Home
News

Amazon Mega Salary Days Saleతో 2021కి గ్రాండ్ వెల్కమ్!! అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు...

2021సంవత్సరం మరొక రెండు రోజులలో ప్రారంభం అవుతున్నందున ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో 'మెగా సాలరీ డేస్' అమ్మకాలను ప్రకటించింది. ఈ సేల్స్ 3రోజుల పాటు జనవరి 1 న ప్రారంభమై జనవరి 3, 2021 వరకు కొనసాగుతుంది. ఈ అమ్మకంలో రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫర్నిచర్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్, గృహోపకరణాలు వంటి వాటి మీద అమెజాన్ గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. శామ్సంగ్, LG, వర్పూల్, గోద్రేజ్, సోనీ, JBL వంటి మరిన్ని బ్రాండ్ల ఉత్పత్తుల మీద తగ్గింపు ధరలతో పాటుగా పరిమిత ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు మరియు క్రెడిట్ కార్డ్ లను ఉపయోగించే వినియోగదారులకు 10 శాతం రూ.1,250 వరకు తక్షణ డిస్కౌంట్ మరియు EMI లావాదేవీలు కూడా లభిస్తాయి.

ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్లు

ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్లు

అమెజాన్ యొక్క మెగా సాలరీ డేస్ సేల్ లో బోట్, సోనీ మరియు JBL వంటి బ్రాండ్ల యొక్క హెడ్‌ఫోన్‌ల మీద 50 శాతం తగ్గింపుతో కొనుగోలు చెయవచ్చు. అలాగే బోస్, సోనీ మరియు హర్మాన్ కార్డాన్ బ్రాండ్ యొక్క ప్రీమియం హెడ్ ఫోన్లు మరియు స్పీకర్లను 9 నెలల వరకు నో-కాస్ట్ EMI పద్దతిలో పొందవచ్చు. ఇంకా బోట్, jbl, షియోమి బ్రాండ్ సౌండ్ బార్‌లను 30 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలాగే ల్యాప్‌టాప్‌లు మరియు డెస్క్‌టాప్‌లను రూ.30,000 ధర వద్ద నుండి పొందవచ్చు. డీఎస్‌ఎల్‌ఆర్‌లు, మిర్రర్‌లెస్, పాయింట్ షూట్ కెమెరాలను నో-కాస్ట్ EMI ఎంపికలతోను, స్మార్ట్ వాచీలు మరియు ఫిట్నెస్ ట్రాకర్లను 40 శాతం తగ్గింపు ధరలకు అందిస్తారు.

పెద్ద ఉపకరణాలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్

పెద్ద ఉపకరణాలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్

అమెజాన్ యొక్క సాలరీ డేస్ అమ్మకంలో పెద్ద ఉపకరణాల మీద 40శాతం వరకు తగ్గింపును అందించనున్నది. ఇందులో భాగంగా ఉత్తమంగా అమ్ముడైన వాషింగ్ మెషీన్ల మీద 35 శాతం వరకు, ఎయిర్ కండీషనర్లపై 35 శాతం వరకు, మైక్రోవేవ్లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ అమ్మకంలో రిఫ్రిజిరేటర్లను రూ.6,490 ప్రారంభ ధర వద్ద నుండి పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది.

TVల మీద డిస్కౌంట్ ఆఫర్స్

TVల మీద డిస్కౌంట్ ఆఫర్స్

2021 మొదటి అమ్మకంలో అమెజాన్ టీవీల కొనుగోలు మీద 30 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా 32 అంగుళాల స్మార్ట్ టీవీల మీద 25 శాతం వరకు, ఆండ్రాయిడ్ టీవీలు మరియు ప్రీమియం టీవీల మీద 30 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నది. కొత్త సంవత్సరంలో కొత్త టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప మంచి ఆఫర్.

ఫర్నిచర్‌ కొనుగోలుపై 50% డిస్కౌంట్ ఆఫర్స్

ఫర్నిచర్‌ కొనుగోలుపై 50% డిస్కౌంట్ ఆఫర్స్

హోమ్‌టౌన్, కోయిర్‌ఫిట్, స్లీప్‌వెల్ వంటి బ్రాండ్‌లపై కూడా అద్భుతమైన డిస్కౌంట్ ఒప్పందాలు ఉంటాయి. ఫర్నిచర్‌ కొనుగోలు మీద 50 శాతం వరకు తగ్గింపును ఇవ్వడంతో పాటుగా నో-కాస్ట్ EMI ఆప్షన్లు మరియు షెడ్యూల్ డెలివరీ వంటివి ఉన్నాయి. అలాగే ఇంటి యొక్క ఫర్నిచర్, బెడ్‌రూమ్ మరియు లివింగ్ రూమ్ ఫర్నిచర్ ల మీద 50 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. అలాగే అవుట్డోర్ ఫర్నిచర్ పై 30 శాతం తగ్గింపు కూడా ఇస్తుంది. డైనింగ్ సెట్లను రూ.12,000 ధర వద్ద నుండి కూడా అందిస్తున్నది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Announced Mega Salary Days Sale 2021: Great Offers on TVs, Refrigerators, Headphones, Home Appliances and More.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X