ-కామెర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్ ని భారతదేశంలో జూలై 23 నుండి ప్రారంబించనున్నది. అమెజాన్ ప్రైమ్ సేల్స్ సమయంలో కంపెనీ ఎన్నడూ అందించని ఆఫర్లను అందిస్తుంది. ఈ ప్రత్యేక సేల్స్ జరగడానికి ఇంకా సమయం ఉండడంతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ తన ప్రైమ్ వినియోగదారులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందించడానికి రైడ్-హెయిలింగ్ సర్వీసులో కింగ్ అయిన ఉబెర్‌తో కలిసి పనిచేస్తున్నది. అమెజాన్ మరియు ఉబెర్ యొక్క భాగస్వామ్యం విభాగం కింద అమెజాన్ ప్రైమ్ సభ్యులు UberGo ధరతో UberPremierకి యాక్సెస్ పొందుతారు. అదనంగా వారు ప్రతి నెలా ఎంపిక చేసిన నెంబర్ రైడ్‌లపై డిస్కౌంట్ ధరలను పొందడానికి కూడా అర్హులు అవుతారు.

అమెజాన్ - ఉబెర్‌ భాగస్వామ్యం

అమెజాన్ - ఉబెర్‌ భాగస్వామ్యం

అమెజాన్ ఇ-కామర్స్ దిగ్గజం ఇప్పుడు కొత్తగా ఉబెర్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఈ భాగస్వామ్యం ప్రకారం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు ఉబెర్‌ యొక్క రైడ్ లో ప్రత్యేక ఆఫర్‌లను పొందుతారు. వారు తమ UberGo రైడ్‌ని నెలకు మూడుసార్లు UberPremierకి అప్‌గ్రేడ్ చేయగలరు. అదనంగా వారు ఒక నెలలో ప్రయాణించే మూడు ట్రిప్పులపై రూ.60 వరకు 20 శాతం తగ్గింపును కూడా పొందుతారు. ఉబెర్ ఆటో, మోటో, రెంటల్స్ మరియు ఇంటర్‌సిటీపై ఈ డిస్కౌంట్లను పొందవచ్చు. ముఖ్యంగా మీ ఉబెర్ అకౌంటును మీ అమెజాన్ పే వాలెట్‌తో కనెక్ట్ చేయడం ద్వారా మరియు ట్రిప్‌లను బుక్ చేసుకోవడానికి ఉపయోగించడం ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. కంపెనీ బ్లాగ్ ప్రకారం "Amazon Prime మెంబర్‌లు తమ Amazon Pay బ్యాలెన్స్‌తో చెల్లించినప్పుడు వారి రైడ్‌ల మీద డిస్కౌంట్‌లు ఆటోమేటిక్‌గా వర్తింపజేయబడతాయి."

 

 

అమెజాన్ ప్రైమ్ యూజర్లు ఉబెర్ రైడ్‌లపై డిస్కౌంట్లను పొందే విధానం

అమెజాన్ ప్రైమ్ యూజర్లు ఉబెర్ రైడ్‌లపై డిస్కౌంట్లను పొందే విధానం

స్టెప్ 1: ముందుగా మీకు యాక్టివ్ దశలో ఉండే 'అమెజాన్ ప్రైమ్' అకౌంట్ ఉందని నిర్ధారించుకోండి.

స్టెప్ 2: మీ అమెజాన్ పేని మీ Uber Walletతో లింక్ చేయండి.

స్టెప్ 3: మీ ఉబర్ రైడ్‌ పూర్తిఅయిన తరువాత పేమెంట్ చెల్లించడం కోసం అమెజాన్ పే బ్యాలెన్స్‌ను ఉపయోగించండి.

స్టెప్ 4: ఇలా చేయడంతో మీరు స్వయంచాలకంగా డిస్కౌంట్లను పొందుతారు.

