ఆఫర్ల యుద్ధం : భారీ డిస్కౌంట్లతో అమెజాన్..

Written By:

ఈ కామర్స్ సైట్లు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించేందుకు రెడీ అయ్యాయి. దాదాపు 4 రోజుల పాటు ఈ ఆఫర్ల వర్షం కురియనుంది. మొన్న‌టికి మొన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ అంటూ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌గా ఇప్పుడు అమెజాన్ కూడా త‌న గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌ సేల్ డేట్ల‌ను ప్ర‌క‌టించింది.

సిమ్ కార్డు యూజర్లకు షాక్, ఆధార్ లింక్ చేయకుంటే బ్లాక్, ఆఖరుతేదీ ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫ‌ర్ల తేదీలు

ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబ‌ర్ 20 నుంచి 24 వ‌ర‌కు ఈ ఆఫ‌ర్లు ఉండ‌గా.. అమెజాన్‌లో సెప్టెంబ‌ర్ 21 నుంచి 24 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌ సేల్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్స్ మాత్రం ఒక రోజు ముందుగానే ఈ డీల్స్‌ను పొందే అవ‌కాశం ఉంటుంది.

40 వేల‌కుపైగా ఆఫ‌ర్లు

గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్‌లో భాగంగా 40 వేల‌కుపైగా ఆఫ‌ర్లు ఇస్తున్న‌ట్లు అమెజాన్ ఇండియా ప్ర‌క‌టించింది. నాలుగు రోజుల పాటు ప్ర‌తి గంట‌కూ కొత్త కొత్త డీల్స్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌నున్న‌ట్లు తెలిపింది.

మొబైల్స్‌పైనే 500కుపైగా ఆఫ‌ర్లు

కేవ‌లం మొబైల్స్‌పైనే 500కుపైగా ఆఫ‌ర్లు ఉండ‌గా.. ఎల‌క్ట్రానిక్స్‌పై 2500కుపైగా ఆఫ‌ర్లు ఉన్న‌ట్లు అమెజాన్ చెప్పింది.

ఎక్స్‌క్లూజివ్ ప్రోడ‌క్ట్స్‌పై 6 వేల‌కుపైగా ఆఫ‌ర్లు

ఇక హోమ్ అప్ల‌యెన్సెస్‌పై ప‌ది వేల‌కుపైగా, అమెజాన్ ఫ్యాష‌న్ ఐట‌మ్స్‌పై 30 వేల‌కుపైగా ఆఫ‌ర్లు ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ప్రోడ‌క్ట్స్‌పై 6 వేల‌కుపైగా ఆఫ‌ర్లు ఉన్న‌ట్లు అమెజాన్ తెలిపింది.

ఆపిల్‌,శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌, లెనోవో, ఎల్‌జీ

ఆపిల్‌,శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌, లెనోవో, ఎల్‌జీలాంటి మొబైల్ కంపెనీల ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు ఉన్న‌ట్లు చెప్పింది.

ప‌ది శాతం క్యాష్ బ్యా

ఇక ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్ కార్డ్స్‌తో కొనుగోలు చేసేవారికి ప‌ది శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది.

అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే

అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే కూడా ప‌ది శాతం (గ‌రిష్ఠంగా రూ.500) వ‌ర‌కు క్యాష్‌బ్యాక్స్ ఉంటాయి. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్లు కూడా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌నున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Amazon announces Great Indian Festival sale between September 21 and 24 Read More At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting