గ్రేట్ రిపబ్లిక్ డే సేల్: బెస్ట్ డీల్స్ మీ కోసం.. బ్యాంక్ ఆఫర్లు, కూపన్లతో సేవింగ్స్ డబుల్..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం షాపింగ్ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. "గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025" పేరుతో ఈ సంవత్సరం తొలి బిగ్ సేల్‌కు తెరలేపింది. జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులోకి రానుంది.
అయితే, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రం ఈ సేల్ ప్రారంభానికి 12 గంటల ముందే, ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.

* వస్తువులపై డిస్కౌంట్లు..
ఈ సేల్‌లో ఏయే వస్తువులపై భారీ తగ్గింపులు ఉండబోతున్నాయో తెలుసుకుంటే మీ కళ్లు చెదిరిపోతాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లు (PCs), ఐఫోన్‌లు, వాటికి సంబంధించిన యాక్సెసరీలు.. ఇలా అన్నీ మీ కోసం క్యూ కట్టనున్నాయి.
ఇంటి అవసరాలైన వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్‌పై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్ల విషయానికొస్తే, ఏకంగా 65% వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాదు, అమెజాన్ సొంత బ్రాండ్ల ఉత్పత్తులపై 75% వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి. ఔట్ డోర్, కిచెన్ ఐటమ్స్ పై కనీసం 50% డిస్కౌంట్ ఉంటుందంటే నమ్మగలరా? స్మార్ట్‌ఫోన్లు, వాటి యాక్సెసరీస్‌పై ఏకంగా 40% వరకు తగ్గింపు లభిస్తోంది.
* కొన్ని ప్రొడక్టులపై ప్రత్యేక ధరలు
కొన్ని పాపులర్ ప్రొడక్టులపై అమెజాన్ ముందే డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. అవేంటో చూసేయండి..
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లైట్: కేవలం రూ.2,599
ఎకో పాప్: ధర రూ.3,949 మాత్రమే.
ఎకో 4వ జనరేషన్: ఇప్పుడు రూ.7,549కే సొంతం చేసుకోవచ్చు.
ఎకో షో 8: రూ. 9,999కి లభిస్తోంది
లెనోవో ట్యాబ్ ప్లస్: ఒరిజినల్ ప్రైస్ రూ.22,999 కాగా, ఇప్పుడు రూ.18,999కే పొందవచ్చు
యాపిల్ వాచ్ SE (2వ జనరేషన్): దీని అసలు ధర రూ.24,900, కానీ సేల్‌లో రూ. 19,999కే అందుబాటులో ఉంటుంది.
* ఎక్స్చేంజ్ ఆఫర్లు.. EMI సౌకర్యం
అమెజాన్ కేవలం డిస్కౌంట్లతోనే ఆగడం లేదు. పాత వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే గరిష్టంగా రూ.45,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
అలాగే ల్యాప్‌టాప్‌లపై రూ.7,000 వరకు, స్మార్ట్ టీవీలపై రూ.5,500 వరకు, గృహోపకరణాలపై అయితే ఏకంగా రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి డబ్బులు పెట్టలేమనుకునేవారికి నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) ఆప్షన్ కూడా ఉంది.
* బ్యాంక్ ఆఫర్లు మీకోసం
ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే, ఎక్స్‌ట్రాగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ICICI అమెజాన్ పే క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లకు అర్హత గల కొనుగోళ్లపై 5% వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.
కూపన్లతో మరింత ఎక్కువ ఆదా
అమెజాన్ కూపన్ల ద్వారా అదనపు ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రత్యేకమైన కూపన్లను ఉపయోగించి, మీరు అదనంగా 45% వరకు తగ్గింపు పొందవచ్చు. కాబట్టి, షాపింగ్ చేసేటప్పుడు కూపన్ల సెక్షన్‌ను ఒకసారి చెక్ చేయడం మర్చిపోకండి.
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయం!
ఈ సేల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి నిజంగా ఒక గొప్ప అవకాశం. ఐకూ 13, వన్‌ప్లస్ 13, మోటారోలా Razr 50 అల్ట్రా, టెక్నో Phantom V ఫోల్డ్ 5G, శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. అంతేకాదు, తక్కువ బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకునేవారి కోసం రెడ్‌మీ, పోకో , శామ్‌సంగ్ , రియల్‌మీ వంటి బ్రాండ్లు రూ.10,000లోపు మోడళ్లను అందుబాటులో ఉంచనున్నాయి.


Click it and Unblock the Notifications