 

Amazon Pay వాలెట్‌ని Uberతో ఎలా లింక్ చేసే విధానం

Amazon Pay వాలెట్‌ని Uberతో ఎలా లింక్ చేసే విధానం

స్టెప్ 1: Uber యాప్‌ని ఓపెన్ చేసి దిగువ భాగంలో ఉన్న అకౌంట్ చిహ్నంపై నొక్కండి.

స్టెప్ 2: తరువాత "వాలెట్" ఎంపికని ఎంచుకుని క్రిందికి స్క్రోల్ చేసి "యాడ్ పేమెంట్ మెథడ్" ఎంపికపై నొక్కండి.

స్టెప్ 3: తరువాత ఇందులో "అమెజాన్ పే" ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: మీ అకౌంట్ ఆధారాలతో మీ అమెజాన్ ప్రైమ్ అకౌంటుకు సైన్ ఇన్ చేయండి.

స్టెప్ 5: ఇప్పుడు మీరు "యాప్ ఫండ్స్" ఎంపికను ఉపయోగించడం ద్వారా డబ్బును జోడించవచ్చు.

 

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో ప్రైమ్ సభ్యులకు అద్భుతమైన ఆఫర్లను అందివ్వనున్నది. జూలై 23 & 24 మధ్య జరిగే ఈ సేల్ లో అనేక ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపు లభించింది. కాబట్టి మీరు స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్, వాచ్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తిని కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు సరైన సమయం అవుతుంది. ఈ సేల్స్ సమయంలో ఐసీఐసీఐ మరియు SBI బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను కలిగిన వినియోగదారులకు అదనంగా 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ లో మొదలుకానున్న ప్రైమ్ డే సేల్ లో వినియోగదారులకు అందుబాటులో అద్భుతమైన ఆఫర్లను తీసుకొనిరనున్నది. ఇప్పటికి ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వారు ఆన్ లైన్ లో ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు మరియు బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారి కోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. బడ్జెట్ ధరలో రియల్‌మి, రెడ్‌మి మరియు సామ్ సంగ్ బ్రాండ్ల యొక్క స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అమెజాన్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రైమ్ సేల్ ఒక మంచి ప్లేస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు

రియల్‌మి, రెడ్మి, సామ్ సంగ్, టెక్నో, వన్ ప్లస్, లావా వంటి ఇతర బ్రాండ్లు ఇండియాలో ఇటీవల లాంచ్ చేసిన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అన్ని వేరియంట్‌లు ప్రైమ్ డే సేల్ లో గొప్ప తగ్గింపులతో లభిస్తాయి. రెడ్‌మి 9A, రియల్‌మి నార్జ్ 30A లతో పాటుగా సామ్ సంగ్ గెలాక్సీ యొక్క M02, M02s యొక్క అన్ని వేరియంట్‌లు ముఖ్యంగా రూ.10,000 లోపు లభించే అన్ని ఫోన్ లను డిస్కౌంట్ ధరలతో పొందవచ్చు. అదనంగా బ్యాంక్ యొక్క ఆఫర్లు కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ 9 5 జి మొబైల్ ను రూ .45,999 కే అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే అమ్మకం వన్‌ప్లస్ 9 5జిపై ప్రత్యక్ష తగ్గింపును అందించడం లేదు, కానీ మీరు పేజీలోని సాధారణ చెక్‌బాక్స్ ఆధారిత కూపన్‌పై ఈ ఆఫర్ ను పొందవచ్చు . మీరు మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ను కూడా మార్పిడి చేసుకోవచ్చు తద్వారా రూ. 13,400 ఆదా అవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు.శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 రూ. 54,999 కే అందిస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 (8 జీబీ, 256 జీబీ) ప్రస్తుతం రూ. 54,999 మాత్రమే . దీని ఎంఆర్‌పి రూ .86,000.

Best Mobiles in India

English summary
Amazon and Uber Partnership: Discount Offers on Uber Rides For Amazon Prime Members

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X