Amazon గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తేదీలు ఖరారు.. 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లు..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా Great Freedom Festival sale పేరులో సేల్ నిర్వహించనుంది. ఈ సేల్ ఆగస్టు 5 నుంచి 9 వరకు జరగనుందని అమెజాన్ తెలిపింది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లు యాక్సెస్ చేయగలరని అమెజాన్ తెలిపింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ఈ కామర్స్ దిగ్గజం వెల్లడించింది.

ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ పై భారీ తగ్గింపు ఉంటుందని అమెజాన్ పేర్కొంది. దాంతోపాటు వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ సహా ఇతర ప్రముఖ బ్రాండ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. అమెజాన్ టీజర్ పేజీ ఆధారంగా SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ పొందుతారని తెలిపింది.
ల్యాప్‌టాప్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై 75 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు అమెజాన్ టీజర్ పేజీ ద్వారా తెలుస్తోంది. ఆపిల్ సహా ఇతర సంస్థల ట్యాబ్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్లు వస్తాయని తెలుస్తోంది. హెడ్‌ఫోన్లు సహా స్పీకర్లపైనా భారీగా ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. బ్యాంకు ఆఫర్లు సహా ఇతర ఫ్లాట్ డిస్కౌంట్లతో ఈ తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ టీవీలు సహా 4K టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చని అమెజాన్ చెబుతోంది. వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు ఇతర గృహ ఉపకరణాలు సహా గేమింగ్‌కు సంబంధించిన సోనీ ప్లే స్టేషన్ 5 సహా ఇతర ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపును పొందవచ్చని అమెజాన్ చెబుతోంది. గేమింగ్ డివైస్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని తెలుస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, ఇతర ఉత్పత్తులు కచ్చితంగా ఎంత ధరకు అందుబాటులోకి వస్తాయనే దానిపై అమెజాన్ ప్రకటన చేయలేదు. అయితే సేల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే అనేక కొత్త ఉత్పత్తులు కూడా ఈ సేల్ ద్వారా లాంచ్ కానున్నాయి. వాటి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
గత నెలలో కూడా అమెజాన్ ప్రైమ్ డే పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించింది. జున్ 15, 16 తేదీల్లో ఈ సేల్ జరగ్గా.. గతం కంటే 14 శాతం ఎక్కువ మంది వినియోగదారులు సేల్‌లో పాల్గొన్నట్లు తెలిపింది. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర ఉత్పత్తులు విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. దాంతోపాటు అధిక శాతం మంది ప్రైమ్ మెంబర్లకు కేవలం రెండు రోజుల్లోనే డిలివరీలు అందించినట్లు తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








